MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Feature
  • Richest Person: ప్రపంచంలోనే కుబేరుడు.. టాటాలు, అంబానీల సంపద కూడా ఆయన ముందు దిగదుడుపే

Richest Person: ప్రపంచంలోనే కుబేరుడు.. టాటాలు, అంబానీల సంపద కూడా ఆయన ముందు దిగదుడుపే

Richest Person: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరు అని అడిగితే.. ఎవరైనా అంబానీలు, ఎలన్ మస్క్ పేరే చెబుతారు. నిజానికి వీరికన్నా ధనవంతుడు ఒకాయన ఉండేవారు. అతని సంపద విలువ తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఇంతకీ అతనెవరో తెలుసా?

2 Min read
Author : Haritha Chappa
Published : Jul 22 2026, 09:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు
Image Credit : GeminiAI

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు

ప్రపంచంలోనే ధనవంతులనగానే మనకు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ గుర్తొస్తారు. అదే భారతదేశంలో అయితే ముకేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి పేర్లు గుర్తుకొస్తాయి. కానీ దాదాపు వంద సంవత్సరాల క్రితం మన హైదరాబాద్‌ను పాలించిన ఒక రాజు సంపద ముందు వీళ్లందరి ఆస్తులు ఎందుకు పనికిరావు. ఆయనే హైదరాబాద్ చివరి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. 1937లో ప్రముఖ అంతర్జాతీయ పత్రిక 'టైమ్' కవర్ పేజీపై ఈయనను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ప్రకటించింది. ఆ రోజుల్లోనే ఆయన సంపద విలువ దాదాపు 230 బిలియన్ డాలర్లుగా ఉండేది. ప్రస్తుత భారతీయ రూపాయిల విలువ ప్రకారం లెక్కగడితే.. అది దాదాపు రూ. 17 లక్షల కోట్లకు పైమాటే. ఇప్పుడు భారతదేశపు అగ్రగామి పారిశ్రామికవేత్తలైన అంబానీ, టాటా, అదానీల మొత్తం సంపదను కలిపినా.. ఆ నిజాం రాజుకు ఉన్న సంపద ఉండదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
వజ్రాల మూటలు
Image Credit : Gemini Ai

వజ్రాల మూటలు

నిజాం రాజు ఆస్తులలో అతి ముఖ్యమైనవి గోల్కొండ వజ్రాల గనులు. నాటి కాలంలో ప్రపంచానికినాణ్యమైన వజ్రాలను అందించిన ఏకైక కేంద్రం హైదరాబాద్ రాజ్యమే. దీంతో నిజాం ఖజానాలో రత్నాలు, పగడాలు, బంగారం, వజ్రాలు నిండి ఉండేవి. దాదాపు 185 క్యారెట్ల బరువున్న అత్యంత ఖరీదైన జాకబ్ డైమండ్ అనే అరుదైన వజ్రాన్ని ఆయన తన రాయబార కార్యాలయంలో ఒక సాధారణ పేపర్ వెయిట్ గా ఉపయోగించేవారని చెప్పుకుంటారు. అంతేకాకుండా రవాణా సౌకర్యాల విషయంలోనూ ఆయన ఉన్న సమయం ఎంతో ప్రత్యేకమైనది. ఆ రోజుల్లోనే నిజాం డెక్కన్ ఎయిర్‌వేస్ పేరుతో సొంత ప్రైవేట్ విమానయాన సంస్థను స్థాపించిన విమానాలను నడిపేవారు. ఇక భూమిపై ప్రయాణించడానికి ఆయన గ్యారేజీలో ఏకంగా 50కి పైగా అత్యంత విలాసవంతమైన రోల్స్ రాయిస్ కార్లు సిద్ధంగా ఉండేవని చెప్పుకుంటారు.

Related Articles

Related image1
Idli Podi: ఇడ్లీపొడితో ఒక్క రోజులోనే రూ.5 వేలు సంపాదించే బిజినెస్.. వివరాలు ఇవిగో
Related image2
Mobile Tower: సెల్ టవర్‌కు దగ్గరలో నివసిస్తే ప్రమాదమా? ఎలాంటి నష్టాలు కలుగుతాయి?
33
ఎంత సింపుల్ గా బతికేవారో
Image Credit : Gemini AI

ఎంత సింపుల్ గా బతికేవారో

ఒకవైపు లెక్కలేనంత వైభవం, విపరీతమైన సంపద ఉన్నప్పటికీ.. నిజాం నవాబు వ్యక్తిగత జీవితం మాత్రం చాలా నిరాడంబరంగా ఉండేది. వేల కోట్ల ఆస్తులకు అధిపతి అయినప్పటికీ, ఆయన చాలా సాధారణ దుస్తులు ధరించేవారని, జీవితాంతం ఒకే సిగార్ క్యాప్‌ను వాడారని చరిత్రకారులు చెబుతారు. అయితే ఆయన పాలించిన రోజుల్లోనే హైదరాబాద్ నగరం రూపురేఖలు మారిపోయాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, అసెంబ్లీ భవనం, నిజాం సాగర్ ప్రాజెక్టు, రైల్వే వ్యవస్థ వంటి అనేక నిర్మాణాలు కొనసాగాయి.ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్న రాజ్యంగా వెలిగిన హైదరాబాద్ సంస్థానాన్ని ఏలిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చరిత్రలో అత్యంత సంపన్నుడిగా చరిత్రలో నిలిచిపోతాడు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Interesting Facts : జైళ్లను అద్దెకిచ్చే దేశమేదో తెలుసా?
Recommended image2
Snakes : మనుషుల్లాగే పాములు కూడా స్నానం చేస్తాయా? నీటిలో ఎక్కువగా ఎందుకుంటాయి?
Recommended image3
Youtube: యూట్యూబ్‌ను శాశ్వతంగా నిషేధించిన 4 దేశాలు ఇవే.. ఎందుకు బ్యాన్ చేశారో తెలుసా?
Related Stories
Recommended image1
Idli Podi: ఇడ్లీపొడితో ఒక్క రోజులోనే రూ.5 వేలు సంపాదించే బిజినెస్.. వివరాలు ఇవిగో
Recommended image2
Mobile Tower: సెల్ టవర్‌కు దగ్గరలో నివసిస్తే ప్రమాదమా? ఎలాంటి నష్టాలు కలుగుతాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved