Gold: రోడ్డుపై బంగారం దొరికితే దాన్ని ఉంచుకోవడం మంచిది కాదా? ఆ గోల్డ్ ను ఏం చేయాలి?
Gold: భారతీయ సంప్రదాయంలో బంగారం చాలా ముఖ్యమైనది. బంగారం సంపద, అదృష్టం, గౌరవానికి చిహ్నం. అయితే రోడ్డు మీద బంగారం దొరకడం మంచిదేనా? లేక సొంత బంగారాన్ని పొగొట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది?

జ్యోతిష శాస్త్రం ఏం చెబుతోంది?
భారతీయ సంప్రదాయంలో బంగారం అత్యంత విలువైన లోహం. ఇప్పుడు దీని ధర విపరీతంగా పెరిగిపోయింది. బంగారాన్ని సంపద, గౌరవం, అదృష్టంగా భావిస్తారు. బంగారం అంటే లక్ష్మీదేవి రూపంగా కొలుస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే బంగారం బోలెడంత దక్కుతుందని చెప్పుకుంటారు. అయితే బంగారం పోగొట్టుకోవడం లేదా దారిలో దొరకడం వంటివి జరిగినప్పుడు ఏం చేయాలో కొంతమందికి తెలియదు. బంగారంంతో కొన్ని గ్రహాలకు అనుబంధం ఉంటుంది. బంగారం దొరికితే లేదా పొగొట్టుకుంటే ఏం చేయాలో తెలుసుకోండి.
బంగారం పొగొట్టుకుంటే..
ఒక వ్యక్తి బంగారం పోగొట్టుకున్నారంటే దానికి గ్రహాలతో అనుభవం ఉంటుంది. అతని జాతకంలో కేతు, శని, రాహువు అనే మూడు గ్రహాల చెడు ప్రభావం వల్ల బంగారం కోల్పోవడం వంటివి జరుగుతుంది. ఈ మూడు గ్రహాలు చెడు స్థానంలో ఉంటే కష్టాలు, ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలను వస్తాయని నమ్ముతారు. బంగారం కోల్పోవడం ఆ వ్యక్తికి దురదృష్టానికి సంకేతంగా భావిస్తారు. ఇది కేవలం బంగారం మాత్రమే కాదు. ఇతర విలువైన వస్తువులను కోల్పోవడానికి కూడా ఇది సంకేతం కావచ్చు. అంటే ఆర్థిక ఇబ్బందులు, రోగాలు, విపత్తులకు కూడా దారితీయవచ్చు. అందుకే బంగారం పొగొట్టుకోవడం అనేది హిందూ సంప్రదాయం ప్రకారం చెడుకు సంకేతంగా భావిస్తారు.
బంగారం దొరికితే
ఎంతో మంది బంగారం దొరికితే అదృష్టం అనుకుంటారు. కానీ జ్యోతిష శాస్త్రం మాత్రం దీనికి భిన్నంగా వివరిస్తుంది. ప్రయాణంలో లేదా దారిలో బంగారం దొరకడం శుభం కాదని చెబుతుంది. జ్యోతిష విశ్వాసాల చెబుతున్న ప్రకారం దారిలో బంగారం దొరకడం వల్ల చెడ్డ పేరు వస్తుంది. ఆత్మవిశ్వాసం కోల్పోయే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం తగ్గడం, ఆరోగ్య సమస్యలు, అనిశ్చిత పరిస్థితులు ఏర్పడవచ్చు. కాబట్టి దొరికిన బంగారాన్ని దగ్గర ఉంచుకోవడం ఒక వ్యక్తికి ఏమాత్రం మంచిది కాదని జ్యోతిషం వివరిస్తోంది.
దొరికిన బంగారం ఏం చేయాలి?
కొంతమందికి దారిలో బంగారం దొరుకుతుంది. దాన్ని దగ్గర ఉంచుకోకూడదు. ఆ బంగారాన్ని గురువారం బ్రాహ్మణులకు దానం చేయడం మంచిదని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఇలా చేయడం వల్ల కేతు, శని, రాహు గ్రహాల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని నమ్ముతారు. ఇది దురదృష్టాన్ని తగ్గించి, మనశ్శాంతిని ఇస్తుందని అంటారు.
భారతీయ సంప్రదాయంలో బంగారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. వేడుకల్లో ఇది చాలా అవసరం. ఇది సంపద, శ్రేయస్సుకు చిహ్నం. అందుకే పెళ్లిళ్లు, పుట్టినరోజులు, పండుగల వంటి శుభ సందర్భాలలో బంగారం ధరించడం ఆనవాయితీగా వస్తోంది. ఇది ఒక వ్యక్తి ఆర్థిక స్థితి, గౌరవాన్ని కూడా సూచిస్తుంది. భారతీయ సంప్రదాయంలో బంగారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనది. శుభ సందర్భాలలో ఇది చాలా అవసరం. ఇది సంపద, శ్రేయస్సుకు చిహ్నంగా చెప్పుకుంటారు. అందుకే పెళ్లిళ్లు, పుట్టినరోజులు, పండుగల వంటి శుభ సందర్భాలలో బంగారం ధరిస్తారు.

