క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'ది డార్క్ హెవెన్' ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక గ్రామంలో జరిగే మిస్టరీ డెత్స్, వాటి వెనుక ఉన్న రహస్యాన్ని ఈ సినిమా కళ్లకు కడుతుంది.

ది డార్క్ హెవెన్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ తెలుగు ఓటీటీ స్ట్రీమింగ్:

క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చూడాలంటే ఒకప్పుడు హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలే దిక్కు. మన సౌత్ ఇండియా సినిమాల్లో థ్రిల్లర్, హారర్ మూవీస్ ఉన్నా.. హాలీవుడ్ రేంజ్‌లో అనిపించేవి కావు. కానీ ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమాలు హాలీవుడ్‌కు గట్టి పోటీ ఇచ్చేలా క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్‌తో దూసుకుపోతున్నాయి.

అవును, ఈ మధ్య ఓటీటీ(OTT)లో తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు క్రేజ్ బాగా పెరిగింది. ఆడియన్స్ టేస్ట్ కూడా మారింది. ఇప్పుడున్న యూత్ సస్పెన్స్, ట్విస్ట్, హారర్ సినిమాలను తెగ ఇష్టపడుతున్నారు. అలాంటి వారి కోసమే ఓటీటీలోకి సరికొత్త సినిమా వచ్చేసింది. మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్టులు, సస్పెన్స్‌తో ఈ సినిమా అంచనాలు పెంచేస్తోంది.

ది డార్క్ హెవెన్ (The Dark Heaven)

ఒక ఊళ్లో జరిగే విచిత్ర మరణాల చుట్టూ తిరిగే ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా సెప్టెంబర్ 18నే థియేటర్లలో రిలీజ్ అయింది. అప్పట్లో ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే సినిమా మూడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆహా, సింప్లీ సౌత్ యాప్స్‌లో చూడొచ్చు. ఇప్పుడు ఈ మూవీ తెలుగు వెర్షన్ కూడా ఓటీటీకి వచ్చేసింది. పాపులర్ ఓటీటీ లయన్స్ గేట్ ప్లేలో బుధవారం నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ సినిమాలో డైరెక్టర్ సిద్ధు సిధ్, రిత్విక, వేలారామమూర్తి, నీలగల్ రవి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. బాలాజీ ఈ కథ రాసి డైరెక్ట్ చేశారు. శక్తి బాలాజీ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రాణం పోసింది. భూపతి కలైవాణన్ ఈ చిత్రాన్ని కొథై ఎంటర్‌టైన్‌మెంట్, ఎమ్ఎస్ స్విస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లపై నిర్మించారు.

ది డార్క్ హెవెన్ కథ ఏంటి?

1970ల కాలంలో ఒక ఫ్రెంచ్ రీసెర్చర్ రాసిన రహస్య పుస్తకం ఆధారంగా 'ది డార్క్ హెవెన్' కథ సాగుతుంది. 'మెక్కరై' అనే మారుమూల కొండ ప్రాంతంలోని ఊళ్లో ఒక పాత శాపం వల్ల ఈ స్టోరీ నడుస్తుంది. దశాబ్దాలుగా ఈ గ్రామంలో ఒక మూఢనమ్మకం ఉంది. అదేంటంటే.. ఈ ఊళ్లో ప్రతి ఏడేళ్లకోసారి జూన్ నెలలో మాత్రమే మగవాళ్లు అనుమానాస్పదంగా చనిపోతుంటారు. ఇది గ్రామస్తులను భయపెడుతుంది. తమ ఊరి మీద ఏదో శాపం ఉందని వాళ్లు నమ్ముతారు. ఆ శాపం వల్లే ఈ విచిత్ర మరణాలు జరుగుతున్నాయని కంగారు పడుతుంటారు.

ఇలాంటి టైమ్‌లో కొత్త ఎస్ఐగా ఇళంపగ్రి (సిద్ధు) ఆ ఊరికి వస్తాడు. ఊళ్లో ఏం జరుగుతోంది, మగవాళ్లు ఎందుకు చనిపోతున్నారు, ఈ మిస్టరీ డెత్స్ వెనుక ఏం జరుగుతుందో కనిపెట్టడానికి ఇళంపగ్రి, అతని టీమ్ ఊరికి వస్తారు. అసలు ఊళ్లో మరణాలకు నిజమైన కారణాలు ఏంటి? వాళ్లు ఏదైనా దుష్టశక్తి వల్ల చనిపోతున్నారా? ఎవరైనా కావాలనే చంపుతున్నారా? ఇన్వెస్టిగేషన్ టైమ్‌లో వెలుగులోకి వచ్చే షాకింగ్ నిజాలు బయటపడతాయి. సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవాళ్లు ఈ సినిమాను కచ్చితంగా చూడొచ్చు.