- Home
- Feature
- Top 5 Most Expensive Foods: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాప్ 5 ఫుడ్స్, కిలో 40 లక్షలు పలికే పండు గురించి మీకు తెలుసా?
Top 5 Most Expensive Foods: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాప్ 5 ఫుడ్స్, కిలో 40 లక్షలు పలికే పండు గురించి మీకు తెలుసా?
Top 5 Most Expensive Foods: ప్రపంచంలో సాధారణ వంటకాల నుంచి కోట్ల విలువ చేసే విలాసవంతమైన వంటకాల వరకు ఎన్నో రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. అందులో కొన్ని లక్షల ధర పలుకుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఖరీదైన టాప్ 5 ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

5. కాశ్మీరి కుంకుమ పువ్వు (Kashmiri Saffron)
వీటి ధర కిలో సుమారు ₹3,00,000 నుండి ₹4,00,000 వరకు ఉంటుంది.
ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో ఒకటి. కేవలం ఒక కిలో కుంకుమ పువ్వును సేకరించడానికి దాదాపు లక్ష 50,000 కుంకుమ పువ్వుల నుండి రేకులను చేతులతో జాగ్రత్తగా తుంచాల్సి ఉంటుంది. దీని సువాసన, రుచి , ఔషధ గుణాలు దీనిని అమూల్యమైనదిగా మారుస్తాయి.
4. కోపీ లువాక్ కాఫీ (Kopi Luwak Coffee)
కిలో సుమారు ₹80,000 నుండి ₹1,00,000 వరకు ఉంటుంది. ఒక కప్పు కాఫీ ధర సుమారు ₹5,000 నుండి ₹7,000 దాకా పలుకుతుంది.
ఈ కాఫీ తయారీ విధానం చాలా భిన్నంగా ఉంటుంది. ఆసియా పామ్ సివెట్ (Asian palm civet) అనే వింత జంతువు కాఫీ పండ్లను తిని విసర్జించిన మలంతో వచ్చిన కాఫీ గింజలను సేకరించి, వాటిని శుభ్రపరిచి ఈ కాఫీ పొడిని తయారు చేస్తారు.
3. యుబారి కింగ్ పుచ్చకాయ (Yubari King Melon)
ఇవి ఒక జత పండ్ల ధర వేలంలో ఏకంగా ₹35,00,000 నుండి ₹40,00,000 వరకు పలికింది.
జపాన్‌లోని గ్రీన్హౌస్లలో అగ్నిపర్వత బూడిదతో కూడిన నేలలో వీటిని అత్యంత శ్రద్ధతో పండిస్తారు. ఒక్కో పండుకు ప్రత్యేకమైన టోపీలు పెట్టి ఎండ నేరుగా తగలకుండా కాపాడుతారు. ఇవి అత్యంత తీపిగా ఉండటంతో జపాన్ ధనికులు వీటిని విలాసవంతమైన బహుమతులుగా ఇచ్చుకుంటారు.
2. వైట్ ట్రఫుల్స్ (White Alba Truffles)
కిలో సుమారు ₹4,00,000 నుండి ₹8,00,000 వరకు ఉంటుంది.
ఇవి సాధారణ పుట్టగొడుగుల లాగా నేలపై పెరిగేవి కావు. ఇటలీలోని ఓక్ చెట్ల వేర్ల కింద నేల లోపల సహజంగా మొలుస్తాయి. వీటిని భూమి నుండి వెలికితీయడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన కుక్కలను లేదా పందులను ఉపయోగిస్తారు .
1. అల్మాస్ కేవియర్ (Almas Caviar)
దీని ధర కిలో అక్షరాల ₹25,00,000 నుండి ₹30,00,000 వరకు ఉంటుంది.
కాస్పియన్ సముద్రంలో నివసించే కనీసం వంద సంవత్సరాల వయసు పైబడిన అరుదైన ఆల్బినో బెలూగా స్టర్జన్ చేపల గుడ్లతో దీనిని తయారు చేస్తారు. గిన్నిస్ రికార్డులకు ఎక్కిన ఈ ఆహారాన్ని సాధారణ ప్యాకింగ్‌లో కాకుండా, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు డబ్బాలో ఉంచి విక్రయిస్తారు .













