MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Tirumala : రూ.300 దర్శన టికెట్స్ దొరకలేవా? నెలరోజుల్లోపే ఇదే క్యూలైన్ లో వెళ్లి శ్రీవారిని దర్శించుకునే సూపర్ ట్రిక్

Tirumala : రూ.300 దర్శన టికెట్స్ దొరకలేవా? నెలరోజుల్లోపే ఇదే క్యూలైన్ లో వెళ్లి శ్రీవారిని దర్శించుకునే సూపర్ ట్రిక్

Tirumala Darshan Tips : మీరు తిరుమలకు వెళ్లేందకు ప్లాన్ చేస్తున్నారా? అయితే నిన్న (జూన్ 24న) విడుదలైన రూ.300 టికెట్స్ కోసం ట్రైచేసి విఫలం అయ్యారా? ఏం పర్లేదు. మరో మార్గంలో ఇదే రూ.300 టికెట్ క్యూలైన్ లో వెళ్ళి శ్రీవారిని దర్శించుకునే సూపర్ ట్రిక్.. 

3 Min read
Author : Arun Kumar P
| Updated : Jun 25 2026, 04:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తిరుమల శ్రీవారిని ఈజీగా దర్శించుకునే టిప్
Image Credit : Getty

తిరుమల శ్రీవారిని ఈజీగా దర్శించుకునే టిప్

Tirumala Darshanam Tips : హిందువులు మరీముఖ్యంగా తెలుగోళ్లు తిరుమల వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించి కొలుస్తుంటారు. ఆ స్వామివారు వెలిసిన ఏడుకొండలపైకి కాలినడకన చేరుకుని, తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకుని, హుండీలో డబ్బులేసి, ఆ స్వామిని దర్శించుకుంటే చాలు... జీవితం ధన్యం అవుతుందని నమ్ముతారు. అందుకే దేశ నలుమూలల నుండి ప్రతిరోజు లక్షలాదిమంది తిరుమలకు చేరుకుంటున్నారు... దీంతో రద్దీ పెరిగి స్వామివారిని దర్శించుకోవాలంటే ఇబ్బందులు తప్పడంలేదు.

అయితే శ్రీవారి దర్శనం కోసం గంటలతరబడి కంపార్ట్ మెంట్స్ లో వేచి ఉండకుండా 300 రూపాయల టికెట్స్ అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం (TTD). మూడు నెలల ముందే ఈ టికెట్స్ బుక్ చేసుకోవాలి.. ఇవికూడా టిటిడి వెబ్ సైట్ లో ఇలా పెట్టగానే అలా అయిపోతున్నాయి. ప్రతి నెల 24వ తేదీన ఈ ప్రత్యేక దర్శన టికెట్లు జారీ చేస్తుంది టిటిడి... నిన్న (జూన్ 24, బుధవారం) కూడా సెప్టెంబర్, 2026 కు సంబంధించిన ప్రత్యేక దర్శన టికెట్లు వెబ్ సైట్ లో పెట్టింది. క్షణాల్లోనే లక్షల టికెట్లు బుక్ అయిపోయాయి… చాలామందికి టికెట్లు దక్కక నిరాశే ఎదురయ్యింది.

మీకు కూడా శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు లభించలేవా..? ఏం బాధపడకండి. మరికొన్ని మార్గాల్లో కూడా తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా దర్శించుకోవచ్చు... అదీ రూ.300 స్పెషల్ టికెట్స్ కంటే తక్కువ సమయంలో బుక్ చేసుకుని. ఇలాంటి ఓ ట్రిక్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కేవలం నెల రోజుల్లో శ్రీవారి ప్రత్యేక దర్శనం...
Image Credit : Gemini

కేవలం నెల రోజుల్లో శ్రీవారి ప్రత్యేక దర్శనం...

రూ.300 ప్రత్యేక దర్శన క్యూలైన్ లోనే వెళ్లి శ్రీవారిని దర్శించుకోవచ్చు... కానీ మూడు నెలల ముందు కాదు నెల ముందు టికెట్ బుక్ చేసుకోవచ్చు. అయితే ఇందుకోసం కొంచెం ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఎలాగైనా వచ్చేనెల శ్రీవారిని దర్శించుకోవాలని అనుకునేవారు ముందు నెలలోనే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. రూ.300 టికెట్స్ విడుదల చేశాకే టిటిడి ఈ టికెట్లు జారీ చేస్తారు... కాబట్టి ప్రత్యేక దర్శన టికెట్లు దొరకని వారు వీటికోసం ట్రై చేయవచ్చు.

శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్లు ప్రతి నెల 25వ తేదీన జారీ చేస్తుంది టిటిడి... అంటే రూ.300 టికెట్లు జారీచేసిన తర్వాతిరోజు. ఈ టికెట్ ధర రూ.1600 ఉంటుంది... ఇద్దరికి హోమంలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. అలాగే రూ.300 ప్రత్యేక దర్శన మార్గంలో ఈ ఇద్దరిని శ్రీవారి దర్శనానికి అనుమతి కల్పిస్తారు.

Related Articles

Related image1
Tirumala Tirupati Secret : తిరుమల గుడి తలుపులు తెరిచాక లోపలికి వెళ్లే ఆ మొదటి వ్యక్తి ఎవరు?
Related image2
Tirumala : ఇక మతమార్పిడులకు చెక్.. టిటిడి మాస్టర్ ప్లాన్, ఏం చేయబోతున్నారో తెలుసా?
34
శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్ పై దర్శనం ఎలా ఉంటుంది?
Image Credit : TTD Website

శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్ పై దర్శనం ఎలా ఉంటుంది?

వచ్చేనెలకు సంబంధించి అంటే జూలైకి సంబంధించిన శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్లు జూన్ 25న విడుదల చేస్తారు. వచ్చే నెలలో మీరు ఏరోజయితే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని అనుకుంటారో ఆరోజుకి టికెట్ బుక్ చేసుకోవాలి. ఆరోజు ఉదయం 8 గంటల లోపు మీరు హోమం జరిగే స్థలంలో ఉండాలి... 8.30 గంటలకి హోమం ప్రారంభం అవుతుంది. ఈ హోమంలో ఇద్దరు పాల్గొనవచ్చు... వీళ్లు కపుల్స్ అవ్వాల్సిన అవసరం లేదు... స్నేహితులు అంటే ఇద్దరు అమ్మాయిలు లేదా ఇద్దరు అబ్బాయిలు లేదంటే ఇద్దరు కుటుంబసభ్యులు కలిసి పాల్గొనవచ్చు. భక్తి శ్రద్దలతో హోమంలో పాల్గొన్నాక స్వామివారి దర్శనం ఉంటుంది.

ఉదయం 8.30 నుండి 11 గంటలవరకు శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ఉంటుంది… అలిపిరి సప్త గో-ప్రదక్షిణ మందిరంలో నిర్వహిస్తారు. హోమం తర్వాత 2-3 గంటలకు స్వామివారి దర్శనానికి పంపిస్తారు... రూ.300 ప్రత్యేక దర్శన క్యూలైన్ లోనే వెళ్లాల్సి ఉంటుంది. అంటే మూడు నెలల ముందు కాదు నెల రోజుల ముందు కూడా రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు పొందవచ్చన్నమాట... ఇందుకోసం కాస్త ఎక్కువ ఖర్చవుతుందంతే.

44
శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్ ఖర్చు ఎంత?
Image Credit : Getty

శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్ ఖర్చు ఎంత?

నేరుగా రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్ దొరకకుంటే ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ హోం టికెట్ పొందవచ్చు. ఇది రూ.1600 టికెట్... ఇద్దరు హోమంలో పాల్గొని శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. అంటే హోమంలో పాల్గొనేందుకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఇద్దరికి రూ.1000 ఖర్చు అవుతుంది. ఇక స్వామివారి దర్శనానికి రూ.300 చొప్పున ఇద్దరికి రూ.600 ఖర్చు అవుతుంది. ఇద్దరు స్నేహితులు కలిసి ఈ టికెట్ బుక్ చేసుకుంటే ఒక్కొక్కరికి రూ.800 ఖర్చు అవుతుందన్నమాట.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తిరుపతి
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Heavy Rain Alert : ఏపీ, తెలంగాణకు ఐఎండీ అలర్ట్.. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు.. ఏయే జిల్లాలంటే?
Recommended image2
Now Playing
Ambati Rambabu Pressmeet: నాగరాజును కాపాడటానికే ‘సిట్‌’ దర్యాప్తు: అంబటి | Asianet News Telugu
Recommended image3
Now Playing
Perni Nani Comments on Sai Krishna Case:సాయికృష్ణ కేసులో పేర్ని నాని సంచలన కామెంట్స్| Asianet Telugu
Related Stories
Recommended image1
Tirumala Tirupati Secret : తిరుమల గుడి తలుపులు తెరిచాక లోపలికి వెళ్లే ఆ మొదటి వ్యక్తి ఎవరు?
Recommended image2
Tirumala : ఇక మతమార్పిడులకు చెక్.. టిటిడి మాస్టర్ ప్లాన్, ఏం చేయబోతున్నారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved