MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Pawan Kalyan Love Story: పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా.. వీరిద్దరిలో మొదట ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా?

Pawan Kalyan Love Story: పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా.. వీరిద్దరిలో మొదట ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా?

Pawan Kalyan Love Story: మెగా ఫ్యామిలీలో కోడలిగా అడుగు పెట్టింది రష్యన్ యువతి అన్నా లెజినోవా. పవన్ కళ్యాణ్ భార్యగా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ఈ మధ్యనే ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఖాతా తెరిచి యాక్టివ్‌గా మారింది. 

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 08 2026, 01:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
అన్నా లెజినోవా ‘ఆస్క్ మి ఎనీ థింగ్’
Image Credit : Anna konidela/Instagram

అన్నా లెజినోవా ‘ఆస్క్ మి ఎనీ థింగ్’

పవన్ కళ్యాణ్ భార్యగా అన్నాలెజినోవాకు మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఆమె ఇలా ఖాతా తెరిచిందో లేదో లక్షల మంది ఆమెను ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. మెగా అభిమానులే కాదు జనసేన కార్యకర్తలు కూడా ఆమెను ఫాలో అవుతున్నారు. అయితే ఇన్ స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌తో చిట్ చాట్ చేసింది. ‘ఆస్క్ మీ ఎనీ థింగ్’ అని ఆమె అడగ్గానే అభిమానులు ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానం చెప్పింది అన్నా లెజినోవా.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అన్ని తెలుగు వంటలు వచ్చు
Image Credit : Anna konidela/Instargam

అన్ని తెలుగు వంటలు వచ్చు

పవన్ కళ్యాణ్‌ని పెళ్లి చేసుకున్నాక ఎన్నో తెలుగు వంటలు నేర్చుకున్నట్టు చెప్పింది అన్నాలెజినోవా. ఒక ఫాలోవర్ మీరు వంట చేయగలరా అని ప్రశ్నిస్తే... ‘మా అత్తమ్మ దగ్గర నేను వంటలు నేర్చుకున్నాను. బిర్యాని, రొయ్యల ఇగురు, పాలక్ పనీర్, చేపల పులుసు, పప్పు, గోంగూర చట్నీ, దోశ, ఇడ్లీ’ ఇలా ఎన్నో వంటకాలు చేయడం వచ్చని చెప్పింది అన్నా. మరొక అభిమాని పవన్ కళ్యాణ్కి ఇష్టమైన ఆహారం ఏమిటని ప్రశ్నించా.రు దానికి అన్నా ‘మా అత్తమ్మ చేసే మసాలా చికెన్ కర్రీ అంటే పవన్ కు చాలా ఇష్టం. నేను కూడా ఆ వంటను నేర్చుకున్నాను. అలాగే వదినమ్మ సురేఖ చేసే చేపల పులుసును కూడా పవన్ చాలా ఇష్టంగా తింటారు’ అని చెప్పింది.

Related Articles

Related image1
Chiraiya Review: భార్యతో కలవాలంటే భర్త ఆమె అంగీకారం తీసుకోవాల్సిందే.. ప్రతి మగాడు చూడాల్సిన సిరీస్
Related image2
Astrology Predictions: వచ్చే 3 నెలలు ఈ రాశులకు సంపద, పలుకుబడి పీక్స్‌కి చేరుకుంటాయి
33
ఎవరు ముందు ప్రపోజ్ చేశారు?
Image Credit : Anna konidela/instagram

ఎవరు ముందు ప్రపోజ్ చేశారు?

మరొక ఫాలోవర్ అందరికన్నా ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. ఇద్దరిలో ముందుగా ప్రపోజ్ చేసింది ఎవరు వదినా? అని ప్రశ్నించారు. దానికి అన్నా లెజినోవా ‘మీ అన్నయ్యే’ అని చెప్పింది. అంటే పవన్ కళ్యాణ్ అన్నాకు ప్రేమ, పెళ్లి ప్రపోజల్ చేసినట్లు దీని ద్వారా తెలుస్తోంది. వీరిద్దరూ తీన్మార్ సినిమా షూటింగ్లో కలిశారు. తీన్మార్ లో అన్నా లెజినోవా పాత్ర ఏమీ లేదు. కేవలం ఒక పబ్ లో ఇలా కనిపించి అలా మాయం అయిపోతుంది. కానీ ఆ సీన్లోనే పరిచయం ఏర్పడి అది స్నేహంగా మారి చివరకు పెళ్లి వరకు దారి తీసింది. సినిమా సెట్స్‌లో మొదలైన పరిచయం ఇప్పుడు ఇద్దరు పిల్లలతో గాఢమైన బంధంగా మారిపోయింది. వీరిద్దరూ 2013లో పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి కూడా చాలా సింపుల్‌గా జరిగింది. పవన్ కళ్యాణ్ జీవితంలో ఇది మూడో వివాహం. గత 15 ఏళ్లుగా వీరిద్దరి బంధం స్థిరంగా సాగుతూ వస్తోంది. అన్నా కూడా కొణిదెల కుటుంబంలో బాగానే కలిసిపోయింది. భారతీయ సాంప్రదాయాలను కూడా గౌరవిస్తుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss10: కంటెస్టెంట్స్ కి దిమ్మతిరిగే రెమ్యూనరేషన్, ఎవరికి ఎంతంటే?
Recommended image2
Kayadu Lohar: బోల్డ్ సీన్లపై కయాదు లోహర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. అదిరిపోయే కండీషన్‌ పెట్టిన క్రేజీ హీరోయిన్‌
Recommended image3
Telugu Actress Arrest : చిరంజీవితో కలిసి కామెడీ పండించిన తెలుగు నటి అరెస్ట్.. ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
Chiraiya Review: భార్యతో కలవాలంటే భర్త ఆమె అంగీకారం తీసుకోవాల్సిందే.. ప్రతి మగాడు చూడాల్సిన సిరీస్
Recommended image2
Astrology Predictions: వచ్చే 3 నెలలు ఈ రాశులకు సంపద, పలుకుబడి పీక్స్‌కి చేరుకుంటాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved