MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Entrance Exams : పదో తరగతి తర్వాత ఫ్రీగా ఇంటర్ చదవాలా..? అయితే తప్పక రాయాల్సిన ప్రవేశ పరీక్షలివే

Entrance Exams : పదో తరగతి తర్వాత ఫ్రీగా ఇంటర్ చదవాలా..? అయితే తప్పక రాయాల్సిన ప్రవేశ పరీక్షలివే

Entrance Exams in Telangana 2026 :  పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా చదివినట్లే ఇంటర్మీడియట్ కూడా ఫ్రీగా చదువుకోవచ్చు. ఇందుకోసం తెలంగాణ విద్యార్థులు రాయాల్సిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏవో తెలుసా..?

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 07 2026, 11:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పదో తరగతి ప్రీగా చదవాలంటే ఏం చేయాలి..?
Image Credit : Meta AI

పదో తరగతి ప్రీగా చదవాలంటే ఏం చేయాలి..?

Telangana Entrance Exams : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎగ్జామ్స్ సీజన్ కొనసాగుతోంది. ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియగా పదో తరగతి ఎగ్జామ్స్ కొనసాగుతున్నాయి. అయితే ప్రాథమిక విద్యకు ముుగింపుపలికి ఉన్నత విద్యవైపు అడుగువేసే సమయం చాలా కీలకమైంది... విద్యార్థి కెరీర్ ను ఇదే డిసైడ్ చేస్తుంది. అందుకే టెన్త్ తర్వాత తమ పిల్లలను ఇంటర్మీడియట్ ఎక్కడ చదివించాలి..? ఏ కోర్సులో చేర్చాలి..? అని తల్లిదండ్రులు తర్జనభర్జన పడుతుంటారు.

అయితే కొందరు విద్యార్థులు పేదరికాన్ని దాటుకుని చదువులో ప్రతిభ కనబరుస్తుంటారు.. పదో తరగతిలో మంచి మార్కులు సాధిస్తారు. కానీ వారికి ప్రైవేట్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ విద్య భారంగా మారుతుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వమే వారికి అండగా నిలిచి వివిధ మార్గాల్లో ఉచితంగా ఇంటర్మీడియట్ విద్యను అందిస్తోంది. ఇలా టెన్త్ తర్వాత ఫ్రీగా ఇంటర్ చదవాలంటే కొన్ని పోటీ పరీక్షలు రాయాల్సివుంటుంది. ఈ పరీక్షల షెడ్యూల్ వెలువడింది... దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. కాబట్టి పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకొండి.

25
10వ తరగతి తర్వాత ముఖ్యమైన ఎంట్రెన్స్ ఎగ్జామ్స్
Image Credit : Getty

10వ తరగతి తర్వాత ముఖ్యమైన ఎంట్రెన్స్ ఎగ్జామ్స్

1. కస్తూర్బా గాంధీ (KGBV) :

రాష్ట్రంలోని కస్తూర్భా గాందీ బాలికల విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. కేవలం బాలికలకు మాత్రమే అవకాశం...ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీ వర్గాలతో పాటు అనాథలకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. KGBV లో చదువుకునేందుకు అర్హత సాధించిన బాలికలకు ఉచిత విద్య, వసతి, భోజన సౌకర్యం కల్పిస్తారు. అంతేకాదు జాతీయస్థాయిలో జరిగే ఐఐటీ, నీట్ ఎగ్జామ్స్ కి ఉచితంగా కోచింగ్ ఇస్తారు.

దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ : ఏప్రిల్ 10, 2026  

Related Articles

Related image1
Competitive Exam Tips : చండి పాదాల అండ.. ఈ మూడు పదాలు గుర్తుపెట్టుకుంటే చాలు మంచి మార్కులు..!
Related image2
Exam Tips : ఎగ్జామ్స్ కు ముందు టెన్షన్ తగ్గించుకునే... టాప్ 5 గోల్డెన్ టిప్స్
35
 2. TSRJC CET (MPC, BiPC, MEC)
Image Credit : Getty

2. TSRJC CET (MPC, BiPC, MEC)

తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్ కాలేజీల్లో (TSRJC) 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈసారి పదో తరగతి పాసయ్యే అభ్యర్థులకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రంల్లో 33 జిల్లాల్లో 35 జూనియర్ కాలేజీలున్నాయి... వీటిలో 15 బాలురు, 20 బాలికలవి ఉన్నాయి. ఇందులో సీటు సాధించాలంటే రెగ్యులర్ గానే పదవ తరగతి పరీక్షల్లో పాసై ఉండాలి.. సప్లిమెంటరీలో పాసైనవారు అనర్హులు.

దరఖాస్తులు ప్రారంభం : 16 మార్చి 2026

దరఖాస్తుకు చివరితేదీ : 15 ఏప్రిల్ 2026

పరీక్ష తేదీ : 03 మే 2026

45
3. ట్రైబల్ వెల్ఫెర్ (TTWREIS) : MPC, BiPC
Image Credit : Getty

3. ట్రైబల్ వెల్ఫెర్ (TTWREIS) : MPC, BiPC

తెలంగాణలోని గిరిజన (ఎస్టీ) గురుకుల జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 'తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (TTWREOS)'' ఎంట్రన్స్ టెస్ట్ 2026 ద్వారా సీట్లను భర్తీ చేయనున్నారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, హాస్టల్ వసతి ఉంటుంది... అలాగే జాతీయ స్థాయి ఎంట్రన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు.

ఏప్రిల్ 7,2026 వరకు దరఖాస్తుకు అవకాశం

55
4. ట్రిపుల్ ఐటీ (IIIT, RGUKT)
Image Credit : Getty

4. ట్రిపుల్ ఐటీ (IIIT, RGUKT)

రాజీవ్ గాంధా యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ (RGUKT) సాధారణంగా IIIT గా పిలుస్తారు. ఇవి జాతీయస్థాయిలో మంచి గుర్తింపు కలిగిన విద్యాసంస్థలు. ఇందులో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బిటెక్ కోర్సులు అందిస్తారు. పదో తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

దరఖాస్తుకు చివరి తేదీ : మే 10, 2026

గమనిక : తెలంగాణలో పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ ఎంట్రన్స్ టెస్ట్ ల దరఖాస్తు తేదీలు, పరీక్షల సమయం మారవచ్చు. జాతీయస్థాయిలో జరిగే పోటీ పరీక్షలు, ఇతర కారణాల వల్ల కూడా తేదీలు మారవచ్చు. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
విద్య
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hyderabad : రూ.50 లక్షల్లోనే ఇండిపెండెంట్ హౌస్.. హైదరాబాద్ లో అతితక్కువ ధరకే ఇళ్లు లభించే టాప్ 5 ప్రాంతాలివే..!
Recommended image2
IMD Rain Alert : ఉపరితల ఆవర్తనంతో జతకట్టిన ద్రోణి... ఇక భయానక వర్షాలు, ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్
Recommended image3
Now Playing
CM Revanth Reddy: పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu
Related Stories
Recommended image1
Competitive Exam Tips : చండి పాదాల అండ.. ఈ మూడు పదాలు గుర్తుపెట్టుకుంటే చాలు మంచి మార్కులు..!
Recommended image2
Exam Tips : ఎగ్జామ్స్ కు ముందు టెన్షన్ తగ్గించుకునే... టాప్ 5 గోల్డెన్ టిప్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved