MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Indian Railways : టికెట్ ఉంటే చాలు రైలులో ఈ 5 సేవలు ఉచితం.. ఈ సీక్రెట్ సర్వీసెస్ మీరు వాడుకొండి

Indian Railways : టికెట్ ఉంటే చాలు రైలులో ఈ 5 సేవలు ఉచితం.. ఈ సీక్రెట్ సర్వీసెస్ మీరు వాడుకొండి

రైలు టికెట్ కొంటే కేవలం ప్రయాణం మాత్రమే చేయొచ్చని అనుకుంటున్నారా..? కానీ ఈ టికెట్‌తో పాటు మనకు తెలియని ఎన్నో ఉచిత సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. అవేంటో వివరంగా చూద్దాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 28 2026, 08:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రైల్వే ప్రయాణికులకు ఈ సేవలు ఉచితం..
Image Credit : X

రైల్వే ప్రయాణికులకు ఈ సేవలు ఉచితం..

భారత్‌లో రోజూ కోట్లాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. తక్కువ ఖర్చుతో, సౌకర్యవంతంగా సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు రైలు ప్రయాణమే చాలామందికి మొదటి ఆప్షన్. అయితే రైలు టికెట్ కొన్న ప్రయాణికులకు కొన్ని ఉచిత సౌకర్యాలు కూడా లభిస్తాయని చాలామందికి తెలియదు. ఇండియన్ రైల్వేస్ అందించే ఈ సేవలు మీ ప్రయాణాన్ని మరింత సులభంగా, సురక్షితంగా మారుస్తాయి.

26
వెయిటింగ్ రూమ్
Image Credit : Getty

వెయిటింగ్ రూమ్

రైల్వే స్టేషన్లలో లభించే ముఖ్యమైన సౌకర్యం 'వెయిటింగ్ రూమ్'. రైలు ఆలస్యంగా ఉన్నా లేదా మీరు స్టేషన్‌కు ముందుగానే వచ్చినా, ఇక్కడ ఉచితంగా కూర్చొని విశ్రాంతి తీసుకోవచ్చు. చాలా ప్రధాన స్టేషన్లలో ఏసీ, నాన్-ఏసీ వెయిటింగ్ హాల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతుంది.

Related Articles

Related image1
Indian Railways : ఇప్పటివరకు రైలు పరుగుతీయని రాష్ట్రమేదో తెలుసా?
Related image2
Railway Jobs : తెలుగు యువతకు బంపరాఫర్... పదో తరగతి పాసైతే చాలు ప్రభుత్వ ఉద్యోగం
36
ఉచిత వైఫై
Image Credit : stockPhoto

ఉచిత వైఫై

ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ తప్పనిసరి అయిపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని చాలా రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫై సౌకర్యాన్ని అందిస్తున్నారు. దీని ద్వారా మీ మొబైల్ డేటా వాడకుండానే రైలు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు, ఆన్‌లైన్ పనులు పూర్తి చేసుకోవచ్చు. ముఖ్యంగా సిగ్నల్ సరిగా లేని చోట్ల ఇది బాగా ఉపయోగపడుతుంది.

46
ఏసీ కోచ్ వారికి సౌకర్యాలు...
Image Credit : Getty

ఏసీ కోచ్ వారికి సౌకర్యాలు...

ఏసీ కోచ్‌లలో ప్రయాణించే వారికి రైల్వే శాఖ దుప్పటి, దిండు, బెడ్‌షీట్ వంటివి ఉచితంగా అందిస్తుంది. దీనికోసం అదనంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణాల్లో, చలికాలం లేదా వర్షాకాలంలో ఈ సౌకర్యాలు ప్రయాణాన్ని చాలా సౌకర్యవంతంగా మారుస్తాయి.

56
వైద్య సహాయం...
Image Credit : Gemini AI

వైద్య సహాయం...

ప్రయాణ సమయంలో ఆరోగ్యం బాగోలేకపోయినా రైల్వే శాఖ సాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సహాయం అందిస్తారు. అవసరమైతే తర్వాతి స్టేషన్‌లో డాక్టర్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. దీంతో ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణం చేయవచ్చు.

66
ఇతర సహాయం..
Image Credit : Getty

ఇతర సహాయం..

అంతేకాకుండా ప్రయాణంలో ఏమైనా సమస్య వస్తే టీటీఈ, కోచ్ అటెండెంట్ లేదా రైల్వే హెల్ప్‌లైన్ ద్వారా సహాయం పొందవచ్చు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పిల్లలకు ఈ సేవలు చాలా ముఖ్యం. ఈ ఉచిత సౌకర్యాల గురించి తెలుసుకుని, వాడుకుంటే మీ రైలు ప్రయాణం మరింత ప్రశాంతంగా, సురక్షితంగా ఉంటుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Meat : మీరు కొనే మటన్ తాజాదేనా? ఈ 4 ట్రిక్స్‌తో ఈజీగా కనిపెట్టండి !
Recommended image2
Hotel Safety Tips : హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్‌పై వాలిపోకండి..! ఈ విషయాలు చెక్ చేసుకొండి
Recommended image3
No signal in Lift: లిఫ్ట్ లో ఫోన్ సిగ్నల్ ఎందుకు రాదు..?
Related Stories
Recommended image1
Indian Railways : ఇప్పటివరకు రైలు పరుగుతీయని రాష్ట్రమేదో తెలుసా?
Recommended image2
Railway Jobs : తెలుగు యువతకు బంపరాఫర్... పదో తరగతి పాసైతే చాలు ప్రభుత్వ ఉద్యోగం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved