MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Rent a Country: మీ దగ్గర రూ.58లక్షలు ఉంటే, ఏకంగా దేశాన్ని అద్దెకు తీసుకోవచ్చు,ప్రపంచంలోనే వింత దేశం ఇది

Rent a Country: మీ దగ్గర రూ.58లక్షలు ఉంటే, ఏకంగా దేశాన్ని అద్దెకు తీసుకోవచ్చు,ప్రపంచంలోనే వింత దేశం ఇది

Rent a Country: ప్రపంచంలో మనకు అద్దెకు చాలా వస్తువులు దొరుకుతాయి అని తెలుసు. కానీ, ఏకంగా ఒక దేశాన్ని అద్దెకు తీసుకోవచ్చని మీకు తెలుసా? అలాంటి వింత దేశం ఏదో తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 27 2026, 10:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఏకంగా దేశాన్ని అద్దెకు తీసుకోవచ్చా?
Image Credit : chat gpt

ఏకంగా దేశాన్ని అద్దెకు తీసుకోవచ్చా?

మనం ఇంటిని, కారు మాత్రమే కాదు.. చాలా రకాల వస్తువులను అద్దెకు తీసుకోవచ్చు. కానీ, ఒక పూర్తి దేశాన్నే అద్దెకు తీసుకోవడం గురించి ఎప్పుడైనా విన్నారా? వినడానికి నమ్మసక్యంగా లేకపోయినా... ఇది పూర్తిగా నిజం. మీరు వారికి డబ్బులు చెల్లిస్తే... ఆ దేశపు తాళం చెవితో పాటు, ప్రైవేట్ కరెన్సీ, స్థానిక పోలీసుల సేవలు, రాజభవనాల్లో రాచరిక ఆతిథ్యం పొందే అవకాశం కూడా ఉంటుంది. మరి, ఆ దేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఈ వింత దేశం ఎక్కడ ఉంది?
Image Credit : chat gpt

ఈ వింత దేశం ఎక్కడ ఉంది?

సహజంగా, ఇలాంటి రూల్స్ ప్రపంచంలో ఏ దేశం ప్రకటించదు. కానీ, ఇలాంటి వినూత్న కాన్సెప్ట్ తో ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించిన దేశం పేరు లైచెన్ స్టెయిన్. ఇది ఐరోపా ఖండంలోని ఆల్ప్స్ పర్వత శ్రేణుల మధ్య, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా దేశాల సరిహద్దుల్లో దాగి ఉన్న ఒక చిన్న నిధి లాంటిది దేశం. అంతేకాదు, ప్రపంచంలోనే అతి చిన్న దేశాల్లోనూ ఇది కూడా ఒకటి. దీని వైశాల్యం కేవలం 160 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అంటే.. మన దేశంలోని ఓ చిన్న నగరం పరిమాణంలో మాత్రమే ఇది ఉంటుంది.

ఈ దేశం అద్దెకు కావాలంటే.. ఎంత డబ్బులు కట్టాలి..? 

2011లో ప్రసిద్ధ ఈవెంట్ రెంటల్ ప్లాట్‌ఫామ్ 'Airbnb', స్థానిక టూరిజం బోర్డు కలిసి "రెంట్ ఎ కంట్రీ" అనే క్రేజీ ఆఫర్‌ను ప్రపంచం ముందుకు తెచ్చాయి. ఒక రాత్రికి 70,000 అమెరికన్ డాలర్లు (సుమారు ₹58 లక్షలు) చెల్లించి ఈ దేశాన్ని అద్దెకు తీసుకోవచ్చు.

33
ఈ దేశాన్ని అద్దెకు తీసుకుంటే.. కలిగే ప్రయోజనాలు..
Image Credit : chat gpt

ఈ దేశాన్ని అద్దెకు తీసుకుంటే.. కలిగే ప్రయోజనాలు..

ఈ దేశ రాజధాని అయిన 'వాడుజ్' (Vaduz) నగరానికి సంబంధించి ఒక ప్రతీకాత్మక తాళంచెవిని అద్దెదారునికి బహుకరిస్తారు. మీ పేరుతో లేదా మీ ఈవెంట్ కోసం ఒక తాత్కాలిక ప్రైవేట్ నాణేన్ని/కరెన్సీని ముద్రిస్తారు. దాదాపు 150 మంది అతిథులకు విలాసవంతమైన వసతి, ప్రసిద్ధ కోటలు, వైన్ తయారీ కేంద్రాలలో విందులు ఏర్పాటు చేస్తారు. ఆ సమయానికి దేశంలో ఉండే స్థానిక పోలీస్ వ్యవస్థ కూడా అద్దె తీసుకున్న వ్యక్తి చేతిలోనే ఉంటుంది.

ఈ దేశం ఎందుకు అంత స్పెషల్..?

లైచ్టెన్‌స్టెయిన్ కేవలం అద్దె ఆఫర్ వల్లే కాదు, తన ఆర్థిక, భౌగోళిక పరిస్థితుల వల్ల కూడా ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన దేశంగా నిలిచింది. ప్రపంచంలోనే అత్యధిక తలసరి రాబడి కలిగిన అత్యంత సంపన్న దేశాల్లో ఇది ఒకటి. ఇక్కడ నిరుద్యోగం అనేది అసలే ఉండదు. అంతేకాదు, ఈ దేశానికి మిలిటరీ లేదా సొంత సైన్యం లేదు. 1868లోనే ఖర్చులను తగ్గించుకోవడానికి తమ సైన్యాన్ని రద్దు చేశారు. మంచు కొండలు, శతాబ్దాల నాటి ప్రాచీన కోటలు, ప్రశాంతమైన వీధులతో ఇది పర్యాటకులకు స్వర్గధామంలా కనిపిస్తుంది. ఈ దేశం చూడటానికి చాలా అందంగా ఉంటుంది.

ఈ దేశాన్ని ఎవరు పాలిస్తారు..?

ఈ దేశంలో ప్రజాస్వామ్యంతో పాటు ఇప్పటికీ రాచరిక వ్యవస్థ అమల్లో ఉంది . ప్రస్తుతం ప్రిన్స్ హన్స్-ఆడమ్ II (Prince Hans-Adam II) ఈ దేశానికి అధిపతిగా ఉన్నారు. ఆయన కుమారుడు ప్రిన్స్ అలోయిస్ (Prince Alois) రోజువారీ పాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. ఐరోపా ఖండంలోనే మిగతా ఏ రాచకుటుంబానికి లేని విధంగా, లైచ్టెన్‌స్టెయిన్ రాజుకే అత్యధిక రాజకీయ అధికారాలు ఉంటాయి. ఇక్కడ ప్రజలు ఎన్నుకునే పార్లమెంట్, ప్రధాని ఉన్నప్పటికీ, రాజు నిర్ణయమే తుది నిర్ణయం కావడం విశేషం.

ఒక్క రోజుకి దేశాన్ని ఎవరైనా అద్దెకు తీసుకుంటారా? అంటే.. సరదా కోసం కోట్లు ఖర్చు చేసే చాలా మంది కోటీశ్వరులు.. ఈ వినూత్న అనుభూతి కోసం అద్దెకు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
World's Shortest River : కేవలం 20 మీటర్లు ప్రవహించే నది.. ఈ భూమిపై అతి చిన్నదిదే, ఎక్కడుందో తెలుసా?
Recommended image2
Cyclone Arnab : గంటకు 140 కి.మీ వేగంతో గాలులు వీస్తే ఏం జరుగుతుంది? మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు?
Recommended image3
Telangana Village: తెలంగాణాలోని ఆ గ్రామంలో భూమి నుంచి సలసల కాగే నీరు.. వాటితోనే పంటలు పండిస్తున్న రైతులు
Related Stories
Recommended image1
Makhana Capital: మన దేశంలో మఖానా రాజధాని ఏది? ప్రపంచం మొత్తానికి ఇక్కడి నుంచే సరఫరా..!
Recommended image2
Jaggery Capital: మన దేశపు బెల్లం రాజధాని ఏదో తెలుసా? ప్రపంచంలోనే అతిపెద్ద బెల్లం మార్కెట్ ఇది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved