MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Feature
  • Tirupati Temple : తిరుమల గర్భగుడిలో శ్రీవారి మూలవిరాటే కాదు ఇంకా ఏమేం ఉంటాయో తెలుసా? వీటిని కూడా దర్శించుకుంటే పుణ్యఫలం

Tirupati Temple : తిరుమల గర్భగుడిలో శ్రీవారి మూలవిరాటే కాదు ఇంకా ఏమేం ఉంటాయో తెలుసా? వీటిని కూడా దర్శించుకుంటే పుణ్యఫలం

తిరుమలలో ఏడుకొండలపై వెలిసిన వెంకటేశ్వర స్వామిని ఎలా దర్శించుకోవాలి? గర్భగుడిలో శ్రీవారి మూలవిరాట్ తో పాటు ఇంకా ఏ విగ్రహాలు, పవిత్రమైన వస్తువులు ఉంటాయి? తెలుసుకుందాం.

3 Min read
Author : Arun Kumar P
Published : Jul 01 2026, 11:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తిరుమల గర్భగుడిలో ఏమేం ఉంటాయి?
Image Credit : Gemini AI

తిరుమల గర్భగుడిలో ఏమేం ఉంటాయి?

Tirumala : కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల వెంకటేశ్వర స్వామిని నిత్యం వేలాది మంది దర్శించుకుంటారు. స్వామివారి హుండీ ఆదాయమే రోజుకు 3-4 కోట్లు ఉంటుందంటేనే ఏ స్థాయిలో భక్తులు తిరుమలకు వస్తారో అర్థం చేసుకోవచ్చు. చాలామంది కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి శ్రీవారి దర్శనానికి వస్తుంటారు... దీంతో ఏడుకొండలపై ఎప్పుడూ సందడి నెలకొంటుంది.

అయితే గంటలతరబడి క్యూలైన్, కంపార్ట్ మెంట్స్ లో గడిపే భక్తులు గర్భగుడిలోని వెంకటేశ్వరస్వామి దివ్యమంగళ రూపాన్ని చూడగానే మైమరచిపోతారు. సమయం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి స్వామి మూలవిరాట్ ని మాత్రమే దర్శించుకుంటారు. కానీ తిరుమల గర్భగుడిలో భక్తుల దర్శనం కోసం ఇంకెన్నో ఉంటాయి. వాటిగురించి చాలామందికి తెలియదు. కాబట్టి తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏమేం ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
తిరుమల గర్భగుడిలో ఒకటి కాదు ఐదు విగ్రహాలు
Image Credit : Gemini

తిరుమల గర్భగుడిలో ఒకటి కాదు ఐదు విగ్రహాలు

తిరుమల గర్భగుడిలో కేవలం వెంకటేశ్వరస్వామి మూల విరాట్ మాత్రమే కాదు ఐదు విగ్రహాలు ఉంటాయి... వీటిని పంచబేరాలు అంటారు. ఇందులో కేవలం మనం ధృవ బేరం (8 అడుగులు స్వామివారి మూల విరాట్) ను మాత్రమే దర్శించుకుంటాం. ఇతర కౌతు బేరం, ఉత్సవ బేరం, బలిబేరం, స్నపన బేరం దర్శించుకోము. అసలు ఈ విగ్రహాలు గర్భగుడిలో ఉంటాయని కూడా చాలామందికి తెలియదు.

తిరుమల గర్భగుడిలోని మూల విరాట్ తో పాటు ఇతర విగ్రహాలు (పంచబేరాలు) కూడా ప్రత్యేక పూజలు అందుకుంటాయి. ముఖ్యంగా ప్రత్యేక ఉత్సవాలు, అభిషేకాలకు వీటిని ఉపయోగిస్తారు. కొలువు శ్రీనివాసమూర్తి, మలయప్పస్వామి విగ్రహాలు ఈ పంచబేరాల్లో భాగమే. బేరం అంటే ఆగమశాస్త్రంలో మూర్తి లేదా విగ్రహం అని అర్థం… పంచబేరాలు అంటే ఐదు విగ్రహాలని అర్థం.  

Related Articles

Related image1
Tirumala : రూ.300 దర్శన టికెట్స్ దొరకలేవా? నెలరోజుల్లోపే ఇదే క్యూలైన్ లో వెళ్లి శ్రీవారిని దర్శించుకునే సూపర్ ట్రిక్
Related image2
Tirumala Tirupati Secret : తిరుమల గుడి తలుపులు తెరిచాక లోపలికి వెళ్లే ఆ మొదటి వ్యక్తి ఎవరు?
36
భోగ శ్రీనివాసమూర్తిని దర్శించుకొండి
Image Credit : X-@nitin_gadkari

భోగ శ్రీనివాసమూర్తిని దర్శించుకొండి

తిరుమల గర్భగుడిలోకి ప్రవేశించగానే మూల విరాట్ విగ్రహం ఉంటుంది.. అయితే స్వామివారి పాదాలవద్ద గమనిస్తే సుమారు అడుగున్నర ఎత్తులో వెండి విగ్రహం ఉంటుంది. ఇదే భోగ శ్రీనివాసమూర్తి విగ్రహం. ఈ విగ్రహానికి నిత్యం పాలు, నీళ్లతో అభిషేకం చేస్తుంటారు. భక్తులకు భోగభాగ్యాలు అందించేది ఈ స్వామే అని భక్తుల విశ్వాసం. కాబట్టి ఈసారి తిరుమలకు వెళ్లినప్పుడు ఈ స్వామిని కూడా తప్పకుండా దర్శించుకొండి.

46
లక్ష్మీదేవిని దర్శించుకొండి
Image Credit : TTD.com

లక్ష్మీదేవిని దర్శించుకొండి

తిరుమలలో వెంకటేశ్వరస్వామి సతీసమేతంగా కొలువయ్యాడు... మరి అమ్మవారి విగ్రహం ఎక్కడ అనేగా మీ డౌట్. స్వామివారి తన అర్దాంగికి గుండెల్లో చోటు కల్పించారు... మూలవిరాట్ వక్షస్థలంలో మహాలక్ష్మి కొలువై ఉంటుంది. అయితే స్వామివారి అలంకరణ కారణంగా సాధారణంగా అమ్మవారు కనిపించరు... కానీ స్వామి నిజరూప దర్శన సమయంలో అమ్మవారిని దర్శించుకోవచ్చు.

సీతారాములు, రుక్మిణీ కృష్ణుల దర్శనం

తిరుమల గర్భగుడిలో సీతారాములు, లక్ష్మణుడు, రుక్మిణీ కృష్ణుల విగ్రహాలు కూడా ఉంటాయి. అలాగే సుదర్శన చక్రం (చక్రత్తాళ్వార్) విగ్రహాలు, మరికొన్ని సాలగ్రామాలు కూడా ఉంటాయి. ఈ విగ్రహాలు కూడా నిత్యపూజలు అందుకుని అలంకరించి ఉంటాయి. కాబట్టి స్వామివారినే కాదు ఈ రూపాలను కూడా భక్తులు దర్శించుకోవచ్చు.

56
బ్రహ్మ వెలిగించిన అఖండ జ్యోతి
Image Credit : Getty

బ్రహ్మ వెలిగించిన అఖండ జ్యోతి

తిరుమల గర్భగుడిలో నిత్యం వెలుగుతూ ఉండే దీపాలు ఉంటాయి. పురాణాల ప్రకారం ఈ అఖండ దీపాలను స్వయంగా బ్రహ్మదేవుడే వెలిగించాడని చెబుతారు. ఈ రెండు దీపాలు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయి... కాబట్టి వీటిని దర్శించుకున్నా పుణ్యఫలం దక్కుతుంది.

గర్బగుడిలో గడ్డపార

తిరుమల గర్భగుడిలో ఓ గోడకు గడ్డపార కనిపిస్తుంది. దీనితోనే శ్రీ రామానుజార్యుల శిష్యుడైన అనంతాళ్వార్ స్వామివారిని కొట్టినట్లు స్థలపురాణం చెబుతోంది. తిరుమలపై అనంతాళ్వార్ పూలవనాన్ని పెంచుతుండేవాడని... ఓరోజు స్వామివారు బాలుడి రూపంలో వచ్చి సహాయం చేసేందుకు ప్రయత్నించడంతో అనంతాళ్వార్ కోపగించుకున్నట్లు చెబుతారు. శ్రీవారి సేవలో తానొక్కడినే తరించాలని భావించిన అనంతాళ్వార్ బాలుడు రూపంలోని స్వామివారిపైకి గడ్డపార విసరగా అది దవడకు తగిలిందట. అందుకే ఇప్పటికీ స్వామివారి విగ్రహం దవడకు పచ్చకర్పూరం రాస్తారు. ఇలా స్వయంగా వెంకటేశ్వర స్వామిని గాయపర్చిన గడ్డపార ఇప్పటికీ ఆలయంలో కనిపిస్తుంది.

66
విమాన వెంకటేశ్వరస్వామి విగ్రహం
Image Credit : Getty

విమాన వెంకటేశ్వరస్వామి విగ్రహం

తిరుమలలో వెంకటేశ్వర స్వామి వెలిసిన గర్భాలయంపై ఉండే స్వర్ణ గోపురాన్ని ఆనంద నిలయం అంటారు. దీనిపై కూడా గర్భగుడిలోని స్వామివారిని పోలిన విగ్రహం ఉంటుంది. .. దీన్ని విమాన వెంకటేశ్వర స్వామి అంటారు. ఏదైనా కారణంతో గర్భగుడిలోకి వెళ్లలేకపోయినవారు ఈ విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే చాలు ప్రధాన విగ్రహాన్ని దర్శించుకున్న ఫలితం దక్కుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ప్రదక్షిణలు చేసే సమయంలో తప్పకుండా ఈ విమాన వెంకటేశ్వరస్వామిని భక్తులు దర్శించుకుంటారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తిరుపతి
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gas Cylinder Safety : గ్యాస్ సిలిండర్‌పై ఉండే A, B, C, D కోడ్ ఏంటో తెలుసా? దీనిలో ఇంత అర్థం దాగుందా?
Recommended image2
Prime Ministers Favorite Food : నెహ్రూ నుండి మోదీ వరకు.. ఏ ప్రధాని, ఏ ఫుడ్ ఇష్టంగా తినేవారో తెలుసా?
Recommended image3
America: అమెరికాలో ఇండియన్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీతాలు ఎంత ఉంటాయి? నెలకు ఎంత మిగులుతుంది?
Related Stories
Recommended image1
Tirumala : రూ.300 దర్శన టికెట్స్ దొరకలేవా? నెలరోజుల్లోపే ఇదే క్యూలైన్ లో వెళ్లి శ్రీవారిని దర్శించుకునే సూపర్ ట్రిక్
Recommended image2
Tirumala Tirupati Secret : తిరుమల గుడి తలుపులు తెరిచాక లోపలికి వెళ్లే ఆ మొదటి వ్యక్తి ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved