MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Feature
  • Rain: వడగళ్ల వానలు ఎలా పడతాయి. వానరాళ్లు ఎక్కడ నుంచి పుట్టుకొస్తాయి, వాటిని తినడం మంచిదేనా?

Rain: వడగళ్ల వానలు ఎలా పడతాయి. వానరాళ్లు ఎక్కడ నుంచి పుట్టుకొస్తాయి, వాటిని తినడం మంచిదేనా?

వేసవి వచ్చిందంటే మండే ఎండలతో పాటు వడగళ్ల వానలు కూడా జనాలకు భయపెడుతుంటాయి. వాటి వల్ల పంటలకు కూడా చాలా నష్టం జరుగుతుంది. అసలు ఈ వడగళ్ల వానలు ఎలా పడతాయి. వడగళ్లు ఎలా ఏర్పడతాయి.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 05 2026, 09:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వేసవిలో వడగళ్ల వానలు
Image Credit : Asianet News

వేసవిలో వడగళ్ల వానలు

ఎండాకాలం వచ్చిందంటే జానాలు ఎండవేడితో పాటు వడగళ్ల వానలకు కూడా భయపడుతుంటారు. పైనుంచి పడే మంచు రాళ్లవర్షం చూడటానికి ఎంతో అందంగా అనిపించినా.. వాటి వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా రైతులకు అవి పంటనష్టాన్ని తీసుకువస్తాయి. మనుషులను గాయపరుస్తాయి కూడా. అసలు ఈ వడగళ్లు ఎలా పుడతాయి. ఎక్కడి నుంచి వస్తాయి. వానరాళ్లు ఏర్పడటానికి కావల్సిన పరిస్థితులు ఏంటి? పై నుంచి మంచు రాళ్లు పడటం ఎలా సాధ్యం అవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
క్యుములోనింబస్ మేఘాల కారణంగా..
Image Credit : Gemini AI

క్యుములోనింబస్ మేఘాల కారణంగా..

ఈ వడగళ్ల వానలు సాధారణంగా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు వచ్చినప్పుడు ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా వేసవి కాలంలో భూమి వేడెక్కి గాలి వేగంగా పైకి లేచి.. తేమతో సహా బాగా ఎత్తుకు వెళ్లినప్పుడు ఇవి ఏర్పడతాయి. పైకి లేచే వేడి గాలి , క్రిందికి వచ్చే చల్లని గాలి మధ్య జరిగే సంఘర్షణ వల్ల ఏర్పడిన మేఘాలను క్యుములోనింబస్ మేఘాలు అంటారు. ఇవి ఒకదానికి మరొకటి ఢీ కొట్టడం వల్ల వడగళ్ల‌ు రాలి పడతాయి. వర్షంతో పాటుగా పడతాయి కాబట్టి.. వీటిని వాడుక భాషలో వానరాళ్లు అంటారు.

36
వడగళ్లు ఏ సైజ్ లో ఏర్పడతాయి?
Image Credit : Asianet News

వడగళ్లు ఏ సైజ్ లో ఏర్పడతాయి?

వడగళ్ల పరిమాణం చిన్నదిగా ఉండవచ్చు, పెద్దదిగా కూడా ఉండవచ్చు. కొన్నిసార్లు పప్పు గింజలంత ఉంటే, మరికొన్ని సందర్భాల్లో నిమ్మకాయ సైజులో పెద్దగా ఉండే అవకాశం ఉంది. ఇక కొన్ని పరిస్థితుల్లో భారీ స్థాయిలో కూడా వడగళ్లు ఏర్పడుతుంటాయి. వాటి పరిమాణం మేఘాలలో గాలుల వేగం, తేమ, ఉష్ణోగ్రతలపై ఆధారపడి ఉంటుంది. చూడటానికి ఐస్ క్యూబ్స్ మాదిరిగా ఉండే ఈ వానరాళ్లను కొంత మంది తింటుంటారు కూడా.

46
వానరాళ్లు తినడం మంచిదేనా?
Image Credit : Asianet News

వానరాళ్లు తినడం మంచిదేనా?

వెనకటి రోజుల్లో కొంత మంది పెద్దవారు వానరాళ్లు తింటే మంచిది అని చెపుతుండేవారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు, వాతావరణ మార్పుల వలన వానరాళ్లు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు అని నిపుణులు చెపుతున్నారు. వాతావరణ కాలుష్యం వలన.. అవి కూడా కలుషితం అవుతున్నాయని వారు అంటున్నారు. కాబట్టి వానరాలు తినే అలవాటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండటం మంచిది.

56
వేసవిలోనే ఎందుకు ఎక్కువ?
Image Credit : Asianet News

వేసవిలోనే ఎందుకు ఎక్కువ?

వడగళ్ల వానలు ఎక్కువగా వేసవిలోనే పడతాయి. దానికి కారణం కూడా ఉంది. వడగళ్లు ఏర్పడాలంటే నేలపై ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండాలి. సమ్మర్ లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. ఆ సమయంలో వడగాళ్ల వానలు కురిసేందుకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అయితే కేవలం వేసవిలో మాత్రమే కాదు, ఏడాది పొడవునా.. ఎప్పుడైనా వాడగళ్లు పడే అవకాశం ఉంది.

66
రాళ్లవాన వల్ల నష్టాలు..
Image Credit : Asianet News

రాళ్లవాన వల్ల నష్టాలు..

వడగళ్ల వాన వల్ల పంటలకు, వాహనాలకు, ఇళ్లకు నష్టం కలగవచ్చు. రైతులకు ఇది పెద్ద సమస్యగా మారుతుంది. కొన్నిసార్లు పండిన పంటలను వడగళ్ల వాన పూర్తిగా నాశనం చేస్తుంది. అలాగే మనుషులకువీటి వల్ల గాయాలు కూడా అవుతుంటాయి. అందుకే వడగళ్ల వాన సమయంలో బయట ఉండటం ప్రమాదకరం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వాతావరణం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dakshina Kailasam: గ్రహణ సమయంలోనూ మూయని ఏకైక గుడి.. ఈ ఆలయానికి జీవితంలో ఒక్కసారైనా ఎందుకు వెళ్లాలి?
Recommended image2
Human Eye: మ‌నిషి క‌న్ను కెమెరా అనుకుంటే.. ఎన్ని మెగాపిక్సెల్స్‌తో స‌మాన‌మో తెలుసా?
Recommended image3
Irumudi: ఇరుముడిలో ఏముంటాయి? ఇరుముడికి అయ్యప్పకు సంబంధమేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved