MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Mushrooms: అత్యంత ప్రమాదకరమైన పుట్టగొడుగులు.. చిన్న ముక్క తిన్నా చాలు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి

Mushrooms: అత్యంత ప్రమాదకరమైన పుట్టగొడుగులు.. చిన్న ముక్క తిన్నా చాలు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి

Mushrooms: పుట్టగొడుగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిని తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు అందుతాయి.అయితే వాటిలో కొన్ని విషపూరితమైనవి ఉంటాయి. ఎక్కువ ఇవి అడవుల్లోనే పెరుగుతాయి. వాటిపేరు ‘డెత్ క్యాప్’ మష్రూమ్స్.

1 Min read
Author : Haritha Chappa
Published : Oct 07 2026, 09:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ప్రపంచంలోనే విషపూరిత పుట్టగొడుగులు
Image Credit : Gemini AI

ప్రపంచంలోనే విషపూరిత పుట్టగొడుగులు

ఈ పుట్టగొడుగులను చూస్తే సాధారణమైన వాటిలాగే కనిపిస్తాయి. మనం నిత్యం మార్కెట్లో కొనే పుట్టగొడుగుల మాదిరిగానే అనిపిస్తాయి. కానీ ప్రపంచంలోనే ప్రాణాంతకమైన మష్రూమ్స్ ఇవి. పేరు 'డెత్ క్యాప్ మష్రూమ్'. శాస్త్రీయంగా దీన్ని అమానిటా ఫాలోయిడెస్ అని పిలుస్తారు.

ప్రపంచవ్యాప్తంగా పుట్టగొడుగుల విషం వల్ల చనిపోయే వారిలో సుమారు 90 శాతం మంది ప్రాణాలు దీని వల్లే పోతున్నాయి. లేత పసుపు, పచ్చ రంగుల కలబోతతో ఉండే ఈ పుట్టగొడుగును బాగా ఉడికించినా, వేయించినా లేదా ఎండబెట్టినా ఇందులోని విషం తీవ్రత ఏమాత్రం తగ్గదు.

కేవలం ఒకే ఒక్క పుట్టగొడుగులో సగం ముక్క తిన్నా చాలు మనిషి ప్రాణం గాల్లో కలిసిపోయేంత ప్రాణాంతక విషం ఇందులో దాగి ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఎలా మరణిస్తారు?
Image Credit : Gemini AI

ఎలా మరణిస్తారు?

డెత్ క్యాప్ పుట్టగొడుగు తిన్న వెంటనే శరీరంలో అనేక రకాల మార్పులు కనిపిస్తాయి. ఇందులోని 'అమాటాక్సిన్స్' అనే తీవ్రమైన విష పదార్థాలు శరీర కణాల పనితీరును దెబ్బతీస్తాయి. తిన్న ఆరు నుంచి పన్నెండు గంటల తర్వాత తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు మొదలై శరీరం నీరసించిపోతుంది. ఆ తర్వాత రోజు వాంతులు తగ్గిపోయి, రోగి కోలుకుంటున్నట్లు భ్రమ కలిగిస్తుంది. కానీ లోపల మాత్రం ఆ విషం చాపకింద నీరులా విస్తరిస్తూ నిశ్శబ్దంగా కాలేయం, కిడ్నీల కణాలను పూర్తిగా నాశనం చేస్తుంది.

33
అడవుల్లో దొరికే పుట్టగొడుగులు
Image Credit : foodsafety.osu.edu

అడవుల్లో దొరికే పుట్టగొడుగులు

చివరి దశకు చేరుకునేసరికి పరిస్థితి పూర్తిగా విషమిస్తుంది. కాలేయం, మూత్రపిండాలు పూర్తిగా పనిచేయడం మానేస్తాయి. కామెర్లు రావడం, అంతర్గత రక్తస్రావం జరగడం మొదలై బాధితులు కోమాలోకి వెళ్లిపోతారు. సరైన సమయంలో అత్యవసర వైద్యం అందకపోతే అవయవాలు విఫలమై మరణం ఖాయమవుతుంది. సాధారణ తినే పుట్టగొడుగుల పోలికలతో అడవులు, చెట్ల మొదళ్ల వద్ద సహజంగా మొలిచే ఈ ‘డెత్ క్యాప్’ ప్రమాదం గురించి తెలియక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే అటవీ ప్రాంతాల్లో దొరికే తెలియని పుట్టగొడుగులను ఎట్టిపరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదని నిపుణులు గట్టిగా హెచ్చరిస్తుంటారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rain: మన దేశంలో సంవత్సరమంతా వర్షం పడే ప్రదేశం ఇది...!
Recommended image2
పెంగ్విన్స్, ఎలుకలు కూడా లవ్ చేసుకుంటాయా? ఎలా ప్రపోజ్ చేసుకుంటాయి?
Recommended image3
మనదేశంలో మద్యం చవకగా దొరికే ప్రాంతం అదే.. రూ.100కే లగ్జరీ బాటిల్స్
Related Stories
Recommended image1
మనదేశంలో మద్యం చవకగా దొరికే ప్రాంతం అదే.. రూ.100కే లగ్జరీ బాటిల్స్
Recommended image2
First Bank: మనదేశంలో మొట్టమొదటి బ్యాంక్ ఏది? ఇప్పటికీ అది పనిచేస్తోందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved