Mars Transit: పవర్‌ఫుల్ బుధాదిత్య రాజయోగంతో ఈ 4 రాశులకు కుబేరుడి అనుగ్రహం
Mars Transit: బుధ గ్రహం వల్ల ఎన్నో రాశుల వారికి కలిసి వస్తుంది. బుధుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించింది. దీనివల్ల శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడింది. దీంతో వారి అప్పులు తీరి, ఆస్తులు పెరుగుతాయి.

బుధాదిత్య రాజయోగం
జ్యోతిషశాస్త్రంలో బుధుడిని గ్రహాల యువరాజుగా పిలుచుకుంటారు. బుధుడు ఒక రాశిలో ప్రవేశించాక సుమారు 23 నుంచి 27 రోజుల వరకు ఉంటాడు. జనవరి 17న ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించాడు బుధుడు. అయితే ఇప్పటికే సూర్యుడే ఉండడం వల్ల బుధుడు అతనితో కలిసి బుధాదిత్య రాజయోగం ఏర్పరచాడు. ఇది నాలుగు రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తుంది. ఏ రాశుల వారికి ఈ రాజయోగం అన్ని విధాలుగా కలిసివస్తుందో తెలుసుకోండి.
మేష రాశి
బుధుడి వల్ల ఏర్పడే బుధాదిత్య రాజయోగం మేష రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. వీరు ఇతరులకు అప్పుగా ఇచ్చి చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు, పెట్టుబడుల మెచ్యూరిటీ వంటివి చేతికి అందవచ్చు. స్టాక్ మార్కెట్‌లో ఉన్నవారికి ఈ కాలం మంచి లాభాలను తెచ్చి పెడుతుంది. కోర్టు కేసుల్లో మేష రాశి వారికి విజయం సాధించే ఛాన్స్ ఉన్నాయి. వ్యాపార కారకుడు బుధుడు. వ్యాపారంలో ఉన్న మేషరాశి వారికి మంచి పురోగతి లభిస్తుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి బుధాదిత్య రాజయోగం విపరీతంగగా కలిసివస్తుంది. దీనివల్ల ఈ రాశి వారి జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. వీరు ఏదైనా కొత్త పనులు ప్రారంభించడానికి ఇదే అనుకూల సమయమని చెప్పుకోవాలి. ప్రేమ, అనుబంధాల్లో విజయం సాధిస్తారు. వీరు చేపట్టిన పనులన్నింటిలో విజయం దక్కే అవకాశం ఉంది. పిల్లల నుంచి మంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులకు ఇది మంచి కాలం అని చెప్పుకోవాలి. కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది.
సింహ రాశి
సింహ రాశికి బుధుడి వల్ల ఏర్పడే యోగంశుభప్రదంగా ఉంటుంది. వీరి కోసం శుభవార్తలు వెతుక్కుంటూ వస్తాయి. వీరు చేసే పనిలో పురోగతికి అవకాశాలు ఏర్పడతాయి. కుటుంబంలో అవుతున్న గొడవలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. వీరికున్న అనారోగ్య సమస్యలు తొలగి ఆరోగ్యం మెరుగవుతుంది. వీరి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఆర్ధికంగా వీరికి అండదండలు దొరుకుతాయి. సింహరాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి బుధాదిత్య రాజయోగం బాగా కలిసొస్తుంది. వీరికి ఉద్యోగంలో ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. వీరికి జీతాలు కూడా పెరుగుతాయి. కుబేరుడి అనుగ్రహం వీరిపై ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఆ ఉద్యోగం వెతుక్కుంటూ వస్తాయి. అనుకున్న పనులు సరైన సమయంలో పూర్తవుతాయి. పూర్వీకుల ఆస్తి మీకు దక్కే అవకాశం ఉంది. అలాగే వీరి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఈ రాశి వారి తల్లిదండ్రుల ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారం చేసేవారు మంచి విజయాన్ని అందుకుంటారు.

