- Home
- Entertainment
- Aarthi Agarwal: ఆర్తి అగర్వాల్ బంగారు తల్లి, ఆమె కెరీర్ నాశనం చేసింది అతడే.. ఓపెన్ గా చెప్పేసిన నిర్మాత
Aarthi Agarwal: ఆర్తి అగర్వాల్ బంగారు తల్లి, ఆమె కెరీర్ నాశనం చేసింది అతడే.. ఓపెన్ గా చెప్పేసిన నిర్మాత
నిర్మాత చంటి అడ్డాల ఆర్తి అగర్వాల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్తి అగర్వాల్ కెరీర్ నాశనం కావడం వెనుక ఒక వ్యక్తి ఉన్నారు అని .. ఆ వ్యక్తి గురించి చంటి అడ్డాల ఊహించని విషయాలు రివీల్ చేశారు.

ఆర్తి అగర్వాల్
ఆర్తి అగర్వాల్ టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. తిరుగులేని హీరోయిన్ గా చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, ప్రభాస్, ఎన్టీఆర్ ఇలా అగ్ర హీరోలతో సినిమాలు చేసింది. కానీ ఆ తర్వాత ఆర్తి అగర్వాల్ కెరీర్ లో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక కొన్ని వివాదాలు వినిపించాయి. సినిమాలకు దూరమై యూఎస్ లో సెటిల్ అయ్యాక ఆర్తి అగర్వాల్ ఆరోగ్య సమస్యలతో చిన్న వయసులోనే మరణించింది.
చిరంజీవి ఇంద్ర మూవీలో ఆర్తి అగర్వాల్ నటిస్తుంటే..
ప్రముఖ నిర్మాత చంటి అడ్డాల ఓ ఇంటర్వ్యూలో ఆర్తి అగర్వాల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్తి అగర్వాల్.. చంటి అడ్డాల నిర్మాణంలో తెరకెక్కిన అల్లరి రాముడు, అడవి రాముడు చిత్రాల్లో నటించింది. ఈ రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. చంటి అడ్డాల మాట్లాడుతూ.. చిరంజీవి గారి ఇంద్ర మూవీ అప్పుడే ప్రారంభం అయింది. అదే సమయంలో అల్లరి రాముడు సినిమా కూడా ప్రారంభించాం.
అందుకే ఆమెని తీసుకున్నాం
రెండింటికీ బి గోపాల్ గారే దర్శకుడు. ఇంద్ర సినిమాలో నటిస్తున్న ఆర్తి అగర్వాల్ బావుంది కదా.. ఈ సినిమాలో కూడాఆమెనే హీరోయిన్ పెడదాం అన్నారు. అంతకు ముందు మేము ఛార్మి అయితే బావుంటుంది అని అనుకున్నాం. కానీ డైరెక్టర్ చెప్పడంతో ఆర్తి అగర్వాల్ ని ఫిక్స్ చేశాం. ఆర్తి అగర్వాల్ కెరీర్ నాశనం కావడం గురించి చంటి అడ్డాల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆర్తి అగర్వాల్ కెరీర్ నాశనం చేసింది అతడే
ఆర్తి అగర్వాల్ చాలా మంచి అమ్మాయి. బంగారు తల్లి. కానీ రాంగ్ గైడెన్స్ వల్ల ఆమె ఇబ్బందులు పడింది. ఆమెకి రాంగ్ గైడెన్స్ ఇచ్చింది ఎవరో కాదు ఆమె తండ్రే అని చంటి అద్దాల షాకింగ్ కామెంట్స్ చేశారు. ఉదయం 9 గంటలకు షూటింగ్ ఉందంటే ఆర్తి అగర్వాల్ లొకేషన్ కి వచ్చేందుకు రెడీ అవుతుంది. కానీ ఆమె తండ్రి అడ్డుకునేవారు. నువ్వు స్టార్ హీరోయిన్.. నువ్వు కరెక్ట్ టైంకి షూటింగ్ కి వెళితే చులకన అయిపోతావ్.
జ్వరం ఉన్నా షూటింగ్ కి వచ్చేది
నీ స్టార్ స్టేటస్ నువ్వు మైంటైన్ చేయాలి. ఆలస్యంగా వెళ్ళు అని చెప్పేవారు. ప్రతి విషయంలో ఆయన ఆర్తి అగర్వాల్ ని తప్పుదోవ పట్టించారు. షూటింగ్ లొకేషన్ లో మాతో ఆయన సరిగ్గా ఉండేవారు కాదు. ఆమె తండ్రే ఆర్తి అగర్వాల్ కెరీర్ ని నాశనం చేశారు అంటూ చంటి అడ్డాల తెలిపారు. ఆర్తి అగర్వాల్ మాత్రం ఎంతో గౌరవంగా ఉండేది. ఆమెకి జ్వరం ఉన్నా సరే షూటింగ్ కి వచ్చేది. డూప్ తో మేనేజ్ చేస్తాం అని చెప్పినా సరే పర్వాలేదు సార్ నేను చేస్తాను కదా అని చెప్పేది అంటూ చంటి అడ్డాల గుర్తు చేసుకున్నారు.













