MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Feature
  • Salary Saving Tips : మంచి శాలరీ వస్తున్నా చేతిలో డబ్బు నిలవట్లేదా..? జీతం డబ్బులు పొదుపు చేసుకునే చిట్కాలివే

Salary Saving Tips : మంచి శాలరీ వస్తున్నా చేతిలో డబ్బు నిలవట్లేదా..? జీతం డబ్బులు పొదుపు చేసుకునే చిట్కాలివే

నేడు చాలామంది ఉద్యోగులు ఓ వింత ఆర్థిక సమస్యను ఎదుర్కొంటున్నారు. మంచి శాలరీ వస్తున్నప్పటికీ డబ్బు పొదుపు చేయలేకపోతుంటారు. అయితే ఇందుకు కారణమేంటో తెలుసుకుంటే సరైన ఆర్థిక ప్రణాళికతో ఈ సమస్యను పరిష్కరించవచ్చు.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Apr 21 2026, 01:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శాలరీ సేవింగ్ టిప్స్
Image Credit : Getty

శాలరీ సేవింగ్ టిప్స్

Salary Saving Tips : ఈ కాలంలో ఉద్యోగులకు మంచి శాలరీలే వస్తున్నాయి... కానీ నెల చివర్లో లెక్క చూసుకుంటే చేతిలో చిల్లిగవ్వ మిగలని పరిస్థితి. 'జీతం పెరిగితే పొదుపు కూడా పెరుగుతుంది' అని చాలామంది నమ్ముతారు. కానీ నిజానికి అలా జరగడం లేదు. చేతికొచ్చిన డబ్బు ఎటు పోతుందో తెలియకుండా మాయమవుతోంది. దీని వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. వీటిని కంట్రోల్ చేయగలిగితే మీ శాలరీలోంచి కొన్ని డబ్బులైనా పొదుపు చేయవచ్చు,

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
లైఫ్‌స్టైల్ ఇన్ఫ్లేషన్...
Image Credit : Getty

లైఫ్‌స్టైల్ ఇన్ఫ్లేషన్...

చేతిలో డబ్బు నిలవకపోవడానికి 'లైఫ్‌స్టైల్ ఇన్ఫ్లేషన్' ఒక పెద్ద కారణం. ఆదాయం పెరిగేకొద్దీ మన జీవనశైలి కూడా మెల్లగా మారిపోతుంది. ఎక్కువ అద్దె ఉండే ఇల్లు, కొత్త కారు, బ్రాండెడ్ వస్తువులు, కొత్త గాడ్జెట్లు కొనాలనే కోరికలు పెరుగుతాయి. దీంతో పెరిగిన జీతం అంతా ఖర్చులకే పోతుంది. దీనికి తోడు ఇంటి అద్దె లేదా EMI, కార్ లోన్, ఇన్సూరెన్స్, పిల్లల స్కూల్ ఫీజులు వంటి నెలవారీ ఖర్చులు జీతంలో పెద్ద భాగాన్ని మింగేస్తాయి. దీంతో మీ జీతం డబ్బులు ఆవిరైపోతాయి. కాబట్టి జీతం పెరిగినా కంట్రోల్ లో ఉండటం మంచిది... అవసరాల కోసం మాత్రమే ఖర్చు చేయండి.. లగ్జరీల కోసం కాదు.

35
3. చిన్నచిన్న ఖర్చులు
Image Credit : Getty

3. చిన్నచిన్న ఖర్చులు

మనకు తెలియకుండానే డబ్బును ఖాళీ చేసే చిన్నచిన్న ఖర్చులుంటాయి. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయడం, అనవసరమైన షాపింగ్, ట్యాక్సీలు వాడటం, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు వంటివి ప్రతిసారీ చిన్న మొత్తమే అయినా, నెల చివరికి కలిపితే పెద్ద మొత్తం అవుతుంది. వీటన్నింటికీ మించి 'ఖర్చులు పోగా మిగిలితే పొదుపు చేద్దాం' అనే అలవాటు చాలామందికి ఉంటుంది. జీతం రాగానే పొదుపు కోసం డబ్బు పక్కన పెట్టకపోవడంతో, చేతిలో ఉన్నదంతా ఖర్చయిపోతుంది. అందుకే జీతం రాగానే కొంత డబ్బు పొదుపుచేయడం మంచిది.

45
4. అనుకోని ఖర్చులు
Image Credit : Getty

4. అనుకోని ఖర్చులు

అనుకోని ఖర్చులు కూడా మన పొదుపును దెబ్బతీస్తాయి. హాస్పిటల్ ఖర్చులు, బండి రిపేర్లు, ఫంక్షన్లు లేదా ట్రిప్పులు వంటివి ఉన్నట్టుండి వచ్చి పడతాయి. వీటికి ముందుగా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల సేవింగ్స్ కరిగిపోతాయి. దీన్ని కంట్రోల్ చేయాలంటే ఒకటే మార్గం. పొదుపు, పెట్టుబడిని జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోవాలి. జీతం రాగానే కొంత భాగాన్ని పక్కన పెట్టడం, ఖర్చులను అదుపులో ఉంచుకోవడం, సరైన ఆర్థిక ప్రణాళిక చేసుకోవడమే మన ఆర్థిక భవిష్యత్తుకు భరోసా ఇచ్చే మార్గం.

55
5. క్రెడిట్ కార్డుల అతివాడకం
Image Credit : Asianet News

5. క్రెడిట్ కార్డుల అతివాడకం

క్రెడిట్ కార్డుల వాడకం కూడా ఉద్యోగుల జీతాన్ని ఒకేసారి మింగేస్తుంది. చాలామంది చేతిలో డబ్బులు లేకున్నా క్రెడిట్ కార్డు ఉందికదా అని ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తారు... నెల ఆరంభంలో క్రెడిట్ కార్డు బిల్లులకే శాలరీ డబ్బులు వెళ్లిపోతాయి. కాబట్టి క్రెడిట్ కార్డుల వాడకాన్ని తగ్గించాలి... అప్పుడే డబ్బుులు జాగ్రత్తగా ఖర్చు చేస్తారు... శాలరీ ఆదా చేయగల్గుతారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
పర్సనల్ పైనాన్స్
ఏషియానెట్ న్యూస్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Snake Venom Medicines: ప్రాణాలు తీసే పాముల విషమే ఇప్పుడు సంజీవని !
Recommended image2
Rainbow : ఇంద్రధనుస్సు ఎప్పుడూ వంగే ఎందుకు కనిపిస్తుంది? దీని వెనక ఇంత సైన్స్ దాగుందా..!
Recommended image3
Psychology: ఒక వ్యక్తిని మర్చిపోవడం ఎందుకు అంత కష్టం? సైకాలజీ ఏం చెబుతోంది?
Related Stories
Recommended image1
Jobs 2026 : ప్రభుత్వ ఉద్యోగాల జాతర.. ఒకటి రెండు కాదు ఏకంగా 21,000+ పోస్టులు.. ఎక్కడ, ఏ జాబ్స్..?
Recommended image2
Highest Salary: ఈ దేశాల్లో టీచర్లందరూ కోటీశ్వరులే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved