MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Loan: గోల్డ్ లోన్ విష‌యంలో ఈ త‌ప్పు చేస్తున్నారా.? సిబిల్ స్కోర్ ప‌డిపోవ‌డం ఖాయం

Gold Loan: గోల్డ్ లోన్ విష‌యంలో ఈ త‌ప్పు చేస్తున్నారా.? సిబిల్ స్కోర్ ప‌డిపోవ‌డం ఖాయం

Gold Loan: బంగారం విలువ భారీగా పెరుగుతోంది. దీంతో గోల్డ్‌పై రుణాలు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో గోల్డ్ లోన్ తీసుకునే విష‌యంలో పాటించాల్సిన కొన్ని ముఖ్య‌మైన విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Oct 10 2025, 04:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బంగారం విలువ పెర‌గ‌డంతో బ్యాంకులకు కొత్త ఇబ్బందులు
Image Credit : Getty

బంగారం విలువ పెర‌గ‌డంతో బ్యాంకులకు కొత్త ఇబ్బందులు

దేశవ్యాప్తంగా బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో బ్యాంకుల బంగారం రుణ విభాగం ఒత్తిడిని ఎదుర్కొంటోంది. బంగారం విలువ పెరిగేకొద్దీ రుణాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. కానీ, ఈ రుణాలు తీసుకున్న వారిలో చాలామంది తిరిగి చెల్లించ‌క‌పోవ‌డంతో 30 శాతానికి పైగా ఖాతాలు ఎన్‌పీఏ (Non-Performing Assets) జాబితాలో చేరాయి.

25
నెలనెలా వడ్డీ చెల్లింపు తప్పనిసరి
Image Credit : Indiamart

నెలనెలా వడ్డీ చెల్లింపు తప్పనిసరి

ఇలాంటి పరిస్థితుల్లో రికవరీ సమస్యలను అధిగమించడానికి బ్యాంకులు కొత్త చర్యలు చేపడుతున్నాయి. గతంలో రుణ గడువు పూర్తయ్యాక వడ్డీతో కూడిన మొత్తం వసూలు చేసేవారు. అయితే, ఇప్పుడు రుణం తీసుకున్న తేదీ నుంచే నెలనెలా వడ్డీ చెల్లించాల్సిందేనని కొన్ని బ్యాంకులు నిర్ణయించాయి. ఈ నిబంధనను పాటించకపోతే ఖాతాదారుల సిబిల్ స్కోర్ (CIBIL Score) తగ్గిపోతుందని బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. సిబిల్ స్కోర్ పడిపోతే భవిష్యత్తులో కొత్త రుణాలు మంజూరు చేయడంలో ఇబ్బందులు తలెత్తుతాయని స్పష్టం చేస్తున్నారు.

Related Articles

Related image1
Beer: 90 శాతం మందికి బీర్ ఎలా తాగాలో తెలియ‌దు.. మీరు కూడా ఈ త‌ప్పులు చేస్తున్నారా.?
Related image2
Hero HF 100: నెల‌కు జ‌స్ట్ 2 వేల‌తో.. ఈ బైక్ మీ సొంతం చేసుకోండి. 70 కిలోమీట‌ర్ల మైలేజ్
35
ఎన్‌పీఏ జాబితాలో చేరితే క్రెడిట్ విలువపై ప్రభావం
Image Credit : Google

ఎన్‌పీఏ జాబితాలో చేరితే క్రెడిట్ విలువపై ప్రభావం

రుణ గడువులోపు చెల్లింపులు జరపని వారు ఎన్‌పీఏ కేటగిరీలోకి వెళ్తున్నారు. ఒకసారి ఎన్‌పీఏ జాబితాలో చేరితే వారి క్రెడిట్ రికార్డ్ దెబ్బతింటుంది. దీని ఫలితంగా భవిష్యత్తులో వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు, వాహన రుణాల మంజూరులో బ్యాంకులు వెనుకంజ వేస్తాయి.

45
గోల్డ్ లోన్‌తో సిబిల్ స్కోర్ ఎలా పెంచుకోవాలి.?
Image Credit : Google

గోల్డ్ లోన్‌తో సిబిల్ స్కోర్ ఎలా పెంచుకోవాలి.?

సరైన విధంగా వాడితే, బంగారం రుణం మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచగలదు.

* ప్రతి నెల సమయానికి చెల్లించడం ద్వారా మీ క్రెడిట్ చరిత్ర బలపడుతుంది. చిన్న రుణం అయినా సక్రమంగా చెల్లిస్తే మీ ప్రొఫైల్ బలంగా మారుతుంది.

* బంగారం రుణం వంటి సెక్యూర్డ్ లోన్‌ తో పాటు క్రెడిట్ కార్డు లేదా పర్సనల్ లోన్‌ వంటి అన్సెక్యూర్డ్ రుణాలు ఉంటే బ్యాంకులు మిమ్మల్ని స్థిరమైన కస్టమర్‌గా భావిస్తాయి.

* కొంతమంది బంగారం రుణం తీసుకొని అధిక వడ్డీ ఉన్న ఇతర రుణాలను చెల్లిస్తారు. ఇది మొత్తం అప్పు భారాన్ని తగ్గించడమే కాకుండా సిబిల్ రిపోర్టును కూడా మెరుగుపరుస్తుంది.

55
గోల్డ్ లోన్ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విష‌యాలు
Image Credit : Google

గోల్డ్ లోన్ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విష‌యాలు

Loan-to-Value (LTV) : RBI మార్గదర్శకాల ప్రకారం రూ.2.5 లక్షల లోపు రుణాలకు బంగారం విలువలో గరిష్టంగా 85% వరకు మాత్రమే ఇవ్వవచ్చు.

ప్యూరిటీ & విలువ: కనీసం 18 క్యారెట్ల బంగారం మాత్రమే అంగీక‌రిస్తారు. ప్రతి బ్యాంకు తన విధానాల ప్రకారం విలువ నిర్ణయిస్తుంది.

వడ్డీ రేటు : బంగారం రుణాలకు వడ్డీ సాధారణంగా తక్కువే, కానీ ప్రతి సంస్థలో తేడా ఉంటుంది. లోన్ తీసుకునే ముందు గ‌మ‌నించాలి.

డిఫాల్ట్ అయితే : చెల్లించకపోతే బంగారం వేలం వేస్తారు. సిబిల్ స్కోర్ త‌గ్గుతుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Ideas: చింత గింజ‌ల‌తో ల‌క్షాధికారి కావొచ్చు.. జీవితాన్ని మార్చే బిజినెస్ ఐడియా
Recommended image2
నిజంగానే పాత‌ సిమ్ కార్డుల‌ నుంచి బంగారం వ‌స్తుందా.? గ్రామ్ గోల్డ్‌కి ఎన్ని సిమ్ కార్డులు కావాలంటే
Recommended image3
Richest State: మనదేశంలో రిచెస్ట్ రాష్ట్రం అదే, ఇక తెలుగు రాష్ట్రాలకు ఎంత ఆస్తి ఉందంటే...
Related Stories
Recommended image1
Beer: 90 శాతం మందికి బీర్ ఎలా తాగాలో తెలియ‌దు.. మీరు కూడా ఈ త‌ప్పులు చేస్తున్నారా.?
Recommended image2
Hero HF 100: నెల‌కు జ‌స్ట్ 2 వేల‌తో.. ఈ బైక్ మీ సొంతం చేసుకోండి. 70 కిలోమీట‌ర్ల మైలేజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved