MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Beard Hygiene : గడ్డం పెంచడం మంచిదా, కాదా? సైన్స్ ఏం చెబుతోంది?

Beard Hygiene : గడ్డం పెంచడం మంచిదా, కాదా? సైన్స్ ఏం చెబుతోంది?

గడ్డం పెంచడం అపరిశుభ్రం అని చాలామంది భావిస్తుంటారు, అందుకే క్లీన్ షేవ్ తో కనిపిస్తుంటారు. మరి నిజంగానే ముఖంపై గడ్డం ఉండటంవల్ల అనారోగ్య సమస్యలు వస్తాయా? సైన్స్ ఏం చెబుతోంది? 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Jul 04 2026, 02:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గడ్డం పెంచడం అపరిశుభ్రమా?
Image Credit : Getty

గడ్డం పెంచడం అపరిశుభ్రమా?

మగాళ్ల ముఖంపై మీసాలు, గడ్డాలు సహజంగానే పెరుగుతుంటాయి… కానీ వీటిపై అనేక అపోహలు ఉన్నాయి. మీసాలు పెంచడం ఓకే కానీ గడ్డం పెంచడాన్ని చాలామంది తప్పుగా భావిస్తుంటారు. గడ్డం ఆరోగ్య సమస్యలకు అడ్డాగా పేర్కొంటారు… దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని భయపడుతుంటారు. అందుకే పేరెంట్స్ వయసుకు వచ్చిన కొడుకు స్టైలిష్ గా గడ్డం పెంచుతామంటే ససేమిరా ఒప్పుకోరు. కొందరు భార్యలు కూడా భర్తలను గడ్డం పెంచనివ్వరు. 

ఇప్పుడే కాదు మగాళ్లు గడ్డం పెంచితే ముఖంపై మురికి, బ్యాక్టీరియా సులభంగా చేరిపోతాయని దశాబ్దాలుగా ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. చివరకు తమ కుటుంబసభ్యులే కాదు గడ్డం పెంచినవారిని చూస్తేనే అసహ్యించుకునే స్థాయికి పరిస్థితి చేరింది. రెస్టారెంట్లలో గడ్డం ఉన్న వెయిటర్లను చూసి చాలామంది కస్టమర్లు అపరిశుభ్రంగా భావిస్తారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మరి మగాళ్ల గడ్డంపై ఏర్పడిన ఈ అభిప్రాయంలో నిజమెంత?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గడ్డం గురించి సైన్స్ ఏం చెబుతుంది?
Image Credit : Getty

గడ్డం గురించి సైన్స్ ఏం చెబుతుంది?

లండన్ ఇంపీరియల్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ జాన్ ట్రెగోనింగ్ (John Tregoning) మగాళ్ల గడ్డంపై అద్యయనం చేశారు. ఈ క్రమంలో గడ్డం ఉన్న మగవాళ్లను ప్రజలు మరీముఖ్యంగా ఆడవాళ్ళు అపరిశుభ్రంగా ఉన్నట్లు చూస్తారని ఆయన గుర్తించారు. ఆయన చేపట్టిన అధ్యయనంలోనే రెస్టారెంట్‌కు వచ్చే కస్టమర్లు గడ్డం ఉన్న సర్వర్ల కన్నా క్లీన్-షేవ్ చేసిన వారినే శుభ్రంగా భావిస్తున్నట్లు తేలింది. కానీ ఈ అభిప్రాయాన్ని సైన్స్ పూర్తిగా అంగీకరించడం లేదు.

35
గడ్డంపై ఆసక్తికర అధ్యయనం... ఏం చెబుతోంది?
Image Credit : Getty

గడ్డంపై ఆసక్తికర అధ్యయనం... ఏం చెబుతోంది?

మగాళ్ల గడ్డంపై ఉన్న అపోహలను తొలగించేందుకు 1967లోనే ఒక అధ్యయనం జరిగింది. గడ్డం ఉన్న, లేని ముఖాలపై పరిశోధకులు కృత్రిమంగా బ్యాక్టీరియాను చల్లి పరీక్షించారు… దాని ఫలితాలు ఆశ్చర్యపరిచాయి. ముఖం కడుక్కోకుండా క్లీన్-షేవ్ చేసుకున్న వాళ్ల ముఖంపైనే ఎక్కువ బ్యాక్టీరియా కనిపించింది. ముఖం కడుక్కోకుండా గడ్డం ఉన్నవాళ్లలో బ్యాక్టీరియా చాలా తక్కువగా ఉంది. దీన్నిబట్టి గడ్డం ముఖంపై సూక్ష్మజీవులకు ఆవాసం కాదని స్పష్టం అయ్యింది. 

45
వైద్య రంగంలో పరిస్థితి ఏంటి?
Image Credit : Getty

వైద్య రంగంలో పరిస్థితి ఏంటి?

ఇటీవలి అధ్యయనాలు ఎక్కువగా గడ్డం కలిగిన డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందిపై జరిగాయి. ఆసుపత్రుల్లో గడ్డం వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయా అనే ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం రాలేదు. కొన్ని స్టడీస్ గడ్డంలో బ్యాక్టీరియా చిక్కుకుంటుందని చెప్పగా, మరికొన్ని పెద్ద తేడా ఏమీ లేదని అంటున్నాయి. మాస్కులు సరిగ్గా ధరిస్తే, గడ్డం వల్ల పెద్దగా ఆరోగ్య సమస్యలు రావని చాలామంది పరిశోధకుల అభిప్రాయం.

55
చివరికి గడ్డం గురించి తేలిందేంటంటే...
Image Credit : Getty

చివరికి గడ్డం గురించి తేలిందేంటంటే...

గడ్డం అపరిశుభ్రం అనే భయం కేవలం అతిశయోక్తి. మనిషి శరీరంలో ఏ భాగంలోనైనా, వెంట్రుకలు ఉన్నా లేకపోయినా బ్యాక్టీరియా ఉండటం సహజం. ముఖంపై గాయాలు లేనంత వరకు ఈ బ్యాక్టీరియాతో ఎలాంటి సమస్య ఉండదు. కాబట్టి రోజూ ముఖాన్ని శుభ్రంగా ఉంచుకుంటే, గడ్డం పెంచుకోవడం పూర్తిగా సురక్షితం, ఆరోగ్యకరమే. గడ్డం పెంచుకున్నా, క్లీన్ షేవ్ తో ఉన్నా ఆరోగ్యపరంగా పెద్ద తేడా ఉండదని అద్యయనాల సారాంశం. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
పురుషులు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఒక‌ప్పుడు లేని ఎక్స్పైరీ డేట్లు ఇప్పుడే ఎందుకొచ్చాయి? తేదీ దాటితే ఆహారం నిజంగా పాడైన‌ట్లేనా?
Recommended image2
Indian Railway Temple: రైలు పట్టాలపై ఆలయం...మరి రైళ్లు ఎలా వెళ్తాయి?
Recommended image3
Land of Horses : ఇక్కడ మనుషుల కంటే గుర్రాలే ఎక్కువ.. ల్యాండ్ ఆఫ్ హార్సెస్ గా పిలిచే దేశమేదో తెలుసా?
Related Stories
Recommended image1
Benifits of having Beard: ‘గడ్డం’తో హెల్త్ బెనిఫిట్స్..
Recommended image2
Beard: గడ్డం త్వరగా పెరగాలంటే? ఈ టిప్స్ ఫాలోకండి.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved