అబుదాబిలో మొట్టమొదటి హిందూ దేవాలయం : మోదీ ప్రారంభించిన ఈ గుడి గురించి 10 ముఖ్యమైన అంశాలివే..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిర్మించిన మొట్టమొదటి హిందూ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. 2018లో ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఆలయానికి పునాదిరాయి వేశారు. బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ (బీఏపీఎస్) ఈ ఆలయాన్ని నిర్మించింది.
అబుదాబి : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిర్మించిన మొట్టమొదటి హిందూ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దాదాపు రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆలయం మధ్యప్రాచ్యం, యూఏఈలోని హిందూ జనాభాకు అతి ముఖ్యమైనది. 27 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. 2015లో యూఏఈ రాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అబు మ్రీఖా దేవాలయం కోసం 13.5 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. 2019లో మరో 13.5 ఎకరాల భూమిని విరాళం ఇవ్వగా.. ఆలయ నిర్మాణం ఘనంగా ప్రారంభమైంది. ఇది అబుదాబిలోని మొట్టమొదటి రాతితో నిర్మించిన హిందూ దేవాలయం.
అబుదాబీలో భారతీయ సంస్కృతి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) గుర్తింపుల ప్రత్యేక సమ్మేళనంతో ఉంది. మోడీ తన రెండు రోజుల పర్యటనలో BAPS మందిర్ ప్రారంభోత్సవం ముఖ్యంగా ఉంది. ఈ దేవాలయం అబుదాబీలోని రెండవ పెద్ద హిందూ దేవాలయం.
అక్టోబర్ 2022లో, దుబాయ్ లో మొట్టమొదటి హిందూ ఆలయాన్ని యూఏఈ సహన మంత్రి హెచ్‌హెచ్ షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ ప్రారంభించారు. ఇక ప్రారంభించిన ఈ ఆలయంలోకి మార్చి 1 నుంచి ప్రజలను దర్శనానికి అనుమతిస్తారు.
మోడీ 3.0లో భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా మారుస్తా : అబుదాబీలో ఎన్ఆర్ఐలతో ప్రధాని
ఈ ఆలయానికి సంబంధించిన పది ముఖ్యమైన అంశాలివే..
1
దుబాయ్-అబుదాబి షేక్ జాయెద్ హైవేకి సమీపంలోని అల్ రహ్బా సమీపంలోని అబు మురీఖాలో ఇది నిర్మించారు. ఈ ఆలయానికి UAE ప్రభుత్వం 27 ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చింది. 2019లో ఆలయ శంకుస్థాపన జరిగింది.
2
ఈ ఆలయ ప్రాంగణంలో మూడువేలమంది భక్తులు ఒక్కసారిగా దర్శనం చేసుకోవచ్చు. ఇందులో ఒక కమ్యూనిటీ సెంటర్, ఒక ప్రదర్శనశాల,గ్రంథాలయం, పిల్లల పార్కు ఉన్నాయి.
3
ఆలయ ముఖద్వారాన్ని మొత్తం 25వేలకు పైగా రాతి ఫలకలతో నిర్మించారు. దీనికోసం గులాబీ ఇసుకరాయి, పాలరాతి శిల్పాలను చెక్కి అందంగా తయారుచేశారు. ఈ పనికోసం రాజస్థాన్, గుజరాత్ కు చెందిన కళాకారులు పనిచేశారు. ఈ గుడికి వాడిన పింక్ ఇసుకరాయి రాజస్థాన్ నుండి రవాణా అయ్యింది.
4
ఈ ఆలయాన్ని సాంప్రదాయ నాగర్ నిర్మాణ శైలిలో నిర్మించారు. 108 అడుగుల ఎత్తుతో దీన్ని నిర్మించారు. ఆలయ శిఖర భాగంలో ఏడు శిఖరాలు ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. ఈ ఏడు శిఖరాల్లో ఒక్కోటి యూఏఈలోన ఒక్కో ఎమిరేట్స్‌ను సూచిస్తుంది.
5
BAPS మందిర్ చుట్టూ చక్కగా రూపొందించబడిన ఘాట్‌లు, గంగా యమునా నదులను తలపించేలా తీర్చి దిద్దారు. ఈ ఆలయంలో 'డోమ్ ఆఫ్ హార్మొనీ’, 'డోమ్ ఆఫ్ పీస్' అనే రెండు గోపురాలను నిర్మించారు. ఆలయ ప్రవేశం దగ్గర ఎనిమిది విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇది సనాతన ధర్మానికి పునాది అయిన ఎనిమిది విలువలను సూచిస్తుంది.
6
ఆలయం ప్రాంగణంలో ఈ ప్రాంతంలోని పురాతన నాగరికతలను కూడా రాతితో చెక్కారు. మాయ, అజ్టెక్, ఈజిప్షియన్, అరబిక్, యూరోపియన్, చైనీస్, ఆఫ్రికన్ చరిత్రలు చెక్కారు. ఇక ఆలయంలో 'రామాయణం' కథలు కూడా కనిపిస్తాయి.
7
ఈ ఆలయంలో ఏడు మందిరాలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి భారతదేశంలోని ఉత్తర, తూర్పు, పశ్చిమ, దక్షిణ ప్రాంతాల నుండి వచ్చిన వివిధ దేవతలకు అంకితం చేయబడింది.
8
కార్బన్ ఆనవాళ్లు తగ్గించడానికి, ఆలయ నిర్మాణంలో కాంక్రీట్ మిశ్రమంలో సిమెంట్ కు బదులు ఫ్లై యాష్‌ను వాడారు.
9
ఆలయ భద్రత, సుదీర్థకాలం మన్నిక కోసం ఆలయంలో దాదాపు 150 సెన్సార్లు నిర్మాణించారు. ఉష్ణోగ్రత, పీడనం, ఒత్తిడి, భూకంప సంఘటనలను ఇవి పర్యవేక్షిస్తాయి.
10
BAPS మందిర్ ఇప్పటికే MEP మిడిల్ ఈస్ట్ అవార్డ్స్, బెస్ట్ ఇంటీరియర్ డిజైన్ కాన్సెప్ట్ ఆఫ్ ది ఇయర్ 2020, బెస్ట్ ఆర్కిటెక్చర్ స్టైల్, బెస్ట్ ట్రెడిషనల్ నగర్ స్టైల్‌లో 2019 సంవత్సరపు ఉత్తమ మెకానికల్ ప్రాజెక్ట్‌తో సహా అనేక ప్రశంసలు, అవార్డులను గెలుచుకుంది.