MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • Folk Song : నాగదుర్గ కంటే ముందే ఫోక్ సాంగ్స్ తో యూట్యూబ్‌ ను షేక్ చేసిందిగా, మూడు పాటలతో 35 కోట్ల వ్యూసా.! ఎవరీ శిరీష?

Folk Song : నాగదుర్గ కంటే ముందే ఫోక్ సాంగ్స్ తో యూట్యూబ్‌ ను షేక్ చేసిందిగా, మూడు పాటలతో 35 కోట్ల వ్యూసా.! ఎవరీ శిరీష?

Telangana Folk Song : ప్రస్తుతం యూట్యూబ్ లో ఫోక్ సాంగ్స్ అని సెర్చ్ చేయగానే నాగదుర్గ కనిపిస్తుంది. కానీ ఆమెకంటే ముందు ఓ ఫోక్ సింగర్ యూట్యూబ్ సామ్రాజ్యాన్ని ఏలింది. ఆమె టాప్ 3 సాంగ్స్ ఏకంగా 35 కోట్ల వ్యూస్ సాధించాయి. అంత తోపు ఫోక్ సింగర్ ఎవరో తెలుసా?

3 Min read
Author : Arun Kumar P
Published : Jul 18 2026, 05:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఫోక్ లో నాాగదుర్గ కంటే తోపు... ఎవరీ శిరీష?
Image Credit : Screenshot to Youtube Channel

ఫోక్ లో నాాగదుర్గ కంటే తోపు... ఎవరీ శిరీష?

Folk Singer Shirisha : ప్రస్తుతం సినిమా పాటలకంటే జానపద పాటలకే క్రేజ్ ఎక్కువగా ఉంది. యూట్యూబ్ లో ఇలా పెట్టగానే అలా లక్షలు, కోట్ల వ్యూస్ సాధిస్తున్న ఫోక్ సాంగ్స్ అనేకం ఉన్నాయి. ''రాను బొంబైకి రాను'', ''పేరుగల్ల పెద్దిరెడ్డీ బిడ్డనో ఓ రామ చిలకా'', ''ఓ పిలగ యెంకటేశు'' వంటి పాటలు ఏ స్థాయిలో హిట్ అయ్యాయో చూశాం. ఇటీవల వచ్చిన ''బాసింగ బలాలే'' సాంగ్ కూడా యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ సినిమా హీరోయిన్ స్థాయికి చేరిందంటేనే తెలంగాణ జానపదాలు ప్రజల్లో ఏ స్థాయి అభిమానాన్ని పొందుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

'ఇడుపు కాగితం' సినిమా హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన నాగదుర్గ పేరు సినీ వర్గాల్లో, అభిమానుల్లో బాగా వినిపిస్తోంది. అయితే నాగదుర్గ కంటే ముందే ఓ తెలంగాణ అమ్మాయి యూట్యూబ్ ను షేక్ చేసింది... ఆమె పాట విడుదలైతే చాలు కోట్ల వ్యూస్ పక్కా అనే అభిప్రాయం ఉండేది. ఆమె ఒకే ఒక్క పాట యూట్యూబ్ లో 20 కోట్ల వ్యూస్ కు దగ్గరగా ఉందంటేనే ఎంతలా అభిమానించేవారో అర్థం చేసుకోవచ్చు. ఆమె ఎవరో కాదు దీకొండ శిరీష. తన అందం, అభినయంతోనే కాదు గాత్రంతో అభిమానుల మనసు కొల్లగొట్టేది శిరీష. అసలు ఈమె ఎవరు? ఈమె టాప్ 3 హిట్ సాంగ్స్ ఏంటి అనేది తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎవరీ ఫోక్ సింగర్ శిరీష?
Image Credit : Screenshot to Youtube Channel

ఎవరీ ఫోక్ సింగర్ శిరీష?

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతం దీకొండ శిరీష స్వస్థలం. ఆర్ఎంపి గా పనిచేసే అశోక్, నీరజ దంపతుల ముగ్గురు బిడ్డలలో శిరీష ఒకరు. చిన్నప్పటి నుండే జానపద పాటలను ఇష్టపడే శిరీష గురుకుల పాఠశాలలో చదివే సమయంలో మరింత ఇష్టాన్ని పెంచుకుంది. పెద్ద పిల్లలతో కలిసి ప్రత్యేకంగా మ్యూజిక్ నేర్చుకునేది... ఆమె ఆసక్తిని గమనించిన టీచర్లు, తల్లిదండ్రులు ప్రోత్సహించారు. దీంతో ఇప్పుడు టాప్ ఫోక్ సింగర్లలో ఒకరిగా నిలిచింది.

కేవలం తెలంగాణ జానపదాలకు తన గొంతులోని మాధుర్యాన్ని పంచడమే కాదు... అద్భుతమైన డ్యాన్స్, హావభావాలతో మరో లెవల్ కు తీసుకెళుతుంది శిరీష. ఈమె జనపద పాటలకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. యూట్యూబ్ లో శిరీష ఆడిపాడిన పాటలు కోట్ల వ్యూస్, లక్షల లైక్స్ సాధించాయి. అలాంటి టాప్ 3 పాటలేవో చూద్దాం.

Related Articles

Related image1
Folk Song : ఈ తరం అమ్మాయిలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో చెప్పే బ్లాక్‌బస్టర్ జానపదం.. 6 రోజుల్లోనే 4.7M వ్యూసా..!
Related image2
Bonalu Folk Song : మంగ్లీలోని మాస్ యాంగిల్ బైటపెట్టింది ఈ బోనాల సాంగే.. 92 మిలియన్స్ వ్యూస్ తో యూట్యూబ్ కే పూనకాలు
35
1. యేమే పిల్ల సాంగ్
Image Credit : Screenshot to Youtube Channel

1. యేమే పిల్ల సాంగ్

దీకొండ శిరీషకు జానపద గాయనిగా టాప్ లో కూర్చోబెట్టిన సాంగ్ 'యేమే పిల్ల'. పల్లెటూరి బావామరదల్ల మధ్య సాగే ప్రేమను తెలియజేసేలా ఈ సాంగ్ సాగుతుంది.... ఇందులో శిరీష డ్యాన్స్, నటన ఆకట్టుకునేలా ఉంటుంది.

''యేమే పిల్ల అన్నప్పుడల్లా గుచ్చే పువ్వుల బాణాలు.... గుచ్చే పువ్వుల బాణాలు అవి తేనే సుక్కల తానాలు...

నువ్వు పిలిసే పిలుపులు తెరిసెనే గుండె తలుపులు...

నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో... నీదానివరి పేరు పెట్టుకో'' 

అంటూ సాగుతుంది ఈ పాట. సై టివి యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఈ సాంగ్ ఏకంగా 189 మిలియన్స్ అంటే 18 కోట్ల 90 లక్షల వ్యూస్... 559k లైక్స్ సాధించి యూట్యూబ్ నే షేక్ చేసింది.

45
2. బావల్ల నా బావల్ల సాంగ్
Image Credit : Screenshot to Youtube Channel

2. బావల్ల నా బావల్ల సాంగ్

శిరీష ఆడిపాడిన మరో అద్భుతమైన జానపదం ఈ బావల్ల నా బావల్ల సాంగ్. ''గున్నాగున్నా మామిల్లల్ల గున్నామామిడి తోటల్ల... మాపాటేల మందలియ్య రాయే నువ్వు బావల్ల...'' అంటూ సాగే ఈ పాట కూడా సై టివి యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఈ జానపద పాటకు కూడా తెలుగు ప్రజలు బ్రహ్మరథం పట్టారు... యూట్యూబ్ లో 124 మిలియన్స్ అంటే 12 కోట్లకు పైగా వ్యూస్ తో దూసుకుపోయింది. 388k లైక్ సాధించింది.

55
3. ఉయ్యాలో టుంగుటుయ్యాలో సాంగ్
Image Credit : Screenshot to Youtube Channel

3. ఉయ్యాలో టుంగుటుయ్యాలో సాంగ్

''అత్తగారింటికి కొత్తగవోతున్న ఉయ్యాలో టుంగుటుయ్యాలో... గుత్తెంగ నారైకె గుట్టాలే టైలరు ఉయ్యాలో టూగుటుయ్యాలో'' అంటూ సాగే మరో సూపర్ హిట్ ఫోక్ శిరీష ఖాతాలో ఉంది. ఇది Gaddam Music (గడ్డం మ్యూజిక్) యూట్యూబ్ ఛానల్లో విడుదలయ్యింది. ఇప్పటివరకు 57 మిలియన్స్ అంటే 5 కోట్ల 70 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది... 153k లైక్స్ వచ్చాయి. ఇలా తెలంగాణ జానపదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాయి శిరీష సాంగ్స్.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Yash Mother: అల్లు అరవింద్ కి యశ్ తల్లి కౌంటర్, మా వాడిని అణచాలని చూస్తున్నారా.. డబ్బున్నవాళ్ళ కొడుకు కాదు
Recommended image2
OTT Movies: పవర్ ఫుల్ థ్రిల్లర్ తో తాప్సి రెడీ, నత్తి ఉండే అమ్మాయి కోర్ట్ లో ఎలా..ఈ వారం ఓటీటీ మూవీస్ ఇవే
Recommended image3
Rashmika Injury: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక, షూటింగ్స్ తో ఇక ఫుల్ బిజీ.. ఇవన్నీ మిస్ అవుతా, వైరల్ ఫోటోస్
Related Stories
Recommended image1
Folk Song : ఈ తరం అమ్మాయిలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో చెప్పే బ్లాక్‌బస్టర్ జానపదం.. 6 రోజుల్లోనే 4.7M వ్యూసా..!
Recommended image2
Bonalu Folk Song : మంగ్లీలోని మాస్ యాంగిల్ బైటపెట్టింది ఈ బోనాల సాంగే.. 92 మిలియన్స్ వ్యూస్ తో యూట్యూబ్ కే పూనకాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved