MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Ghost : ఒంటరిగా వెళుతుంటే వెనక ఎవరో ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోందా? ఇది భ్రమా, దెయ్యమా? సైన్స్ ఏం చెబుతోంది?

Ghost : ఒంటరిగా వెళుతుంటే వెనక ఎవరో ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోందా? ఇది భ్రమా, దెయ్యమా? సైన్స్ ఏం చెబుతోంది?

ఒక్కోసారి మన వెనుక ఎవరో నిలబడినట్లు, దగ్గర్లో ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది. తీరా వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ ఉండరు. కొందరికైతే ఎవరో పిలిచినట్లు మాటలు కూడా వినిపిస్తాయి. చాలామంది దీన్ని దెయ్యం అని నమ్ముతారు. కానీ దీనిగురించి సైన్స్ ఏం చెబుతుందో తెలుసా?

2 Min read
Author : Arun Kumar P
Published : Oct 15 2026, 01:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
భ్రమా, దెయ్యమా?
Image Credit : Gemini ai

భ్రమా, దెయ్యమా?

'సైకలాజికల్ మెడిసిన్' (Psychological Medicine) జర్నల్ లో ఇటీవల ఓ పరిశోధన గురించి పబ్లిష్ అయింది. ఇందులో సైకాలజీ పరంగా మూడు గ్రూపులను విభజించారు... మొదటి గ్రూపులో ఏవేవో మాటలు వినిపించే భ్రమలు ఉన్నవాళ్లు, మెదడు లేదా మానసిక సమస్యలు ఉన్నవాళ్లు ఉన్నారు. రెండో గ్రూపులో.. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉన్నవాళ్లను తీసుకున్నారు. ఇక మూడో గ్రూపులో.. ఒంటరిగా చాలా దూరం పరిగెత్తేవాళ్లు లేదా కఠినమైన క్రీడల్లో పాల్గొనే అథ్లెట్లు ఉన్నారు.

పరిశోధనలో ఏం తేలిందంటే..

మూడు గ్రూపుల్లోని 206 మందిపై పరిశోధనలు చేశారు... వాళ్లను ఆన్‌లైన్ ద్వారా సైంటిస్టులు కొన్ని ప్రశ్నలు అడిగారు. చుట్టుపక్కల ఎవరూ లేకపోయినా పక్కన ఎవరో ఉన్నట్లు ఎప్పుడైనా అనిపించిందా? అలాంటప్పుడు భయమేసిందా? ఎవరైనా మీతో మాట్లాడినట్లు అనిపించిందా? శరీరంలో ఏదైనా మార్పు లేదా ఎవరో తాకినట్లు అనిపించిందా? అని అడిగారు. ఈ వేర్వేరు గ్రూపుల వాళ్ల అనుభవాల్లో ఏమైనా పోలికలు ఉన్నాయా అని తెలుసుకోవడమే సైంటిస్టుల మెయిన్ టార్గెట్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
జనాలకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి?
Image Credit : Gemini AI

జనాలకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి?

ఈ రీసెర్చ్‌లో పాల్గొన్న చాలామంది.. తమ వెనుక ఎవరో నిలబడినట్లు లేదా చుట్టుపక్కల ఎవరో తిరుగుతున్నట్లు అనిపించిందని చెప్పారు. కొందరికైతే ఎవరో టచ్ చేసినట్లు అనిపిస్తే, మరికొందరికి ఏవేవో మాటలు వినిపించాయట. తమను ఎవరో గమనిస్తున్నారనే ఫీలింగ్ కూడా కొందరిలో కలిగింది.

అయితే అందరి అనుభవాలు ఒకేలా లేవు. ఇలాంటివి ఎదురైనప్పుడు కొందరు అస్సలు భయపడలేదు. చనిపోయిన తమ ఆత్మీయులే తమ చుట్టూ ఉన్నారని వాళ్లు ఫీల్ అయ్యారు. కానీ ఇంకొందరు మాత్రం తీవ్రంగా భయపడిపోయారు. కంటికి కనిపించని ఏదో శక్తి తమకు హాని చేస్తుందేమో అని వణికిపోయారు.

అథ్లెట్లలో కూడా ఇలాంటి అనుభవాలు కనిపించాయి. ముఖ్యంగా కఠినమైన ఆటలు ఆడుతున్నప్పుడు లేదా ఒంటరిగా ఉన్నప్పుడు తమతో పాటు ఎవరో ఉన్నారనే ఫీలింగ్ కలిగిందని కొందరు చెప్పారు. దీన్నిబట్టి చూస్తే.. ఇలాంటి అనుభవాలు కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాలేదని అర్థమవుతోంది. అయితే ఇలా అనిపించినంత మాత్రాన అక్కడ నిజంగానే దెయ్యం లేదా ఆత్మ ఉన్నట్లు కాదు.

34
నిద్రకు, భయానికి లింక్ ఉందా?
Image Credit : Social Media

నిద్రకు, భయానికి లింక్ ఉందా?

ఈ పరిశోధన ప్రకారం.. ఏవేవో మాటలు వినిపించే భ్రమలు ఉన్నవాళ్లలో తమ చుట్టూ ఎవరో ఉన్నారనే ఫీలింగ్ కలిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. భయం, అనుమానం లాంటి ఎమోషన్స్ కూడా దీనికి కారణం కావొచ్చని తేలింది. ఆధ్యాత్మిక విషయాల్లో ఉండేవాళ్లు.. ధ్యానం చేస్తున్నప్పుడు లేదా ఆత్మలతో మాట్లాడేందుకు ట్రై చేస్తున్నప్పుడు ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయని చెప్పారు.

నిద్రకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం కూడా ఇక్కడ బయటపడింది. ఈ మూడు గ్రూపుల్లోని కొందరికి.. నిద్రపోతున్నప్పుడు లేదా నిద్రలోంచి మెలకువ వస్తున్న టైమ్‌లో తమ పక్కన ఎవరో ఉన్నారనే ఫీలింగ్ కలిగింది. నిద్రకు, మెలకువకు మధ్య ఉండే ఆ సగం నిద్ర మత్తులో ఇలాంటివి అనిపించొచ్చు. అయితే అందరికీ ఒకే కారణం వల్ల ఇలా అనిపిస్తుందని ఈ రీసెర్చ్ పూర్తిగా నిరూపించలేదు.

44
దెయ్యాలు ఉన్నాయని సైంటిస్టులకు ఆధారాలు దొరికాయా?
Image Credit : chatgpt

దెయ్యాలు ఉన్నాయని సైంటిస్టులకు ఆధారాలు దొరికాయా?

ఈ రీసెర్చ్‌లో సైంటిస్టులు గమనించిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. వేర్వేరు వ్యక్తులకు తమ చుట్టూ ఎవరో ఉన్నారనే ఫీలింగ్ కలగడంలో కొన్ని పోలికలు ఉన్నాయి. కానీ అందరి అనుభవాలు ఒకేలా లేవు. ఇలాంటి అనుభవాలకు భ్రమలు, భయం, నిద్రకు సంబంధించిన కొన్ని సమస్యలే కారణం కావొచ్చని ఒక క్లూ దొరికింది. కానీ దీనికి కచ్చితమైన కారణాన్ని సైంటిస్టులు ఇంకా కనిపెట్టలేదు.

ముఖ్యంగా దెయ్యాలు లేదా ఆత్మలు ఉన్నాయని చెప్పడానికి ఈ పరిశోధనలో ఎలాంటి సైంటిఫిక్ ఆధారాలు దొరకలేదు. ఈ అనుభవాల వెనుక ఉన్న అసలు కారణాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఇంకా చాలా రీసెర్చ్ చేయాల్సి ఉందని సైంటిస్టులు చెబుతున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
River : 'విజయవాడ దు:ఖధాయిని' వాగు ఏది? ఇది నదిలోనో, సముద్రంలోనో కలవకుండానే మాయం అవుతుంది, ఎలాగో తెలుసా?
Recommended image2
DMart: అన్నీ వస్తువులు దొరికే డీమార్ట్‌లో చీరలు మాత్రం ఎందుకు అమ్మరు? అసలు నిజం ఇదే
Recommended image3
Online Jobs: ఆన్‌లైన్ ఉద్యోగాలు నిజమో కాదో ఎలా గుర్తించాలి? ఇవి తెలిస్తే అస్సలు మోసపోరు!
Related Stories
Recommended image1
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Recommended image2
Ghost Village Mystery: ఒక్క రాత్రిలో మాయమైన గ్రామం.. ఘోస్ట్ విలేజ్ కుల్ధారా మిస్టరీ ఇదే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved