MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Beautiful Village: మన దేశంలో అందమైన గ్రామం.. నది, సరస్సు, సముద్రం కలిసే ఏకైక గ్రామం ఇది..!

Beautiful Village: మన దేశంలో అందమైన గ్రామం.. నది, సరస్సు, సముద్రం కలిసే ఏకైక గ్రామం ఇది..!

Beautiful Village: మన దేశంలోని అందమైన గ్రామాల్లో ఇది కూడా ఒకటి. గోల్డెన్ కలర్ బీచ్, అందమైన బ్యాక్ వాటర్స్, దట్టమైన అడవుల కలయికతో పాటు... నది, సరస్సు, సముద్రం ఒకే చోట కలిసిన గ్రామం ఒకటి మన దేశంలో ఉందని తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 18 2026, 03:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
భూలోక స్వర్గం..
Image Credit : ఏఐ ఆధారంగా రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం.

భూలోక స్వర్గం..

కేరళ అనగానే.. మనకు ప్రకృతి అందాలే గుర్తుకువస్తాయి. చాలా మంది కేరళ ట్రిప్ అనగానే.. అలెప్పీ, మన్నార్ మాత్రమే వెళ్లి వస్తారు. కానీ, కేరళ చివరలో ఓ అందమైన గ్రామం ఉంది. ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఈ గ్రామం మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. తిరువనంతపురం సమీపంలో ఉన్న ఈ గ్రామం పేరు పువార్. ఒకవైపు బంగారు వర్ణంతో బీచ్, మరోవైపు ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్, ఇంకోవైపు దట్టమైన అడవులతో చూసేవారికి భూలోక స్వర్గంలా కనిపిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఈ గ్రామానికి పువార్ అనే పేరు ఎలా వచ్చింది..?
Image Credit : ఏఐ ఆధారంగా రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం.

ఈ గ్రామానికి పువార్ అనే పేరు ఎలా వచ్చింది..?

ఈ పేరు వెనక ఆసక్తికరమైన కథ ఉంది. పూర్వం ఈ గ్రామాన్ని పొక్కుమాసాపురం అని పిలిచేవారు. 18వ శతాబ్దంలో ట్రావెన్ కోర్ మహారాజా మార్తాండ వర్మ శత్రువుల నుంచి తప్పించుకుని ఈ ప్రాంతంలో తలదాచుకున్నారు. ఆ సమయంలో వసంత ఋతువు కావడంతో నయ్యార్ నది ఒడ్డున ఉన్న చెట్ల నుంచి ఎర్రటి పూలు రాలి నది నీటిపై ఎర్రటి తివాచీ పరిచినట్లుగా కనిపించాయి. ఆ దృశ్యానికి ఆకర్షితులైన రాజు మళయాళంలో పూ ఆరు అని అన్నారంట. అంటే.. తెలుగులో పూల నది అని అర్థం. అది కాస్త కాలక్రమేణా పూవార్ గా మారిపోయింది.

33
పువార్ గ్రామంలోని ప్రత్యేకతలు...
Image Credit : ఏఐ ఆధారంగా రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం.

పువార్ గ్రామంలోని ప్రత్యేకతలు...

ఇక్కడ నయ్యార్ నది, పూవార్ సరస్సు, అరేబియా సముద్రం ఒకేచోట కలుస్తాయి. బంగారు ఇసుక తిన్నెలు ఒకవైపు సముద్రాన్ని, మరోవైపు నదిని వేరు చేస్తూ అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయి. పూవార్ బీచ్‌కు నేరుగా రోడ్డు మార్గం ఉండదు. మడ అడవుల మధ్య సాగే సన్నని నీటి కాలువలలో బోటులో ప్రయాణిస్తూ బీచ్‌కు చేరుకోవడం ఒక మరపురాని అనుభూతి. నీటిపై తేలియాడే రిసార్టులు, హౌస్‌బోట్లు ఇక్కడి ప్రధాన ఆకర్షణ. చుట్టూ పచ్చని కొబ్బరి తోటలు, పక్షుల కిలకిలరావాల మధ్య ప్రశాంతంగా గడపడానికి ఇది బెస్ట్ ప్లేస్. ప్రాచీన కాలంలో సుగంధ ద్రవ్యాలు, దంతాలు, కలప ఎగుమతులకు పూవార్ ఒక ప్రముఖ ఓడరేవుగా ఉండేది. గ్రీకు, రోమన్, అరబ్ వ్యాపారులు ఇక్కడికి వచ్చేవారని చరిత్ర చెబుతోంది.

ఎప్పుడు వెళ్లాలి? ఎలా చేరుకోవాలి? 

అక్టోబర్ నుండి మార్చి వరకు వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. వర్షాకాలంలో (జూన్ - సెప్టెంబర్) ఇక్కడి మడ అడవులు మరింత పచ్చగా మారి కనువిందు చేస్తాయి.

ప్రయాణ మార్గం: తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే స్టేషన్ నుండి పూవార్ సుమారు 26-30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రసిద్ధ కోవలం బీచ్ నుండి కేవలం 12 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.

కోలాహలం లేకుండా ప్రశాంతంగా ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకునే పర్యాటకులకు కేరళలోని పూవార్ ఒక అద్భుతమైన గమ్యస్థానం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
భారత దేశం
జీవనశైలి
 
3rd ODI • AUS vs ENG 2026
Live
AUSAUS
(43.0 ov)219/9
ENGENG
328
AUS need 110 runs in 42 balls
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Live
PAKPAK
325
SLSL
(12.5 ov) 98 & 34/2
Day 2 - Session 3
Schedule ›
26th T20 • WBBLT20
HH-WHH-W
Thu, 19 Nov, 2026
PS-WPS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
27th T20 • WBBLT20
BH-WBH-W
Thu, 19 Nov, 2026
ST-WST-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
1st TEST • PAK vs SL 2026
Result
PAKPAK
434 & 284/8
SLSL
446
Match drawn
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Saffron: మీరు తీసుకున్న కుంకుమపువ్వు అసలైనదా లేక నకిలీదా? ఎలా గుర్తించాలంటే?
Recommended image2
Muslim Priest : హిందూ దేవాలయంలో ముస్లిం పూజారి.. ఎక్కడో కాదు మనదగ్గరే..!
Recommended image3
Lake: సముద్రం పైన తేలాడే అద్భుత సరస్సు.. కానీ, రెండూ ఎప్పటికీ కలవవు.. ఈ వింత ఎక్కడ ఉందో తెలుసా?
Related Stories
Recommended image1
Smallest River: భారతదేశంలో అతి చిన్న నది ఇది, 60 ఏళ్లు ఎండిపోయి.. మళ్లీ ప్రాణం పోసుకున్న నది..!
Recommended image2
Lake: సముద్రం పైన తేలాడే అద్భుత సరస్సు.. కానీ, రెండూ ఎప్పటికీ కలవవు.. ఈ వింత ఎక్కడ ఉందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved