MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • LIC: ఎల్ఐసీ అదిరిపోయే స్కీమ్.. 5 ఏళ్లు కడితే చాలు జీవితాంతం అకౌంట్‌లోకి డబ్బులు

LIC: ఎల్ఐసీ అదిరిపోయే స్కీమ్.. 5 ఏళ్లు కడితే చాలు జీవితాంతం అకౌంట్‌లోకి డబ్బులు

LIC Jeevan Utsav Policy: ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్ పాలసీ ద్వారా కేవలం 5 ఏళ్లు ప్రీమియం చెల్లించి జీవితాంతం వార్షిక ఆదాయం పొందవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందిస్తున్న ఈ సూపర్ పాలసీ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 25 2026, 08:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎల్ఐసీ నుంచి సూపర్ ప్లాన్.. ఏటా 10 శాతం రిటర్న్ ఇచ్చే బెస్ట్ పాలసీ ఇదే
Image Credit : chatgpt

ఎల్ఐసీ నుంచి సూపర్ ప్లాన్.. ఏటా 10 శాతం రిటర్న్ ఇచ్చే బెస్ట్ పాలసీ ఇదే

రిటైర్మెంట్ తర్వాత ఖర్చుల గురించి టెన్షన్ పడుతున్నారా? అయితే మీకోసమే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకువచ్చింది. అదే ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్ పాలసీ. ఈ స్కీమ్ ద్వారా మీరు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించి, జీవితాంతం ఆదాయం పొందవచ్చు.

ఈ ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఒక నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ ఇండివిజువల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. అంటే, దీని లాభాలు స్టాక్ మార్కెట్ రిటర్న్స్‌పై ఆధారపడి ఉండవు. కాబట్టి మీ పెట్టుబడికి పూర్తి భద్రత ఉంటుంది. అంతేకాకుండా, ఈ పథకం కింద పాలసీదారులకు రిస్క్ కవర్ ప్రయోజనం కూడా లభిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రీమియం చెల్లింపు వివరాలు ఇవే
Image Credit : our own

ప్రీమియం చెల్లింపు వివరాలు ఇవే

ఈ స్కీమ్ కింద కింద పాలసీదారులు తమ సౌలభ్యం ప్రకారం 5 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు ప్రీమియం చెల్లించే విభిన్న ఆప్షన్లను ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ కింద కనీస ప్రాథమిక హామీ మొత్తం 5 లక్షల రూపాయలుగా నిర్ణయించారు.

ఉదాహరణకు, 30 ఏళ్ల వయస్సు గల ఒక వ్యక్తి 5 లక్షల రూపాయల బేసిక్ సమ్ అష్యూర్డ్ కోరుకుంటే, 5 సంవత్సరాల ప్రీమియం ఆప్షన్‌ను ఎంచుకుంటే, ఆయన వార్షిక ప్రీమియం 1,10,150 రూపాయలు అవుతుంది. ఒకవేళ 8 సంవత్సరాల ఆప్షన్ ఎంచుకుంటే 72,600 రూపాయలు, 12 సంవత్సరాల ఆప్షన్‌కు 44,275 రూపాయలు, 16 సంవత్సరాల ఆప్షన్‌కు వార్షిక ప్రీమియం 30,025 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

35
జీవితాంతం 10 శాతం వార్షిక ఆదాయం
Image Credit : ISTOCK

జీవితాంతం 10 శాతం వార్షిక ఆదాయం

ఈ పాలసీలోని రెగ్యులర్ ఇన్కమ్ బెనిఫిట్ ఆప్షన్ కింద, పాలసీదారులకు వార్షిక ఆదాయం ప్రాథమిక హామీ మొత్తంలో 10 శాతంగా లభిస్తుంది. 5 లక్షల రూపాయల బేసిక్ సమ్ అష్యూర్డ్ పైన ఇది సంవత్సరానికి 50 వేల రూపాయలు అవుతుంది.

ప్రీమియం చెల్లించే కాలం 5 సంవత్సరాలుగా ఉంటే, ఈ ఆదాయం పాలసీ 11వ సంవత్సరం నుంచే ప్రారంభమవుతుంది. ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఆదాయం పాలసీదారుడు బతి ఉన్నంతవరకు జీవితాంతం క్రమం తప్పకుండా అందుతూనే ఉంటుంది.

45
గ్యారెంటీడ్ అదనపు ఆదాయం.. అదనపు లాభాలు
Image Credit : Getty

గ్యారెంటీడ్ అదనపు ఆదాయం.. అదనపు లాభాలు

ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్ నిబంధనల ప్రకారం, ప్రీమియం చెల్లించే కాలపరిమితిలో ప్రతి ఏటా గ్యారెంటీడ్ అడిషన్స్ లభిస్తాయి. పాలసీ ప్రతి అర్హత గల సంవత్సరంలో బేసిక్ సమ్ అష్యూర్డ్‌లోని ప్రతి 1000 రూపాయలకు 40 రూపాయల చొప్పున అదనంగా కలుస్తాయి.

ఒకవేళ బేసిక్ సమ్ అష్యూర్డ్ 5 లక్షల రూపాయలు అయితే, ప్రతి అర్హత సంవత్సరంలో ఈ గ్యారెంటీడ్ అడిషన్స్ మొత్తం ఏకంగా 20,000 రూపాయల వరకు చేరుకుంటుంది. ఇది పాలసీదారునికి అదనపు ఆర్థిక బలాన్ని ఇస్తుంది.

55
ఫ్లేక్సి ఇన్కమ్, మరణ ప్రయోజనం, లోన్ సౌకర్యం కూడా
Image Credit : iSTOCK

ఫ్లేక్సి ఇన్కమ్, మరణ ప్రయోజనం, లోన్ సౌకర్యం కూడా

ఈ ప్లాన్‌లో అదనంగా ఫ్లేక్సి ఇన్కమ్ ప్రయోజనం కూడా అందుబాటులో ఉంది. అంటే, పాలసీదారుడు తన ఆదాయాన్ని వెంటనే తీసుకోకుండా భవిష్యత్తు కోసం వాయిదా వేసుకోవడానికి అనుమతిస్తుంది. ఇలా వాయిదా వేసిన మొత్తంపై కంపెనీ నిర్ణయించిన రేటు ప్రకారం వడ్డీ లభిస్తుంది. ప్రస్తుతం ఈ వడ్డీ రేటు వార్షికంగా 5.5 శాతంగా ఉంది.

అంతేకాకుండా, పాలసీ అమలులో ఉన్న సమయంలో పాలసీదారుడు మరణిస్తే, నిబంధనల ప్రకారం నామినీకి డెత్ బెనిఫిట్స్ అందుతాయి. అత్యవసర సమయాల్లో ఈ పాలసీపై రుణం తీసుకునే సదుపాయం కూడా కల్పించారు. లోన్ మొత్తం, వడ్డీ రేటు, చెల్లింపు గడువు అన్నీ పాలసీ నిబంధనలపై ఆధారపడి ఉంటాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
పర్సనల్ పైనాన్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Silver Rate: తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన పసిడి...రూ.2లక్షలకు పడిపోతున్న వెండి
Recommended image2
Second Hand Mobile: సెకండ్‌ హ్యాండ్ ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్‌.. ఈ బిజినెస్‌లో లాభాలు ఎలా ఉంటాయి?
Recommended image3
Inspiring Story: సరదాగా చేసిన వీడియోలే జీవితాన్ని మార్చేశాయి.. పచ్చళ్లతో మొదలై రూ.కోట్ల బిజినెస్
Related Stories
Recommended image1
Mutual Fund SIP: కేవలం రూ. 2 వేల పెట్టుబడితో రూ. 2 కోట్లు సొంతం.. ఈ ట్రిక్ మీకు తెలుసా?
Recommended image2
Jio IPO: జియో ఐపీఓ సంచలనం.. భారత్‌లో ఫస్ట్ టైమ్ 10 మిలియన్లకు పైగా దరఖాస్తులతో రికార్డు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved