- Home
- Feature
- Beer Bath: మహిళలు, పురుషులు కలిసి బీరుతో స్నానం.. అసలేంటీ బీర్ బాత్ ట్రెండ్. ఎందుకిలా చేస్తున్నారు.?
Beer Bath: మహిళలు, పురుషులు కలిసి బీరుతో స్నానం.. అసలేంటీ బీర్ బాత్ ట్రెండ్. ఎందుకిలా చేస్తున్నారు.?
Beer Bath: ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో వెల్నెస్ ట్రీట్‌మెంట్స్‌ను ఫాలో అవుతుంటారు. వాటిలో కొన్ని వింతగా అనిపిస్తుంటాయి. అలాంటి ఒక వింత బీర్ బాత్ ట్రెండ్. ఇంతకీ ఏంటీ బీర్ బాత్? దీనివల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం.

బీర్ స్పా ఎక్కడ పుట్టిందంటే.?
స్నానానికి నీరు కాకుండా బీరు ఉపయోగించడమే బీర్ బాత్ ట్రెండ్. దీనిని కొందరు వినోదంగా భావిస్తే, మరికొందరు ఆరోగ్య ప్రయోజనాల కోసం అనుసరిస్తున్నారు. బీర్‌తో స్నానం చేసే సంప్రదాయం యూరప్‌లో శతాబ్దాల క్రితమే ప్రారంభమైంది. మధ్యయుగ కాలంలోనే ప్రజలు బీరులో ఉండే ఈస్ట్, హాప్స్ చర్మాన్ని శుభ్రపరచగలవు అని నమ్మేవారు. కాలక్రమంలో ఈ ఆచారం ఆధునిక రూపం దాల్చి, బీర్ స్పాలుగా మారింది. ఇప్పుడు చెక్ రిపబ్లిక్, ఆస్ట్రియా, జర్మనీ, పోలాండ్‌లలో ఇవి పర్యాటక ఆకర్షణలుగా నిలుస్తున్నాయి.
బీర్ బాత్‌లో ఏం చేస్తారు?
బీర్ స్పాలకు వచ్చే వారు పెద్ద చెక్క తొట్టెలలో నురుగు బీరు నింపి గంటల తరబడి విశ్రాంతి తీసుకుంటారు. కొన్ని చోట్ల మహిళలు, పురుషులు ఇద్దరూ కలిసి స్నానం చేస్తారు. టబ్‌లో కూర్చుని స్నానం చేయడమే కాకుండా, కొన్నిచోట్ల బీరు తాగే సౌకర్యం కూడా ఉంటుంది. ఈ అనుభవం శరీరానికి, మనసుకు ఒకేసారి రిఫ్రెష్ కలిగిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.
ఆరోగ్యానికి లభించే ప్రయోజనాలు
నిపుణుల ప్రకారం, బీరులో ఉండే ఈస్ట్, విటమిన్ బి చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మార్చుతాయి. వేడి బీర్ టబ్‌లో ముంచడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, శరీరంలో చెమట ద్వారా విషపదార్థాలు బయటకు వెళ్లడంలో సహాయపడుతుంది. అలాగే టబ్‌లో కూర్చోవడం వల్ల మనసుకు కూడా ప్రశాంతత లభిస్తుంది.
పర్యాటకుల కోసం ప్రత్యేక ఆకర్షణ
యూరోపియన్ దేశాల్లో బీర్ బాత్ అనేది ఇప్పుడు పర్యాటకులను ఆకట్టుకునే కొత్త అనుభవంగా మారింది. ప్రత్యేకంగా చెక్ రిపబ్లిక్‌లో బీర్ స్పాలు ఎక్కువగా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడికి వచ్చే వారు దీన్ని ఫన్ + హెల్త్ కాంబినేషన్ అనుభూతిగా భావిస్తున్నారు.
వైద్యుల అభిప్రాయం
బీర్ బాత్ నిజంగా అద్భుత ఫలితాలు ఇస్తుందని శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే, ఇది శరీరానికి, మనసుకు రిలాక్సేషన్ కలిగిస్తుందని వైద్యులు అంగీకరిస్తున్నారు. అదే సమయంలో, దీని వల్ల ఎటువంటి తీవ్రమైన దుష్ప్రభావాలు లేవు. అందుకే చాలా మంది దీన్ని ఒక వినోదాత్మక ఆరోగ్య పద్ధతిగా స్వీకరిస్తున్నారు. (Beer Bath)