MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • పాములు చ‌ర్మాన్ని ఎందుకు విడుస్తాయి.? ఆ స‌మ‌యంలో మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా మారుతాయా?

పాములు చ‌ర్మాన్ని ఎందుకు విడుస్తాయి.? ఆ స‌మ‌యంలో మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా మారుతాయా?

Snakes Skin: పాములు ఇతర జంతువులకు భిన్నమైన జీవులు. వాటి శరీరం పెరుగుతున్న కొద్దీ పాత చర్మాన్ని వదిలేసి కొత్త చర్మాన్ని ఏర్పరుచుకుంటాయి. ఈ ప్రక్రియనే పాము కుబుసం విడవడం అంటారు. పాము కుబుసం విడిచే సమయంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి.

2 Min read
Author : Narender Vaitla
Published : Oct 06 2026, 03:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పాము కుబుసం ఎందుకు విడుస్తుంది?
Image Credit : Gemini AI

పాము కుబుసం ఎందుకు విడుస్తుంది?

పాము శరీరం జీవితాంతం పెరుగుతూనే ఉంటుంది. అయితే దాని బయట ఉండే చర్మం శరీరంతో పాటు అదే స్థాయిలో సాగదు. శరీరం పెరిగినప్పుడు పాత చర్మం బిగుతుగా మారుతుంది. దీంతో పాము ఆ పాత చర్మాన్ని పూర్తిగా వదిలేసి కొత్త చర్మాన్ని ఏర్పరుచుకుంటుంది. చిన్న వయసులో పాములు వేగంగా పెరుగుతాయి కాబట్టి తరచుగా కుబుసం విడుస్తాయి. పెద్ద పాముల్లో ఈ ప్రక్రియ కొంత తక్కువగా జరుగుతుంది. పాము వయసు, పెరుగుదల, ఆరోగ్యం, ఆహారం వంటి అంశాలపై కుబుసం విడిచే సమయం ఆధారపడి ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కుబుసం విడవడం వల్ల పాముకు ఉపయోగం ఏంటి.?
Image Credit : AI Image

కుబుసం విడవడం వల్ల పాముకు ఉపయోగం ఏంటి.?

పాత చర్మంపై కాలక్రమంలో దుమ్ము, పరాన్నజీవులు, మైట్స్ వంటి చిన్న జీవులు చేరే అవకాశం ఉంటుంది. కుబుసం విడిచే సమయంలో పాము ఆ పాత పొరను తొలగిస్తుంది. దీంతో శరీరంపై ఉన్న కొన్ని అనవసర పదార్థాలు కూడా తొలగిపోతాయి. అలాగే కదులుతూ, వేటాడుతూ పాముకు చర్మంపై చిన్న గాయాలు లేదా దెబ్బలు తగలొచ్చు. కొత్త చర్మం ఏర్పడటం వల్ల శరీరానికి తాజా రక్షణ పొర లభిస్తుంది. అందుకే కుబుసం విడవడం పాము శరీర ఆరోగ్యానికి అవసరమైన సహజ ప్రక్రియగా చెప్పవచ్చు.

35
కుబుసం విడిచే ముందు పాము కళ్లకు ఏమవుతుంది?
Image Credit : Getty

కుబుసం విడిచే ముందు పాము కళ్లకు ఏమవుతుంది?

కుబుసం విడిచే కొన్ని రోజుల ముందు పాము కళ్లపై మసకగా కనిపించే పొర ఏర్పడుతుంది. దీనిని సాధారణంగా ‘బ్లూ ఫేజ్’ అని పిలుస్తారు. ఈ సమయంలో పాముకు స్పష్టంగా కనిపించడం కష్టమవుతుంది. చూపు తగ్గడంతో పాము తన చుట్టూ ఉన్న కదలికలను సరిగ్గా గుర్తించలేకపోవచ్చు. అందుకే ఈ సమయంలో అది మరింత అప్రమత్తంగా ఉండొచ్చు. దగ్గరకు వచ్చే మనుషులు లేదా ఇతర జంతువులను ప్రమాదంగా భావించి రక్షణ కోసం స్పందించే అవకాశం ఉంటుంది.

45
కుబుసం ఎలా విడుస్తుంది?
Image Credit : AI image

కుబుసం ఎలా విడుస్తుంది?

పాత చర్మాన్ని తొలగించడానికి పాము తన శరీరాన్ని రాళ్లు, చెట్ల కొమ్మలు, గరుకైన ఉపరితలాలకు రుద్దుకుంటుంది. ముందుగా తల భాగం దగ్గర పాత చర్మం విడిపోవడం మొదలవుతుంది. ఆ తర్వాత పాము నెమ్మదిగా ముందుకు కదులుతూ మొత్తం పాత చర్మాన్ని బయటకు లాగుతుంది. ఈ ప్రక్రియ పాముకు కొంత శ్రమతో కూడుకున్నదే. అందుకే కుబుసం విడిచే సమయంలో పాము సాధారణంగా ప్రశాంతమైన, సురక్షితమైన ప్రదేశాన్ని ఎంచుకుంటుంది. ఈ సమయంలో దానిని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు.

55
కుబుసం విడిచిన తర్వాత పాము మరింత ప్రమాదకరమా?
Image Credit : Asianet News

కుబుసం విడిచిన తర్వాత పాము మరింత ప్రమాదకరమా?

కుబుసం పూర్తిగా విడిచిన తర్వాత పాము చూపు మళ్లీ సాధారణ స్థితికి వస్తుంది. కొత్త చర్మం కూడా తాజాగా, మెరిసేలా కనిపిస్తుంది. అయితే కుబుసం విడిచిన తర్వాత పాము మరింత విషపూరితంగా లేదా ప్రమాదకరంగా మారుతుందనే విషయం నిజం కాదు. అయితే కుబుసం విడిచే ముందు, ఆ సమయంలో పాము కొంత అసౌకర్యంగా ఉండొచ్చు. చూపు తగ్గడం వల్ల అది ప్రమాదాన్ని త్వరగా గుర్తించలేకపోవచ్చు. అందువల్ల మనుషులు దాని దగ్గరకు వెళ్తే రక్షణ కోసం కాటు వేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది. కాబట్టి పాము కుబుసం విడుస్తున్నట్లు కనిపిస్తే దానికి దూరంగా ఉండటం, దానిని రెచ్చగొట్టకుండా వదిలేయడం మంచిది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
మార్బుల్, గ్రానైట్, టైల్స్.. కొత్త ఇంటి ప్లోరింగ్ కు ఏది బెస్ట్? నిర్మాణరంగ నిపుణుల సలహాలు ఇవే!
Recommended image2
India's Paris: మన దేశంలో ఏ నగరాన్ని ‘పారిస్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారో తెలుసా?
Recommended image3
Crow Behavior: కాకులు కూడా పగబడతాయా? మనుషుల ముఖాలను గుర్తుపెట్టుకుంటాయా?
Related Stories
Recommended image1
ప్ర‌పంచంలో న‌దులు లేని దేశం ఏదో తెలుసా.? మ‌రి అక్క‌డి వారి ప‌రిస్థితి ఏంటి.?
Recommended image2
Telangana: హైద‌రాబాద్‌కు స‌మీపంలో భారీ డెయిరీ ప్లాంట్‌... రూ. 400 కోట్ల‌తో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved