MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Feature
  • Worlds ugliest car: ప్రపంచంలోనే అత్యంత వికారమైన కారు ఇది.. 35 ఏళ్ల తరువాత మళ్లీ రోడ్డు మీదకొచ్చింది

Worlds ugliest car: ప్రపంచంలోనే అత్యంత వికారమైన కారు ఇది.. 35 ఏళ్ల తరువాత మళ్లీ రోడ్డు మీదకొచ్చింది

Worlds ugliest car: ప్రపంచంలోనే అత్యంత వికారమైన కారుగా తూర్పు జర్మనీ 'ట్రాబంట్ 601' కు గుర్తింపు ఉంది. అసలు ఎందుకు ఈ కారు అత్యంత అధ్వాన్నమైన కారుగా నిలిచింది? ఈ కారు గురించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 18 2026, 08:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రపంచంలోనే వరస్ట్ కారు..
Image Credit : Gemini

ప్రపంచంలోనే వరస్ట్ కారు..

తూర్పు జర్మనీకి చెందిన ట్రాబంట్ 601 కారు గురించి వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. దీనిని ప్రేమగా ‘ట్రాబీ’ అని పిలుచుకునేవారు. కానీ, ప్రపంచ ఆటోమొబైల్ చరిత్రలో దీనికి ప్రపంచంలోనే అత్యంత అధ్వాన్నమైన కారు అనే అప్రతిష్ఠ ఉంది. ప్లాస్టిక్ బాడీ, విపరీతమైన పొగ, తక్కువ వేగం.. ఇలాంటి ఎన్నో లోపాలు ఉన్నప్పటికీ, ఒకప్పుడు ఈ కారును సొంతం చేసుకోవడం ఒక కలగా ఉండేది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్లాస్టిక్ బాడీ.. గుర్రపు వెంట్రుకల సీట్లు !
Image Credit : Gemini

ప్లాస్టిక్ బాడీ.. గుర్రపు వెంట్రుకల సీట్లు !

ట్రాబంట్ కారును 1950వ దశకంలో అభివృద్ధి చేశారు. అప్పట్లో ఉక్కు కొరత ఉండటంతో, ఇంజనీర్లు దీనిని డ్యూరోప్లాస్ట్ అనే ప్రత్యేక పదార్థంతో తయారు చేశారు. ఇది కాటన్ ఫైబర్, సింథటిక్ రెసిన్ కలిపి చేసిన ఒక రకమైన ప్లాస్టిక్. అందుకే దీనిని ప్రజలు తమాషాగా నడిచే కార్డ్‌బోర్డ్ అని పిలిచేవారు. కారు లోపల సీట్లలో దూదికి బదులు గుర్రపు వెంట్రుకలను నింపేవారు. ఈ కారులో కనీసం ఫ్యూయల్ గేజ్ అంటే పెట్రోల్ ఎంత ఉందో చూపే మీటర్ కూడా ఉండేది కాదు.

Related Articles

Related image1
Raining Fish : ఆకాశం నుంచి చేపల వర్షం.. 150 ఏళ్లుగా వీడని వింత మిస్టరీ !
Related image2
Pink Lake: ఈ సరస్సులో నీళ్లు స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ లాగా ఎందుకు ఉంటాయో తెలుసా?
35
13 ఏళ్ల నిరీక్షణ..
Image Credit : Gemini

13 ఏళ్ల నిరీక్షణ..

తూర్పు జర్మనీలో ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల కార్ల లభ్యత చాలా తక్కువగా ఉండేది. దీంతో ఒక ట్రాబంట్ కారు కావాలంటే 10 నుండి 13 ఏళ్ల పాటు వేచి చూడాల్సి వచ్చేది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అక్కడ పిల్లలు పుట్టగానే తల్లిదండ్రులు వారి పేరు మీద కారును బుక్ చేసేవారు. ఆ బిడ్డ పెరిగి పెద్దయ్యే సరికి కారు డెలివరీ వచ్చేది. ఒకవేళ ఎవరైనా సెకండ్ హ్యాండ్ కారు అమ్మితే, అది కొత్త కారు ధర కంటే రెట్టింపు ధర పలికేది.

45
పొగబెట్టే ఇంజన్..
Image Credit : Gemini

పొగబెట్టే ఇంజన్..

ట్రాబంట్ 601లో కేవలం 23 హార్స్‌పవర్ ఇచ్చే రెండు సిలిండర్ల ఇంజన్ ఉండేది. ఇది విపరీతమైన పొగను వదిలేది. ఒక రచయిత దీనిని "ఇరాక్ చమురు బావుల మంటలంత పొగ వస్తుంది" అని పేర్కొనడం దాని నుంచి వచ్చే పొగ ఏ స్థాయిలో ఉండేదో తెలియజేస్తుంది. ఈ కారు 0 నుండి 60 మైళ్ల వేగాన్ని అందుకోవడానికి ఏకంగా 21 సెకన్ల సమయం తీసుకునేది. గరిష్ఠ వేగం కూడా గంటకు 100 కిలోమీటర్లు దాటేది కాదు. 34 ఏళ్ల పాటు ఉత్పత్తిలో ఉన్నా, ఇందులో ఎలాంటి ఆధునిక మార్పులు చేయకపోవడం గమనార్హం.

55
కమ్యూనిజం పతనానికి నిదర్శనం..
Image Credit : Gemini

కమ్యూనిజం పతనానికి నిదర్శనం..

1957లో రష్యా స్పుత్నిక్ శాటిలైట్‌ను ప్రయోగించిన సమయంలో ఈ కారును తయారు చేశారు. అందుకే దీనికి జర్మన్ భాషలో శాటిలైట్ అని అర్థం వచ్చే ట్రాబంట్ అని పేరు పెట్టారు. అయితే, పశ్చిమ దేశాల కార్లు వేగంగా అభివృద్ధి చెందుతుంటే, తూర్పు జర్మనీ మాత్రం దశాబ్దాల కాలం నాటి పాత సాంకేతికతతోనే ఈ కార్లను తయారు చేస్తూ ఉండిపోయింది. 1989లో బెర్లిన్ గోడ కూలిపోయినప్పుడు, వేల సంఖ్యలో తూర్పు జర్మనీ ప్రజలు ఈ కార్లలోనే సరిహద్దులు దాటి పశ్చిమ జర్మనీకి వెళ్లారు.

నేడు క్లాసిక్ కారుగా క్రేజ్

ఒకప్పుడు పనికిరాని కారుగా ముద్రపడి, బెర్లిన్ గోడ పతనం తర్వాత రోడ్ల మీద వదిలేసిన ఈ ట్రాబంట్లు ఇప్పుడు మళ్లీ క్రేజ్ సంపాదించుకున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 33,000 ట్రాబంట్లు అందుబాటులో ఉన్నాయి. జర్మనీలో అనేక క్లాసిక్ కార్ క్లబ్బులు వీటిని ఎంతో జాగ్రత్తగా కాపాడుతున్నాయి. చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టానికి సాక్ష్యంగా నిలిచిన ఈ బుజ్జి కారు ఇప్పుడు వేల డాలర్ల ధరకు వేలంలో అమ్ముడవుతోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gas Cylinder Safety : గ్యాస్ సిలిండర్‌పై ఉండే A, B, C, D కోడ్ ఏంటో తెలుసా? దీనిలో ఇంత అర్థం దాగుందా?
Recommended image2
Prime Ministers Favorite Food : నెహ్రూ నుండి మోదీ వరకు.. ఏ ప్రధాని, ఏ ఫుడ్ ఇష్టంగా తినేవారో తెలుసా?
Recommended image3
America: అమెరికాలో ఇండియన్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీతాలు ఎంత ఉంటాయి? నెలకు ఎంత మిగులుతుంది?
Related Stories
Recommended image1
Raining Fish : ఆకాశం నుంచి చేపల వర్షం.. 150 ఏళ్లుగా వీడని వింత మిస్టరీ !
Recommended image2
Pink Lake: ఈ సరస్సులో నీళ్లు స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ లాగా ఎందుకు ఉంటాయో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved