MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • మార్బుల్, గ్రానైట్, టైల్స్.. కొత్త ఇంటి ప్లోరింగ్ కు ఏది బెస్ట్? నిర్మాణరంగ నిపుణుల సలహాలు ఇవే!

మార్బుల్, గ్రానైట్, టైల్స్.. కొత్త ఇంటి ప్లోరింగ్ కు ఏది బెస్ట్? నిర్మాణరంగ నిపుణుల సలహాలు ఇవే!

సొంత ఇల్లు అనేది చాలామంది లైఫ్ టైమ్ కల.. అందుకే చాలా జాగ్రత్తగా నిర్మించుకుంటారు. అయితే చాలామంది ఫ్లోరింగ్ సమయంలో కన్ప్యూజ్ అవుతుంటారు… టైల్స్, మార్బుల్, గ్రానైట్ లలో ఏది వాడాలని. ధర, మరి మన్నిక, డిజైన్, మెయింటెనెన్స్ ఆధారంగా ఏది బెస్ట్?

2 Min read
Author : Arun Kumar P
Published : Oct 06 2026, 03:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టైల్స్, మార్బుల్స్, గ్రానైట్... మీ ఇంటికి ఏది బెటర్?
Image Credit : Gemini AI

టైల్స్, మార్బుల్స్, గ్రానైట్... మీ ఇంటికి ఏది బెటర్?

సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. జీవితకాలంలో ఒక్కసారే చేసే పెద్ద పెట్టుబడి ఇది… అందుకే ఇంటి నిర్మాణంలో ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటారు. పునాది నుండి పెయింటింగ్ వరకు అన్ని దగ్గరుండి చూసుకుంటారు. అయితే ఫ్లోరింగ్ విషయానికి వచ్చేసరికి టైల్స్, మార్బుల్, గ్రానైట్.. వీటిలో ఏది ఎంచుకోవాలో చాలామందికి అర్థం కాదు. మార్కెట్లో ఎన్నో రకాల ఆప్షన్లు ఉండటంతో ఏది బెస్ట్ అని తేల్చుకోవడం కష్టంగా మారుతుంది. ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి మీ బడ్జెట్, అవసరాలకు తగ్గట్టుగా సరైన ఫ్లోరింగ్‌ను ఎలా ఎంచుకోవాలో నిపుణులు చెబుతున్న ఈ విషయాలు తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
1.టైల్స్
Image Credit : Gemini

1.టైల్స్

గత కొన్నేళ్లుగా మార్కెట్లో టైల్స్ వెరైటీలు అమాంతం పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు గ్లాసీ, మ్యాట్, 3D ప్రింటెడ్, వుడెన్ ఫినిష్, స్టోన్ ఫినిష్ లాంటి ఎన్నో డిజైన్లలో టైల్స్ దొరుకుతున్నాయి. వీటిలో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. ఇంటి అవసరాన్ని బట్టి ఒక్కో గదికి ఒక్కో డిజైన్ ఎంచుకోవచ్చు. ఉదాహరణకు… హాల్‌లో గ్లాసీ టైల్స్ వేస్తే ఇల్లు చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది. అదే బెడ్‌రూమ్‌లో అయితే వుడెన్ లేదా మ్యాట్ ఫినిష్ టైల్స్ వేసుకుంటే చాలా క్లాస్‌గా ఉంటుంది.

మంచి క్వాలిటీ ఉన్న టైల్స్ ధర సాధారణంగా చదరపు అడుగుకు రూ.50 నుంచి రూ.70 వరకు ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. అయితే డిజైన్, సైజు, బ్రాండ్‌ను బట్టి ఈ ధరలు ఇంకా పెరగొచ్చు. మార్బుల్‌తో పోలిస్తే టైల్స్ వేయడం చాలా సులువు. దీనికి లేబర్ ఖర్చు కూడా తక్కువే అవుతుంది. అయితే టైల్స్ ధరలు ఒక్కో నగరంలో ఒక్కోలా ఉంటాయి. కాబట్టి కచ్చితమైన ధరల కోసం మీ దగ్గర్లోని మార్కెట్లో ఎంక్వైరీ చేయడం మంచిది.

ఇప్పుడు మార్కెట్లో పెద్ద సైజులో ఉండే 'నానో', స్లాబ్-స్టైల్ టైల్స్ కూడా దొరుకుతున్నాయి. ఇవి పెద్దగా ఉండటం వల్ల ఫ్లోరింగ్ మీద జాయింట్లు ఎక్కువగా కనిపించవు. దీంతో ఇల్లు చాలా నీట్‌గా, రిచ్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా పెద్ద హాళ్లు, ఓపెన్ స్పేస్‌లలో ఈ టైల్స్ వేస్తే లుక్ అదిరిపోతుంది. అయితే ఈ పెద్ద సైజు టైల్స్ వేయడానికి కచ్చితంగా అనుభవం ఉన్న పనివాళ్లు మాత్రమే కావాలి.

35
2. గ్రానైట్
Image Credit : Gemini

2. గ్రానైట్

మరోవైపు ఇప్పటికీ చాలామంది గ్రానైట్ వాడటానికే ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా మెట్లు, కిచెన్ ప్లాట్‌ఫామ్స్ లాంటి చోట్ల, అలాగే ఎక్కువ కాలం మన్నిక అవసరమైన ప్రదేశాల్లో గ్రానైట్‌ను ఎక్కువగా వాడుతున్నారు. కానీ టైల్స్ లాగా ఇల్లంతా గ్రానైట్ వేయడం మాత్రం ఈ రోజుల్లో బాగా తగ్గిపోయింది.

45
2. మార్బుల్స్
Image Credit : Gemini

2. మార్బుల్స్

గతంతో పోలిస్తే ఇప్పుడు మార్బుల్ వాడకం కూడా బాగా తగ్గిపోయింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మార్బుల్ అనేది సహజమైన రాయి కాబట్టి అది చాలా బరువుగా ఉంటుంది. పైగా దానికి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. అంతేకాకుండా మార్బుల్ కటింగ్, ఫిట్టింగ్, పాలిషింగ్ పనులకు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది.

55
మొత్తంగా ఏది బెస్ట్?
Image Credit : Gemini

మొత్తంగా ఏది బెస్ట్?

తక్కువ బడ్జెట్‌లో అందమైన లుక్, రకరకాల డిజైన్లు, ఈజీ మెయింటెనెన్స్ కావాలనుకుంటే మాత్రం మార్కెట్లో దొరికే టైల్స్ బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు సూచిస్తున్నారు. అయితే టైల్స్ కొనేటప్పుడు కేవలం డిజైన్ మాత్రమే చూడకూడదు. వాటి మన్నిక, యాంటీ-స్లిప్ ఫీచర్, నీటిని పీల్చుకునే గుణం, అలాగే ఏ గదిలో వేస్తున్నాం అనే విషయాలను కూడా కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి.

కాబట్టి ఇంటి ఫ్లోరింగ్ కోసం కేవలం అందం మాత్రమే కాకుండా.. వాడే ప్రదేశం, మెయింటెనెన్స్, మన్నిక, మీ బడ్జెట్.. ఇవన్నీ లెక్కలోకి తీసుకుని టైల్స్, గ్రానైట్ లేదా మార్బుల్.. వీటిలో మీకు ఏది సెట్ అవుతుందో అదే ఎంచుకోవడం ఉత్తమం.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
చిట్కాలు మరియు ఉపాయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India's Paris: మన దేశంలో ఏ నగరాన్ని ‘పారిస్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారో తెలుసా?
Recommended image2
Crow Behavior: కాకులు కూడా పగబడతాయా? మనుషుల ముఖాలను గుర్తుపెట్టుకుంటాయా?
Recommended image3
Car Tyres: కారు ఏ రంగులో ఉన్న వాటి టైర్లు మాత్రం నల్లగానే ఎందుకుంటాయి?
Related Stories
Recommended image1
House Construction Tips : గోడలకు పగుళ్లు రాకూడదా? అయితే ఇళ్లు కట్టేటప్పుడే ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకోండి
Recommended image2
House Vs Land : ప్లాట్ కొనాలా? ఇల్లు కట్టాలా? ఎవరికి, ఏది బెస్ట్ ఆప్షనో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved