MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Feature
  • Gadida Guddu: గాడిద గుడ్డు పదం వెనుక ఉన్న అసలు కథ ఇదే

Gadida Guddu: గాడిద గుడ్డు పదం వెనుక ఉన్న అసలు కథ ఇదే

Gadida Guddu: గాడిద గుడ్డు అనే పదం ఎన్నోసార్లు వినే ఉంటారు. అసలు ఆ పదం ఎలా పుట్టిందో ఎప్పుడైనా ఆలోచించారా? మీరు కూడా ఆ పదాన్ని ఎన్నో వాడే ఉంటారు. గాడిద గుడ్డు పెట్టకపోయినా.. ఈ పదం పుట్టుక వెనుక ఒక కథ ఉంది. 

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 13 2026, 07:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
గాడిద గుడ్డు అంటే ఏమిటి?
Image Credit : Chatgpt

గాడిద గుడ్డు అంటే ఏమిటి?

తెలుగు ప్రజలు గాడిద గుడ్డు అనే పదం చిన్నప్పటి నుంచి వినే ఉంటారు. ముఖ్యంగా ఎనభై, తొంభైలలో పుట్టిన కిడ్స్ ఈ పదాన్ని ఎక్కువగా వినియోగించేవారు. గాడిద గుడ్డు పెట్టకపోయినా కూడా గాడిద గుడ్డు అనే పదం పుట్టుకొచ్చింది. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అది నమ్మలేని విధంగా ఉన్నా, అసలు జరగని విషయం జరిగినట్టు చెబుతున్నా... చాల్లే గాడిదగుడ్డు అని అనేస్తూ ఉంటారు. అంటే ఆ విషయం నిజం కాదని అలా జరిగే వీలు లేదని చెప్పడమే. ఈ గాడిద గుడ్డు వెనుక చాలా కథ ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
గాడిద గుడ్డు వెనుక కథ
Image Credit : Chatgpt

గాడిద గుడ్డు వెనుక కథ

దాదాపు వందేళ్ల క్రితం ఒక బ్రిటిష్ దొర సముద్ర ప్రయాణం చేస్తూ పెద్ద తుఫానులో చిక్కుకుపోయాడు. గాలి బలంగా వీచి అలలు ఎగిసిపడుతూ ఓడ మునిగిపోతుందేమో అన్న పరిస్థితి వచ్చింది. అందరూ చాలా భయపడిపోయారు.. కానీ ఎలాగోలాగా ఆ ఓడ సురక్షితంగా మనదేశంలోని కేరళలో ఉన్న కొచ్చి రేవుకు చేరింది. ప్రాణాలతో బయటపడ్డాడని ఆనందంతో అతడు నేల మీద అడుగు పెట్టాడు. అతడిని ఆహ్వానించడానికి మన తెలుగు అధికారులు, స్థానికులు వెళ్లారు. అందులో ఒక తెలుగు వ్యక్తికి కొన్ని ఇంగ్లీష్ పదాలు తెలుసు. అది కూడా చాలా తక్కువగా మాత్రమే అర్థం చేసుకోగలడు. కొన్ని మాటలు మాత్రమే ఆయన తెల్లదొరతో మాట్లాడేందుకు ప్రాక్టీసు చేసి వచ్చాడు.

Related Articles

Related image1
Headache: నాలుక కింద చిటికెడు ఉప్పు పెట్టుకుంటే తలనొప్పి తగ్గిపోతుందా?
Related image2
Zodiac signs: ఈ 3 రాశుల వారు ఇచ్చిన మాట నిలబెట్టుకోరు, వీరిని నమ్మడం కష్టమే
33
ఏదో అంటే ఇలా అర్థం చేసుకుని
Image Credit : Chatgpt

ఏదో అంటే ఇలా అర్థం చేసుకుని

బ్రిటిష్ దొర ఓడ దిగి రాగానే ఆ తెలుగు వ్యక్తి ‘How did you come sir?’ అని అడిగాడు. ఆ దొర తుఫాను గురించి వేగంగా ఇంగ్లీషులో చెప్పుకుంటూ వెళ్ళాడు. కానీ అతను చెప్పిన మాటలు తెలుగు వ్యక్తికి సరిగా వినిపించలేదు అర్థం కూడా కాలేదు. ఆ తెల్ల దొర ‘God the good conquered peace' అని చెప్పాడు. దీనికి అర్థం దేవుడు మంచివాడు, శాంతి జయించింది అని. దాంతో ఆ తెలుగు వ్యక్తికి ఆ ఆంగ్ల పదాలు ‘గాడిద గుడ్డు కంకర పాసు’ అన్నట్టు వినిపించింది. అదే విషయాన్ని చుట్టు పక్కల వారికి చెప్పాడు. అప్పటినుంచి ఈ పదం ఒకరి నుంచి ఒకరికి పాకి వాడుకలోకి వచ్చినట్టు చెప్పుకుంటారు. తర్వాత అది సరదాగా చెప్పుకునే మాటగా మారిపోయింది.

కాలక్రమంలో గాడిద గుడ్డు కంకర పాసు అన్న పదబంధం విడిపోయింది. చివరికి గాడిద గుడ్డు అనే చిన్న పదానికి మిగిలిపోయింది. ఎవరైనా అబద్ధం చెప్పినా, అతిగా జరగనివి జరిగినట్టు ఊహించినా ఇలా గాడిద గుడ్డు అని అనేసి నవ్వుకుంటూ ఉంటారు. ఈ కథ నిజమో కాదో చెప్పడం కష్టం కానీ.. గాడిద గుడ్డు అనే మాట మాత్రం ఇప్పటికీ తెలుగు మాట్లాడే వారి నోళ్ళల్లో నానుతూనే ఉంటుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఫీల్ గుడ్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gas Cylinder Safety : గ్యాస్ సిలిండర్‌పై ఉండే A, B, C, D కోడ్ ఏంటో తెలుసా? దీనిలో ఇంత అర్థం దాగుందా?
Recommended image2
Prime Ministers Favorite Food : నెహ్రూ నుండి మోదీ వరకు.. ఏ ప్రధాని, ఏ ఫుడ్ ఇష్టంగా తినేవారో తెలుసా?
Recommended image3
America: అమెరికాలో ఇండియన్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీతాలు ఎంత ఉంటాయి? నెలకు ఎంత మిగులుతుంది?
Related Stories
Recommended image1
Headache: నాలుక కింద చిటికెడు ఉప్పు పెట్టుకుంటే తలనొప్పి తగ్గిపోతుందా?
Recommended image2
Zodiac signs: ఈ 3 రాశుల వారు ఇచ్చిన మాట నిలబెట్టుకోరు, వీరిని నమ్మడం కష్టమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved