MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Funeral : అంత్యక్రియల్లో శవాన్ని పాడెపైనే ఎందుకు ఉంచుతారు? నలుగురే ఎందుకు మోస్తారు?

Funeral : అంత్యక్రియల్లో శవాన్ని పాడెపైనే ఎందుకు ఉంచుతారు? నలుగురే ఎందుకు మోస్తారు?

అపర కుభేరులనైనా, కూటికి దిక్కులేని పేదలనైనా చనిపోయాక పాడెపైనే మోసేది. మరి శవాన్ని పాడెపై ఉంచడం వెనకున్న కారణాలేంటి? దీన్ని నలుగురే ఎందుకు మోస్తారు? అనేది తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Aug 27 2026, 01:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
అంత్యక్రియల గురించి ఆసక్తికర విషయాలు
Image Credit : Gemini AI

అంత్యక్రియల గురించి ఆసక్తికర విషయాలు

మనిషి జీవితంలో బంధాలు, అనుంబంధాలు చాలా ముఖ్యమైనవి... ఇవే లేకపోతే మనిషికి, రోబోకి తేడా ఉండదు. అందుకే బ్రతికుండగానే నలుగురిని సంపాదించుకోవాలని పెద్దలు చెబుతుంటారు... ఇంకా ఘాటుగా ''చనిపోయాక పాడె మోసేందుకైనా ఓ నలుగురు కావాలిగా'' అని జీవిత సత్యాన్ని చెబుతుంటారు. సమాజంతో మంచి సత్సంబంధాలు కలిగివుండాలని, మంచి పేరు సంపాదించుకోవాలనే అంతరార్థం పెద్దల మాటల్లో దాగుంది.

అయితే చనిపోయిన మనిషిని పాడెపై ఊరేగించడం, నలుగురే పాడెను మోయడం వెనక సామాజిక అంశాలే కాదు కొన్ని ఆద్యాత్మిక కారణాలు కూడా ఉన్నాయి. అంత్యక్రియల్లో నిర్వహించే ఈ ఆచారాల గురించిన ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
శవాన్ని మోసేందుకు పాడే ఎందుకు?
Image Credit : Gemini AI

శవాన్ని మోసేందుకు పాడే ఎందుకు?

ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత చితిలో కాల్చేవరకు లేదా సమాధి చేసేవరకు పాడె పైనే ఉంచుతారు. బలమైన కట్టెలతో ఈ పాడెను తయారుచేస్తారు... అంతిమయాత్ర కూడా ఈ పాడెపైనే జరుగుతుంది. మొత్తంగా శవాన్ని భూమిని తాకనివ్వకుండా ఈ పాడెను ఉపయోగిస్తారు. దీని వెనక ఆసక్తికర కారణాలు దాగున్నాయి.

మరణం అంటే శరీరం పంచభూతాల్లో కలవడానికి సిద్దమయినట్లు. అందుకే చివరి క్షణాల్లో ఆ దేహానికి తగిన గౌరవం ఇవ్వాలని భావిస్తారు... అందుకే నేరుగా నేలపై ఉంచకుండా పాడెపై పెడతారు. అంతేకాదు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది... కాబట్టి చనిపోయిన శవాన్ని భూమిపై పెడితే దేహంలో మిగిలిన సూక్ష్మ శక్తిని కూడా అది లాగేసుకుంటుందని చెబుతారు. అందుకే శవాన్ని భూమిపై కాకుండా పాడెపై పడుకోబెడతారు.

శవాన్ని నేలపై పెడితే క్రిములు, చీమలు, పురుగులు వంటివి చుట్టూ చేరి పాడుచేస్తాయి. దీంతో శవం మరింత త్వరగా పాడయ్యే అవకాశాలు ఉంటాయి. నేలలోని తేమ కూడా శరీరాన్ని తొందరగా పాడుచేస్తుంది. అందుకే శవాన్ని పాడెపై పడుకోబెడతారు.

33
పాడెను నలుగురే ఎందుకు మోస్తారు?
Image Credit : Gemini AI

పాడెను నలుగురే ఎందుకు మోస్తారు?

హిందూ, ముస్లిం, క్రిస్టియన్... అన్ని మతాల్లోనూ శవాన్ని పాడెపైనే ఊరేగిస్తారు... దాన్ని నలుగురు మోస్తుంటారు. దీని వెనుక భౌతిక, సామాజిక, ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

సైంటిఫిక్ రీజన్ (Physics & Balance)

పాడె అనేది దీర్ఘచతురస్రాకారంలో ఉండే ఒక నిర్మాణం... దానికి నాలుగు మూలలు ఉంటాయి. శవం బరువు సమానంగా పంపిణీ జరిగి, నడిచేటప్పుడు దేహం వంగిపోకుండా లేదా కిందపడకుండా స్థిరంగా (Stable) ఉండటానికి నలుగురు మోయడం సాంకేతికంగా సరైన పద్ధతి.

సామాజిక కారణం

జీవితాంతం మనం "నలుగురితో మంచిగా బతకాలి", "నలుగురిలో గౌరవంగా ఉండాలి" అని అంటుంటాం. ఇక్కడ "నలుగురు" అంటే సమాజం. మనిషి చివరి ప్రయాణంలో ఆ సమాజమే (నలుగురు వ్యక్తులే) తోడుగా నిలిచి సాగనంపుతోందనడానికి ఇది ప్రతీక.

ఆద్యాత్మిక కారణాలు

ఆధ్యాత్మికంగా ఇది జీవితంలోని ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనే నాలుగు పురుషార్థాలను సూచిస్తుంది. మనిషి ఈ నాలుగింటినీ పూర్తి చేసుకుని చివరి గమ్యానికి చేరుకున్నాడని దీని భావం. అలాగే మానవ జీవితంలోని నాలుగు దశలైన బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం ముగిశాయనడానికి కూడా ఇది సంకేతం.

విశ్వంలోని నాలుగు దిక్కులను (తూర్పు, పడమర, ఉత్తరం, దక్షణం) గౌరవిస్తూ, ఈ భౌతిక శరీరం శూన్యంలోకి కలిసిపోతోందని సూచించడానికి కూడా పాడెను నలుగురు మోస్తారు. ఇలా అంత్యక్రియల్లో నలుగురే పాడె మోయడం వెనక ఆసక్తికర కారణాలున్నాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
River : కృష్ణా నది 64 కి.మీ దూరముండే అరేబియాలో కాకుండా.. 1400 కి.మీ దూరమున్న బంగాళాఖాతంలో ఎందుకు కలుస్తుంది?
Recommended image2
అత్యంత అందమైన ఊరు.. కానీ ఏడాదిలో 4 నెలలు చిమ్మచీకటే
Recommended image3
Unique Village : ఇళ్ల పైకప్పులే రోడ్లుగా మారిన వింత గ్రామం... ఎక్కడుందో తెలుసా?
Related Stories
Recommended image1
Facts : విమానాలకు తెలుపు రంగే ఎందుకు వేస్తారు?
Recommended image2
Wedding Facts : తాళిని మూడుముళ్లు వేసే ఎందుకు కడతారో తెలుసా? ఈ సాంప్రదాయం వెనక ఇంత అర్థం దాగుందా..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved