MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Feature
  • Investment Tips : రోజుకు కేవలం రూ.67 చాలు, ఏకంగా కోటి రూపాయలు పొందండి.. ఈ ఫార్ములా మీకోసమే

Investment Tips : రోజుకు కేవలం రూ.67 చాలు, ఏకంగా కోటి రూపాయలు పొందండి.. ఈ ఫార్ములా మీకోసమే

ఆర్థిక క్రమశిక్షణతో పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో కోటి రూపాయల సంపద సృష్టించవచ్చు. చక్రవడ్డీ ప్రయోజనం, చిన్న వయసులోనే పెట్టుబడి మొదలుపెట్టడం, సరైన మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోవడం వంటివి ఈ లక్ష్యాన్ని చేరడానికి కీలకం. ఆ కోటీశ్వరుల ఫార్ములా ఏంటో ఇక్కడ చూడండి

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 10 2026, 10:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
భవిష్యత్తులో కోటి సంపాదన సాధ్యమేనా?
Image Credit : Gemini

భవిష్యత్తులో కోటి సంపాదన సాధ్యమేనా?

నెలకు కేవలం రూ.2,000 అంటే రోజుకి రూ.67 పెట్టుబడితో కోటి రూపాయలు సంపాదించడం సాధ్యమేనా? చాలామంది ఇన్వెస్టర్లకు ఈ సందేహం ఉంటుంది. అయితే ఆర్థిక నిపుణుల నుండి సాధ్యమే అన్న సమాధానం వినిపిస్తుంది. కానీ ఇది ఒకటిరెండు రోజుల్లోనో, నెలల్లోనో కాదు కొన్ని సంవత్సరాల్లో అయ్యే పని… చాలా ఏళ్లపాటు క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టాలి. అప్పుడే మీరు తక్కువ పెట్టుబడితో కోటీశ్వరులు అయ్యేది. 

తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులు పొందాలంటే సరైన మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. మనీ కంట్రోల్ కథనం ప్రకారం.. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టినా, కాలక్రమేణా పెద్ద సంపదను సృష్టించవచ్చు. ముఖ్యంగా చిన్న వయసులో మొదలుపెడితే, కాంపౌండింగ్ ఎఫెక్ట్ వల్ల చిన్న పెట్టుబడే భవిష్యత్తులో భారీ నిధిగా మారుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కోటి రూపాయలు పొందాలంటే ఎంత సమయం పడుతుంది?
Image Credit : Gemini AI

కోటి రూపాయలు పొందాలంటే ఎంత సమయం పడుతుంది?

మ్యూచువల్ ఫండ్ SIP ద్వారా నెలకు రూ.2,000 పెట్టుబడి పెడుతూ, ఏటా సగటున 10%-15% రాబడి వస్తే, సుమారు 28 నుంచి 38 ఏళ్లలో కోటి రూపాయల లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఈ లెక్కలన్నీ మార్కెట్ దీర్ఘకాలిక పనితీరుపై ఆధారపడి ఉంటాయి. ఇక్కడ పెట్టుబడి పెట్టే సమయం, రాబడి రేటు అనేవి చాలా కీలకం. మ్యూచువల్ ఫండ్ SIP వివరాల కోసం ఆన్‌లైన్ క్యాలిక్యులేటర్‌లను ఉపయోగించవచ్చు.

36
పెట్టుబడిలో సమయం చాలా ముఖ్యం
Image Credit : Gemini AI

పెట్టుబడిలో సమయం చాలా ముఖ్యం

SIP ద్వారా సంపద సృష్టించడానికి చక్రవడ్డీ (Compounding) ప్రధాన కారణం. మొదట్లో మీరు పెట్టిన నెలవారీ పెట్టుబడి మాత్రమే పెరుగుతుంది. కానీ రానురాను దానిపై వచ్చిన లాభం కూడా కలిసి సంపదను పెంచుతుంది. దీంతో చివరి సంవత్సరాల్లో పెట్టుబడి చాలా వేగంగా వృద్ధి చెందుతుంది. అందుకే ఆర్థిక నిపుణులు మార్కెట్‌ను 'టైమింగ్' చేయడం కన్నా, మార్కెట్‌లో 'ఎక్కువ సమయం' ఉండటం ముఖ్యమంటారు. ఎంత త్వరగా పెట్టుబడి మొదలుపెడితే, చక్రవడ్డీ లాభం అంత ఎక్కువగా పొంది, పెద్ద సంపదను నిర్మించవచ్చు.

46
చిన్న వయసులోనే పెట్టుబడులు పెట్టండి
Image Credit : Meta AI

చిన్న వయసులోనే పెట్టుబడులు పెట్టండి

చిన్న వయసులోనే (22-25 ఏళ్లు) నెలకు రూ.2,000 SIP మొదలుపెడితే, చక్రవడ్డీతో దీర్ఘకాలంలో కోటి రూపాయలు సులభంగా సంపాదించవచ్చు. అదే 40 ఏళ్ల వయసులో ఆలస్యంగా మొదలుపెడితే, లక్ష్యం చేరడానికి నెలవారీ పెట్టుబడి భారీగా పెంచాల్సి ఉంటుంది. అందుకే వీలైనంత త్వరగా చిన్న మొత్తంతోనైనా పెట్టుబడి ప్రారంభించడం మంచిది. దీనివల్ల 'రూపీ కాస్ట్ యావరేజింగ్' ప్రయోజనం కూడా లభించి, మార్కెట్ ఒడుదొడుకుల రిస్క్ తగ్గుతుంది.

56
సరైన మ్యూచువల్ ఫండ్ అవసరం
Image Credit : Gemini

సరైన మ్యూచువల్ ఫండ్ అవసరం

కోటి రూపాయల లక్ష్యాన్ని చేరుకోవాలంటే సరైన మ్యూచువల్ ఫండ్ ఎంచుకోవడం ముఖ్యం. లార్జ్-క్యాప్ ఫండ్‌లు తక్కువ రిస్క్‌తో సుమారు 10% స్థిరమైన రాబడిని ఇస్తాయి. ఇవి సురక్షితమైన పెట్టుబడికి మంచివి. స్మాల్-క్యాప్ ఫండ్‌లు ఎక్కువ లాభం ఇచ్చే అవకాశం ఉన్నా, మార్కెట్ ఒడుదొడుకుల రిస్క్ కూడా ఎక్కువే. కాబట్టి రిస్క్ తీసుకోగల ఇన్వెస్టర్లకు ఇవి సరిపోతాయి. అయితే పాత రాబడే భవిష్యత్తులోనూ వస్తుందని చెప్పలేం. ప్రతీదీ పూర్తిగా మార్కెట్ పరిస్థితులపైనే ఆధారపడి ఉంటుంది.

66
త్వరగా కోటి రూపాయలు సంపాదించాలా?
Image Credit : Pixabay

త్వరగా కోటి రూపాయలు సంపాదించాలా?

మీ జీతం పెరిగినప్పుడల్లా ప్రతీ ఏటా SIP మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు నెలకు రూ.2,000తో మొదలుపెట్టి, ప్రతీ సంవత్సరం SIPని 10% లేదా 15% పెంచితే, మీరు అనుకున్నదానికంటే తక్కువ సమయంలోనే కోటి రూపాయల లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అలాగే ఏడాదికి ఒకసారి మీ పెట్టుబడులను సమీక్షించుకుని, అవసరమైతే పోర్ట్‌ఫోలియోను మార్చుకోవడం మంచి వ్యూహం. 

ఇలా నెలకు కేవలం రూ.2,000 SIPతో కూడా కోటి రూపాయల సంపదను సృష్టించడం అసాధ్యమేమీ కాదు. కానీ ఓపిక, క్రమశిక్షణ, దీర్ఘకాలిక దృష్టి చాలా ముఖ్యం. మధ్యలో ఆపకుండా పెట్టుబడి కొనసాగిస్తే, చిన్న మొత్తంతోనే భవిష్యత్తులో పెద్ద ఆర్థిక లక్ష్యాలను చేరుకోవచ్చు.

గమనిక

ఇక్కడ చెప్పిన 10%, 12%, 15% రాబడి అంచనాలు అవగాహన కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. గతంలో వచ్చిన రాబడి, భవిష్యత్తులోనూ వస్తుందని గ్యారెంటీ లేదు. పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మీ డబ్బుకు ఏసియానెట్ న్యూస్ ఎలాంటి బాధ్యత వహించదు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
పర్సనల్ పైనాన్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Yawning: ఎదుటివారు ఆవ‌లిస్తే మ‌న‌కూ ఆవ‌లింత‌లు ఎందుకు వ‌స్తాయి.? ఎప్పుడైనా ఆలోచించారా
Recommended image2
Andhra Ooty: ఆంధ్ర ఊటీ.. అరకులో తప్పకుండా చూడాల్సిన టాప్ 10 ప్రదేశాలు ఇవే
Recommended image3
ఎంత బ‌ల‌వంతుడివైనా స‌రే కోపం జీవితాన్ని నాశ‌నం చేయ‌డం ఖాయం.. క‌నువిప్పు క‌లిగించే క‌థ
Related Stories
Recommended image1
SIP Investment: రూ. 21,250తో కోటీశ్వరుడు అవ్వొచ్చు.. 8-4-3 సీక్రెట్ రూల్ తెలుసా?
Recommended image2
Investment Tips : ఈ 3 చోట్ల ఎంత ఖర్చు చేసినా పర్లేదు.. డబ్బు డబుల్ అవుతుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved