- Home
- Feature
- ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న టాప్ 5 జైళ్లు, నరకానికి డెలివరీ అడ్రస్ అని ఏ జైలుని అంటారు?
ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న టాప్ 5 జైళ్లు, నరకానికి డెలివరీ అడ్రస్ అని ఏ జైలుని అంటారు?
ప్రపంచంలో కరుడుగట్టిన నేరస్తులు చాలామంది ఉన్నారు. సమాజానికి ఎంతో ప్రమాదకరమైన వారిని.. సాధారణ జైళ్లలో పెడితే.. వారు ఎప్పటికైనా తప్పించుకునే అవకాశం ఉంటుంది. అటువంటి వారికోసం ప్రత్యేకంగా కట్టిన టాప్ 5 జైళ్ల గురించి మీకు తెలుసా?

అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న టాప్ 5 జైళ్లు
నేరస్థులను మార్చడానికి.. సమాజానికి దూరంగా ఉంచడానికి జైళ్లను నిర్మిస్తారు. అయితే, ప్రపంచంలో కొన్ని అత్యంత ప్రమాదకరమైన నేరస్థులు, ఉగ్రవాదులు , సీరియల్ కిల్లర్ల కోసం ప్రత్యేకంగా నిర్మించిన కొన్ని జైళ్లు ఉన్నాయి. ఇక్కడి భద్రతా ఏర్పాట్లు ఎంత కఠినంగా ఉంటాయంటే, ఇక్కడి నుంచి ఏ ఒక్క ఖైదీ కూడా తప్పించుకోవడం అసాధ్యం. ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే టాప్ 5 జైళ్ల గురించి తెలుసుకుందాం.
ఫూచూ జైలు, జపాన్
ఈ లిస్ట్ లో ఐదవ స్థానంలో జపాన్‌లోని ఫూచూ జైలు ఉంది. ఈ జైలులో ఇప్పటివరకు ఒక్కరంటే ఒక్క ఖైదీ కూడా తప్పించుకోలేకపోయారు. ఇక్కడ వెయ్యి మందికి పైగా సెక్యూరిటీ సిబ్బంది 24 గంటలు పహారా కాస్తుంటారు . ఈ జైలులో అత్యాధునిక బయోమెట్రిక్ స్కానింగ్, కంటి కదలికలను కూడా కనిపెట్టే ఏఐ కెమెరాలు ఉన్నాయి. అలాగే, నేల మీద ఎవరైనా సొరంగాల ద్వారా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే క్షణాల్లో పసిగట్టే సున్నితమైన సౌండ్ వైబ్రేషన్ సెన్సార్లు కూడా అమర్చబడి ఉన్నాయి.
హెచ్ఎంపీ బెల్మార్ష్, బ్రిటన్
నాల్గవ స్థానంలో బ్రిటన్‌లోని హెచ్ఎంపీ బెల్మార్ష్ జైలు ఉంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదులు, దేశద్రోహులు ఈ హై సెక్యూరిటీ జైలులో ఉంటారు. ఈ జైలు చుట్టూ ఉండే గోడల ఎత్తు ఏకంగా 20 అడుగులు ఉంటుంది. నిత్యం సాయుధ బలగాలు, డాగ్ స్క్వాడ్లు ఇక్కడ 24 గంటలు పహారా కాస్తుంటాయి.
గ్వాంటనామో బే, క్యూబా
మూడవ స్థానంలో క్యూబాలోని సముద్రం మధ్యలో ఉండే గ్వాంటనామో బే జైలు ఉంది. ఈ జైలు నుంచి ఖైదీలు తప్పించుకోవడం దేవుడెరుగు, కనీసం బయట నుంచి ఒక చిన్న పిట్ట కూడా లోపలికి రాలేదు. ఈ జైలు చుట్టూ ఏకంగా లక్షలాది ల్యాండ్ మైన్స్ బాంబులను పాతారు.
బ్లాక్ డాల్ఫిన్ జైలు, రష్యా
రెండవ స్థానంలో రష్యాలోని బ్లాక్ డాల్ఫిన్ జైలు ఉంది. రష్యాలోని ఈ జైలులో ఉన్నవారంతా అత్యంత క్రూరులైన నరహంతకులు, ఉగ్రవాదులే. ఇక్కడ ఒక్కో ఖైదీకి సగటున ముగ్గురు గార్డులు, సైబీరియన్ వేట కుక్కలు కాపలాగా ఉంటాయి.
ఏడీఎక్స్ ఫ్లోరెన్స్, అమెరికా
మొదటి స్థానంలో అమెరికాలోని కొలరాడో కొండల మధ్య ఉన్న ఏడీఎక్స్ ఫ్లోరెన్స్ జైలు ఉంది. ఈ జైలును "నరకానికి డెలివరీ అడ్రస్" అని పిలుస్తారు. గత 30 ఏళ్లుగా ఈ జైలు నుండి ఒక్క ఖైదీ కూడా తప్పించుకోలేకపోయాడు. ఇక్కడ 400 మందికి పైగా అత్యంత భయంకరమైన ఖైదీలు ఉన్నారు. ప్రతి ఖైదీని 24 గంటల పాటు పూర్తిగా కాంక్రీట్‌తో చేసిన చీకటి గదిలోనే ఉంచుతారు .












