Mehendi Designs: పండుగల వేళ సింపుల్ మెహందీ డిజైన్లు ఇవిగో, వీటిని వేయడం చాలా సులువు
పండుగల వచ్చాయంటే అమ్మాయిల చేతుల్లో గోరింటాకు, మెహందీలతో నిండిపోతాయి. ఇంటికి పండగ కళ తెచ్చేది ఆడపిల్లలే. పట్టు పరికిణీలతో, చేతి నిండా గాజులతో, అరచేతుల్లో గోరింటాకుతో వరలక్ష్మి వ్రతం నాడు మరింత అందంగా కనిపిస్తారు.

రెడీ మేడ్ గోరింటాకు
ఆషాడ మాసంలోనే కాదు ఏ పండుగైనా సరే ఆడవారు చేతికి మెహందీ పెట్టుకునేందుకు ఇష్టపడతారు. ఒకప్పుడు గోరింటాకును రుబ్బి పెట్టుకునే వారు. ఇప్పుడు రెడీమేడ్ గా మెహందీ కోన్ లో లభిస్తున్నాయి. కేవలం అరగంటలోనే ఇవి ఎండిపోయి ఎర్రటి డిజైన్లను చేతులపై అందిస్తాయి. గోరింటాకు పెట్టుకోవడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తోంది.
మెహెందీ కోన్లు
మెహందీ కోన్‌లు పెట్టుకునేవారు సింపుల్ డిజైన్ల కోసం చూస్తూ ఉంటారు. అలాంటి సింపుల్ డిజైన్లను ఇక్కడ అందించాము. మీకు వీటిలో ఏది సులువుగా అనిపిస్తే అది ప్రయత్నించండి. ఇవన్నీ కూడా చాలా తక్కువ సమయంలోనే అంతగా పండుతాయి.
చర్మ వ్యాధులు రాకుండా
గోరింటాకు పెట్టుకోవడం అనేది పూర్వకాలం నుంచి ఆడవారికి ఉన్న ప్రాచీన సాంప్రదాయం. ఆషాడమాసంలో కచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలనే నియమం ఉంది. గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. శరీరంలోని వేడిని గోరింటాకు తగ్గిస్తుందని చెప్పుకుంటారు. అలాగే చర్మవ్యాధులు, గాయాలు వంటివి కూడా లయన్ చేస్తుందని నమ్ముతారు.
గోరింటాకుతో లాభాలు
మార్కెట్లో దొరికే మెహందీ కోన్ ల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. చాలా తక్కువ సమయంలో ఇది చేతిపై మంచి డిజైన్లను అందిస్తుంది. అంతకుమించి ఆరోగ్యపరంగా ఎలాంటి లాభాలను ఇవ్వదు. అదే గోరింటాకు ఆకులను కోసి మెత్తగా రుబ్బి పెట్టుకుంటే సహజసిద్ధమైన శీతలీకరణిగా ఇది పనిచేస్తుంది. శరీరంలో వేడిని చాలా వరకు తగ్గిస్తుంది. గోరింటాకులో యాంటీ సెప్టిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి గాయాలు త్వరగా తగ్గుతాయి. అలాగే శక్తిని పెంచడానికి కూడా ఇది సహాయపడుతుంది.
ఆషాడంలో గోరింటాకు ఎందుకు
గోరింటాకులో నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచే శక్తి ఉంటుంది. అలాగే ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. గోరింటాకు చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే సహజ సౌందర్యమే కాదు ఎంతో ఆరోగ్యం కూడా. ఆషాడమాసంలోనే గోరింటాకును పెట్టుకోమని చెప్పే సాంప్రదాయం ఎందుకు వచ్చిందో తెలుసా? ఆషాడంలోనే వర్షాలు పడతాయి. దీనివల్ల చర్మవ్యాధులు కూడా అధికంగా వస్తాయి. ఆ చర్మవ్యాధులను తగ్గించే శక్తి గోరింటాకులోని యాంటీ సెప్టిక్ గుణాలకు ఉంటుంది. అందుకే ఆషాడంలో గోరింటాకు పెట్టుకోవడం పూర్వకాలం నుంచి ఒక ఆనవాయితీగా వచ్చినట్టు చెప్పుకుంటారు.