- Home
- Feature
- Jeans Banned: జీన్స్ వేసుకుంటే జైలు శిక్ష.. ఇలాంటి చెత్త నిబంధన ఎక్కడ, ఎందుకు పెట్టారో తెలుసా?
Jeans Banned: జీన్స్ వేసుకుంటే జైలు శిక్ష.. ఇలాంటి చెత్త నిబంధన ఎక్కడ, ఎందుకు పెట్టారో తెలుసా?
Jeans Banned: జీన్స్ వేసుకుంటే చాలు జైలు శిక్ష పడే పరిస్థితి ఆ దేశంలో. చిన్న వారి నుంచి పెద్ద వారి వరకు ఎవరూ జీన్స్ వేయకూడదు. అవి వారికి పరాయి దుస్తులు. ఇంతకీ ఇలాంటి నిబంధ పెట్టిన దేశం ఏదో తెలుసా?

జీన్స్ పై నిషేధం
జీన్స్ అంటే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరికీ ఇష్టమే. తక్కువ ధరకే ఎక్కువ రోజులు మన్నే దుస్తులు ఇవి. ముఖ్యంగా నీలిరంగు జీన్స్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. అయితే ఉత్తర కొరియాలో మాత్రం ఈ దుస్తుల విషయంలో ఆంక్షలు ఉన్నాయిఅక్కడ నీలిరంగు జీన్స్‌ను పాశ్చాత్య సంస్కృతికి, ముఖ్యంగా అమెరికా జీవనశైలికి గుర్తుగా చూస్తారు. అందుకే ఆ దేశ ప్రభుత్వం ఇలాంటి దుస్తులపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సాధారణంగా ఫ్యాషన్‌గా భావించే జీన్స్.. అక్కడ రాజకీయ, సామాజిక నియంత్రణకు సంబంధించిన అంశంగా మారింది. ఉత్తరకొరియాలో ఒక్కరూ కూడా జీన్స్ వేసుకుని కనిపించరు.
అమెరికా సంస్కృతి
ఉత్తర కొరియా ప్రభుత్వం తమ దేశ ప్రజలపై విదేశీ సంస్కృతి ప్రభావం పడకుండా ఉండేందుకు అనేక ఆంక్షలు విధిస్తోంది. ముఖ్యంగా అమెరికా సంస్కృతి అంటే అస్సలు ఇష్టపడరు. జీన్స్‌ను కూడా అందులో భాగంగానే చూస్తోంది ఉత్తరకొరియా ప్రభుత్వం. విదేశీ అక్షరాలు ముద్రించిన టీషర్టులు, కొన్ని రకాల ఫ్యాషన్ దుస్తులు, జుట్టు అలంకరణల విషయంలోనూ అక్కడ ఆంక్షలు ఉన్నాయి. ప్రజలు తమకు నచ్చిన దుస్తులు ధరించడం వ్యక్తిగత స్వేచ్ఛగా భావించే ఇతర దేశాలతో పోలిస్తే ఉత్తర కొరియాలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అక్కడ ప్రభుత్వం నిర్ణయించిన నియమాలకు అనుగుణంగా జీవించాల్సి ఉంటుంది
నిబంధనలు పాటించకపోతే...
ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఏం జరుగుతుందో తెలుసా? మొదట అధికారులు ప్రశ్నించడం, హెచ్చరించడం వంటి చర్యలు తీసుకుంటారు. ఇంకా మాట వినకపోతే కఠినమైన శిక్షలు విధిస్తారు. నీలిరంగు జీన్స్ ధరించిన వారికి జైలు శిక్ష పడే అవకాశాలు చాలా ఎక్కువ. ఉత్తర కొరియాలో విదేశీ సంస్కృతి ప్రభావాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి నియంత్రణలు అమలు చేస్తున్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో జీన్స్ సాధారణ దుస్తులుగా మారిపోయాయి. కానీ ఉత్తర కొరియాలో మాత్రం ఈ దుస్తులు అతి పెద్ద వివాదం.








