MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Feature
  • Top 5 Costliest Cities: లగ్జరీ లైఫ్‌కు కేరాఫ్.. ప్రపంచంలోనే అత్యంత కాస్ట్‌లీ టాప్ 5 సిటీస్ ఇవే

Top 5 Costliest Cities: లగ్జరీ లైఫ్‌కు కేరాఫ్.. ప్రపంచంలోనే అత్యంత కాస్ట్‌లీ టాప్ 5 సిటీస్ ఇవే

Top 5 Costliest Cities 2026: ప్రపంచంలో లగ్జరీ లైఫ్‌స్టైల్ ను అందించే ప్రాంతాలు చాలానే ఉన్నాయి. అయితే, లగ్జరీ లైఫ్‌స్టైల్ ఇండెక్స్‌లో మాత్రం సింగపూర్ టాప్‌లో నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాప్ 5 నగరాల పూర్తి వివరాలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 07 2026, 02:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సిటీగా సింగపూర్.. టాప్ 5 లగ్జరీ నగరాలు ఇవే
Image Credit : Gemini

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సిటీగా సింగపూర్.. టాప్ 5 లగ్జరీ నగరాలు ఇవే

లగ్జరీ లైఫ్ గడపాలంటే ఆస్తులుండాలి.. అంతకుమించి ఆ నగరాల్లో నివసించే సత్తా ఉండాలి. జూలియస్ బేర్ తాజాగా రిలీజ్ చేసిన 2026 లైఫ్‌స్టైల్ ఇండెక్స్ ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితా బయటకు వచ్చింది. ఇందులో వరుసగా నాలుగో ఏడాది కూడా సింగపూర్ తన టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకుంది. పెరిగిపోతున్న ప్రాపర్టీ రేట్లు, కార్ల ధరలు, బలమైన సింగపూర్ డాలర్ వాల్యూ వల్ల ఈ సిటీ రిచ్ పీపుల్‌కు అడ్డాగా మారింది. గ్లోబల్ ఫైనాన్షియల్ సెంటర్‌గా ఉన్న ఈ సిటీతో పాటు ప్రపంచంలోని టాప్ 5 అత్యంత ఖరీదైన నగరాల వివరాలు గమనిస్తే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
లండన్‌కు ఐదో స్థానం
Image Credit : Getty

లండన్‌కు ఐదో స్థానం

బ్రిటన్ రాజధాని లండన్ ఈసారి ఒక స్థానం కిందకు పడిపోయి ఐదో ప్లేస్‌కు చేరుకుంది. స్థానం తగ్గినప్పటికీ, లగ్జరీ ఖర్చుల విషయంలో లండన్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇక్కడి ప్రీమియం ప్రాపర్టీ మార్కెట్, ఎలైట్ ఎడ్యుకేషన్, ఫైన్ డైనింగ్, లగ్జరీ రిటైల్ షాపింగ్ వల్ల ఇది ఇప్పటికీ అత్యంత ఖరీదైన నగరాల్లో ఒకటిగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటీశ్వరులు తమ బిజినెస్, లైఫ్‌స్టైల్ కోసం ఇప్పటికీ లండన్‌ వైపే మొగ్గు చూపుతున్నారు.

Related Articles

Related image1
IRCTC Panch Mahatirth Yatra: ఒకే టికెట్‌పై పూరి, కాశీ, అయోధ్య.. 5 పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ప్యాకేజీ
Related image2
Telangana New Airports: హైదరాబాద్ వెళ్లక్కర్లేదు.. తెలంగాణలో మరో 3 జిల్లాలకు ఎయిర్‌పోర్ట్‌లు.. ఈ ప్రాంతాల రూపురేఖలు ఛేంజ్
36
నాలుగో ప్లేస్‌లో హాంగ్‌కాంగ్
Image Credit : Getty

నాలుగో ప్లేస్‌లో హాంగ్‌కాంగ్

2026 లైఫ్‌స్టైల్ ఇండెక్స్‌లో హాంగ్‌కాంగ్ నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఆసియాలోనే అత్యంత కాస్ట్‌లీ నగరాల్లో ఒకటిగా హాంగ్‌కాంగ్ తన ఇమేజ్‌ను కంటిన్యూ చేస్తోంది. ఇక్కడి భారీ ప్రాపర్టీ ధరలు, ప్రీమియం రిటైల్ మార్కెట్, స్ట్రాంగ్ ఫైనాన్షియల్ సెక్టార్ కారణంగా లగ్జరీ ఖర్చులు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి ఉన్నప్పటికీ, ఇంటర్నేషనల్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్, ధనిక కుటుంబాలకు హాంగ్‌కాంగ్ మెయిన్ డెస్టినేషన్‌గా మారింది.

46
హిస్టరీ క్రియేట్ చేసిన మొనాకో
Image Credit : Getty

హిస్టరీ క్రియేట్ చేసిన మొనాకో

లైఫ్‌స్టైల్ ఇండెక్స్‌ను 2020లో స్టార్ట్ చేసినప్పటి నుంచి చూస్తే, మొనాకో టాప్ 3లోకి రావడం ఇదే మొదటిసారి. అల్ట్రా లగ్జరీ రియల్ ఎస్టేట్, టాక్స్ ఫ్రెండ్లీ పాలసీలు, ఎక్స్‌క్లూజివ్ లైఫ్‌స్టైల్‌కు మొనాకో కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. హై నెట్ వర్త్ ఉన్న వ్యక్తులకు ఇది ఎప్పుడూ ఫేవరెట్ స్పాట్. ప్రీమియం హౌసింగ్, లగ్జరీ సర్వీసులకు ఇక్కడ డిమాండ్ భారీగా పెరగడం వల్లే మొనాకో ఈ ఏడాది మూడో స్థానానికి దూసుకొచ్చింది.

56
మూడు స్థానాలు ఎగబాకిన జూరిచ్
Image Credit : Getty

మూడు స్థానాలు ఎగబాకిన జూరిచ్

స్విట్జర్లాండ్ నగరం జూరిచ్ ఈసారి ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. లండన్‌ను వెనక్కి నెట్టి మరీ జూరిచ్ ఈ రేంజ్‌కు రావడం వెనుక స్విస్ ఫ్రాంక్ కరెన్సీ బలం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎకనామిక్ పరంగా ఏం జరుగుతున్నా, స్విస్ ఫ్రాంక్ సేఫ్ హెవెన్ కరెన్సీగా నిలుస్తోంది. స్విట్జర్లాండ్‌లో ఉన్న పొలిటికల్, ఎకనామిక్ స్టెబిలిటీ వల్ల అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు, ధనవంతులకు జూరిచ్ మోస్ట్ అట్రాక్టివ్ సిటీగా మారింది.

66
నంబర్ 1 ప్లేస్‌లో సింగపూర్
Image Credit : chatgpt

నంబర్ 1 ప్లేస్‌లో సింగపూర్

లగ్జరీ లివింగ్‌లో సింగపూర్‌ను కొట్టే మొనగాడు లేడని మరోసారి నిరూపితమైంది. వరుసగా నాలుగో ఏడాది కూడా ఈ సిటీ స్టేట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా రికార్డు సృష్టించింది. ఇక్కడ నివాస గృహాల ధరలు విపరీతంగా పెరగడం, కార్ ఓనర్‌షిప్ ఖరీదైనది కావడం, సింగపూర్ డాలర్ బలంగా మారడం దీనికి ప్రధాన కారణాలు. పొలిటికల్ స్టెబిలిటీతో పాటు సేఫ్, హై ఎండ్ లైఫ్‌స్టైల్ కావాలనుకునే గ్లోబల్ రిచ్ పీపుల్‌కు సింగపూర్ మొదటి ఛాయిస్‌గా నిలుస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
ప్రపంచం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Motivational Story: మీ మంచిత‌నం మిమ్మ‌ల్ని ముంచేయ‌కూడ‌దు.. జీవితాన్ని మార్చే గొప్ప క‌థ‌
Recommended image2
Psychology: నచ్చినవాళ్లు మనల్ని పట్టించుకోకపోతే ఎందుకు బాధగా అనిపిస్తుంది? సైకాలజీ ఏం చెబుతోంది?
Recommended image3
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Related Stories
Recommended image1
IRCTC Panch Mahatirth Yatra: ఒకే టికెట్‌పై పూరి, కాశీ, అయోధ్య.. 5 పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ప్యాకేజీ
Recommended image2
Telangana New Airports: హైదరాబాద్ వెళ్లక్కర్లేదు.. తెలంగాణలో మరో 3 జిల్లాలకు ఎయిర్‌పోర్ట్‌లు.. ఈ ప్రాంతాల రూపురేఖలు ఛేంజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved