MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • DMart: సూపర్ మార్కెట్లో క్యారీ బ్యాగ్ కు డబ్బులు కడుతున్నారా? అయితే ఈ రూల్స్ తెలుసుకోండి

DMart: సూపర్ మార్కెట్లో క్యారీ బ్యాగ్ కు డబ్బులు కడుతున్నారా? అయితే ఈ రూల్స్ తెలుసుకోండి

DMart: నెలవారీ సరుకుల కోసం సూపర్ మార్కెట్లకు వెళ్లినప్పుడు బిల్లు కంటే క్యారీ బ్యాగ్ ఛార్జీ చూసి చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. అసలు షాపులు క్యారీ బ్యాగ్ కు డబ్బులు వసూలు చేయవచ్చా? ఈ ఛార్జీ వెనుక ఉన్న రూల్స్ ఏంటో తెలుసుకుందాం.

2 Min read
Author : Nandini Arava
Published : Oct 04 2026, 10:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
డీమార్ట్‌లో క్యారీ బ్యాగ్‌కు డబ్బులు కట్టాలా?
Image Credit : gemini ai

డీమార్ట్‌లో క్యారీ బ్యాగ్‌కు డబ్బులు కట్టాలా?

నెలవారీ సరుకుల కోసం సూపర్ మార్కెట్లకు వెళ్లినప్పుడు బిల్లు కంటే క్యారీ బ్యాగ్ ఛార్జీ చూసి చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. అసలు షాపులు క్యారీ బ్యాగ్ కు డబ్బులు వసూలు చేయవచ్చా?షాపింగ్ చేశాక సరుకులు తీసుకెళ్లేందుకు క్యారీ బ్యాగ్ అడిగితే, దానికి రూ.10, రూ.20 లేదా అంతకంటే ఎక్కువ వసూలు చేస్తుంటారు. దీనిపై వినియోగదారుల ఫోరమ్‌లలో గత కొన్నేళ్లుగా చాలా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా స్టోర్ పేరు లేదా లోగో ఉన్న బ్యాగ్‌కు డబ్బులు వసూలు చేయడంపై కొన్ని ఫోరమ్‌లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే "బ్యాగ్‌కు డబ్బులు అడగడం ఎప్పుడూ చట్టవిరుద్ధమే అని గుడ్డిగా నమ్మే బదులు, అసలు చట్టం ఏం చెబుతుందో తెలుసుకోవడం ముఖ్యం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
డీమార్ట్ క్యారీ బ్యాగ్
Image Credit : Gemini AI

డీమార్ట్ క్యారీ బ్యాగ్

దీనికి హైదరాబాద్‌లో జరిగిన ఆకాష్ కుమార్ కేసే పెద్ద ఉదాహరణ. 2019 మే 11న ఆయన డిమార్ట్‌లో రూ.602.70 విలువైన సరుకులు కొన్నారు. అప్పుడు స్టోర్ లోగో ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌కు రూ.3.50 అదనంగా వసూలు చేశారు. దీన్ని సవాల్ చేస్తూ ఆయన వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్, ఆ డబ్బును వాపసు చేయడంతో పాటు వినియోగదారుడికి పరిహారం చెల్లించాలని 2021 డిసెంబర్‌లో డిమార్ట్‌ను ఆదేశించింది. క్యారీ బ్యాగ్‌లకు డబ్బులు వసూలు చేయడం ఆపేసి, ఉచితంగా ఇవ్వాలని కూడా తీర్పు చెప్పింది.

35
వినియోగదారుల ఫోరమ్
Image Credit : Gemini AI

వినియోగదారుల ఫోరమ్

2023లో వచ్చిన మరో డిమార్ట్ కేసులో కూడా వినియోగదారుల ఫోరమ్ కస్టమర్‌కు అనుకూలంగానే తీర్పు ఇచ్చింది. స్టోర్ లోగో ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌కు వసూలు చేసిన రూ.3.50 తిరిగి ఇవ్వాలని, పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఇతర సంస్థల క్యారీ బ్యాగ్ ఛార్జీలను కూడా ఫోరమ్‌లు పరిశీలించాయి. 2026 ఏప్రిల్‌లో వచ్చిన రిలయన్స్ ట్రెండ్స్ కేసు తీర్పులో, సరుకులను కస్టమర్‌కు సురక్షితంగా అందించడం విక్రేత బాధ్యత అని ఫోరమ్ స్పష్టం చేసింది. ప్యాకింగ్ లేదా క్యారీ బ్యాగ్ ఖర్చును కస్టమర్ల మీద రుద్దడం వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం తప్పని పేర్కొంది.

45
చట్టపరమైన వివరణ
Image Credit : Asianet News

చట్టపరమైన వివరణ

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఏ దుకాణంలోనూ క్యారీ బ్యాగ్‌కు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని గతంలో చెప్పినప్పటికీ, చట్టపరమైన పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదు. బ్యాగ్ రకం, దానిపై స్టోర్ లోగో ఉందా లేదా, ఛార్జీల గురించి ముందే చెప్పారా అనే అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. క్యారీ బ్యాగ్ ఛార్జీలకు వ్యతిరేకంగా చాలా కోర్టులు తీర్పులు ఇచ్చాయని, అయితే దీనిపై చట్టపరమైన చర్చలు ఇంకా ఉన్నాయని 2023లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక కథనంలో వివరించింది. కాబట్టి డిమార్ట్‌లో బ్యాగ్‌కు డబ్బులు కడితే, ఆ బిల్లును భద్రంగా ఉంచుకోవడం ముఖ్యం.

55
క్యారీ బ్యాగ్ ఛార్జీలు
Image Credit : anandmunshi.com

క్యారీ బ్యాగ్ ఛార్జీలు

మీరు తర్వాతిసారి డీమార్ట్‌కు వెళ్లినప్పుడు, క్యారీ బ్యాగ్ ఛార్జీల గురించి అనుమానం ఉంటే ముందుగా బిల్లులో ఆ మొత్తం విడిగా ఉందో లేదో చెక్ చేయండి. స్టోర్ పేరు లేదా లోగో ఉన్న బ్యాగ్‌కు డబ్బులు వసూలు చేస్తే, బిల్లుతో పాటు బ్యాగ్ ఫోటోను ఆధారంగా ఉంచుకోండి. సమస్య వస్తే జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ లేదా సంబంధిత వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించవచ్చు. అలాగని పాత తీర్పులను చూసి డిమార్ట్‌లో క్యారీ బ్యాగ్‌కు ఇకపై ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన పనిలేదని ఫిక్స్ అవ్వకండి. ఫోరమ్ తీర్పులు కస్టమర్లకు అండగా నిలిచినా, ప్రతి కేసును విడిగా పరిశీలించాల్సి ఉంటుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
రాత్రి 10 తర్వాత టాయిలెట్ ఫ్లష్ చేస్తే నేరం.. ఈ నిబంధన ఎక్కడుంది? ఇందులో నిజ‌మెంత‌
Recommended image2
Snakes: విషపూరిత‌మా, విషం లేనిదా.? పామును చూసి ఎలా తెలుసుకోవ‌చ్చో తెలుసా
Recommended image3
Jalebi : ఏమిటీ.. జిలేబి ఇండియన్ స్వీట్ కాదా? ఏ దేశానిదో తెలుసా?
Related Stories
Recommended image1
Protein Idli: ఈజీగా వెయిట్ లాస్‌ అవ్వాలంటే ఈ ప్రోటీన్ ఇడ్లీ ట్రై చేయండి..
Recommended image2
DMart: ఈ దసరాకు డీమార్ట్ లో షాపింగ్ చేయండి.. రూ.1500 వరకూ ఆదా చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved