- Home
- Feature
- Motivation Story: తొందరపడి ఎవరినీ నిందించకండి, ఎందుకంటే... ఈ కథ చదివితే మీ ఆలోచనే మారుతుంది
Motivation Story: తొందరపడి ఎవరినీ నిందించకండి, ఎందుకంటే... ఈ కథ చదివితే మీ ఆలోచనే మారుతుంది
మనలో చాలా మంది త్వరగా ఓ నిర్ణయానికి వస్తుంటారు. కోపంలో ఇతరులను తప్పుగా అర్థం చేసుకుంటాం. అయితే కాసేపు ఓపిక పడితే అసలు విషయం తెలుస్తుంది. ఇలాంటి నీతిని చెప్పే ఓ ఆసక్తికరమైన కథ ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us

టిఫిన్ కోసం హోటల్‌కు వచ్చిన వృద్ధుడు
ఓ వృద్ధుడు టిఫిన్ చేయడానికి హోటల్‌కు వెళ్తాడు. టేబుల్ పై కూర్చున్న వృద్ధుడి వద్దకు వెయిటర్ వచ్చి ఏం కావాలని అడుగుతాడు. వెంటనే ఆ వృద్ధుడు పూరి ఎంత అని అడుగుతాడు.? దానికి వెయిటర్ బదులిస్తూ.. రూ. 50 అని సమాధానం చెప్తాడు.
మనసు మార్చుకుంటాడు
వెంటనే తన జేబులో ఎన్ని డబ్బులు ఉన్నాయో చూసుకున్న వృద్ధుడు.. ఇడ్లీ ధర ఎంత అని అడుగుతాడు. దానికి వెయిటర్ బదులిస్తూ రూ. 40 అని చెప్తాడు. దీంతో మనసు మార్చుకున్న వృద్ధుడు తనకు పూరీ వద్దని ఇడ్లీ కావాలని అడుగుతాడు.
వెయిటర్ కోపంతో ఊగిపోతాడు
వృద్ధుడు చెప్పిన మాటకు సదరు వెయిటర్ కోపంతో ఊగిపోతాడు. డబ్బులు ఉండవు కానీ పూరి కావాలి, దోశ కావాలి అని కోరికలు ఉంటాయి. ఏది కావాలో నేరుగా చెప్పకుండా ఇలా సతాయిస్తావు ఏంటి అంటూ విసుగ్గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
టిఫిన్ తిన్న తర్వాత
తన టేబుల్‌పైకి వచ్చిన ఇడ్లీని తినేసిన వృద్ధుడు. నెమ్మదిగా క్యాషియర్ వద్దకు వెళ్లి డబ్బులు చెల్లించి బయటకు వెళ్లిపోతాడు. అయితే అతను హోటల్ నుంచి వెళ్లి పోయే ముందు టేబుల్‌పై ఉన్న ప్లేట్‌లో కొంత మొత్తాన్ని ఉంచి వెళ్తాడు.
ఆశ్చర్యానికి గురైన వెయిటర్
టిఫిన్ చేసిన తర్వాత ఆ వృద్ధుడు టేబుల్‌పై రూ. 10 టిప్ ఉంచి వెళ్లిపోతాడు. అది చూసిన వెయిటర్ ఒక్కసారిగా ఎమోషన్ అవుతాడు. సదరు వృద్ధుడిని అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నానని బాధపడతాడు. నిజానికి ఆ వృద్ధుడి వద్ద పూరి తినడానికి సరిపోయేంత డబ్బున్నా వెయిటర్‌కి టిప్ ఇవ్వడానికే ఇడ్లీ తిన్నాడన్నమాట.
నీతి: ఈ చిన్న కథలో ఎంతో నీతి ఉంది. ఒక వ్యక్తిని ఎప్పుడు తొందరపడి తప్పుగా అర్థం చేసుకోవద్దనే గొప్ప సందేశం ఉంది.