MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Hyderabad Weekend Trip : ఏడు పాయలుగా చీలిన నది, నీటిమధ్యలో అద్భుత ఆలయం.. ఉదయం అలా వెళ్ళి సాయంత్రం ఇలా తిరిగిరావచ్చు

Hyderabad Weekend Trip : ఏడు పాయలుగా చీలిన నది, నీటిమధ్యలో అద్భుత ఆలయం.. ఉదయం అలా వెళ్ళి సాయంత్రం ఇలా తిరిగిరావచ్చు

Hyderabad Weekend Trip : హైదరాబాద్ నుండి కేవలం గంట రెండుగంటల దూరంలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్ ఉంది. నది పాయలుపాయలుగా చీలి ప్రవహిస్తే ఆ నీటిమధ్యలో ఆలయం ఉంటుంది. ఆ ప్రాంతమేది? హైదరాబాద్ నుండి ఎలా వెళ్లాలి? ఇక్కడ తెలుసుకుందాం. 

3 Min read
Arun Kumar P
Published : Sep 13 2025, 12:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
హైదరాబద్ సమీపంలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్
Image Credit : X/RAMESH121646175

హైదరాబద్ సమీపంలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్

Hyderabad Weekend Trip : ఓ నది పాయలు పాయలుగా చీలిపోయి ప్రవహిస్తుంటే... వాటి మధ్యలో ఓ ఆలయం... చుట్టూ కొండలు, పచ్చని చెట్లతో ప్రకృతి అందాలు... మూగజీవుల సందడి, పక్షుల కిలకిలరావాలు... చదువుతుంటేనే ఇంత అందమైన ప్రాంతం ఎక్కడుందో తెలుసుకోవాలని కుతూహలం పెరుగుతుందికదా?... ఇలాంటి ప్రాంతం మన తెలంగాణలోనే ఉంది... హైదరాబాద్ కు కేవలం గంట గంటన్నర జర్నీ దూరంలోనే ఉంటుంది. ఈ ప్రకృతి రమణీయ ప్రదేశం ఏడుపాయల... మెదక్ పట్టణానికి సమీపంలో ఉంటుంది.

27
ఏడుపాయల ప్రత్యేకత
Image Credit : X/Yash4Indiaa

ఏడుపాయల ప్రత్యేకత

ఉమ్మడి మెదక్ జిల్లాల్లో మంజీరా నది ఒడ్డున, పచ్చని అటవీప్రాంతంలో ఈ ఏడుపాయల ప్రాంతం ఉంటుంది. ఇక్కడికి వెళ్లే భక్తులు ఆధ్యాత్మిక అనుభూతినే కాదు నేచర్ ను ఎంజాయ్ చేయవచ్చు. ముఖ్యంగా మంజీరా నది పాయలుపాయలుగా చీలి ప్రవహిస్తుండటం... వాటి మధ్యలో ఓ కొండగుహలో అమ్మవారు వెలియడం అద్భుతం. వర్షాకాలంలో అయితే ఎటుచూసినా నీటి ప్రవాహమే కనిపిస్తుంది... ఒక్కోసారి ఆలయం కూడా నీటిలో మునిగిపోతుంది.

ఏడుపాయలకు దైవ దర్శనం కోసమే కాదు సరదాగా పార్టీ చేసుకునేందుకు చాలామంది కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి వెళుతుంటారు. ఈ నది చీలికల ఒడ్డున కోళ్లు, మేకలు కోసుకుని మందుపార్టీలతో విందు చేసుకుంటారు. అమ్మవారికి వేటలను బలిఇచ్చే దేవాలయాల్లో ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ఒకటి. అందుకే ఆదివారం వచ్చిందంటే చాలు చుట్టుపక్కలనుండే కాదు సుదూర ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తారు... అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మందు, విందు కానిస్తారు.

Related Articles

Related image1
Travel: సెప్టెంబర్ లో కచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు, దసరా సెలవలకు బెస్ట్ ఆప్షన్
Related image2
Travel Safety Tips: ఈ 10 టిప్స్ పాటిస్తే మీ ప్రయాణం హ్యపీగా, సేఫ్ గా సాగిపోతుంది!
37
మహాశివరాత్రికి ప్రత్యేక ఉత్సవాలు :
Image Credit : X/TheNaveena

మహాశివరాత్రికి ప్రత్యేక ఉత్సవాలు :

మహాశివరాత్రి వేళ ఈ ఏడుపాయల పరిసరాలు భక్తులతో కిటకిటలాడతాయి... మంజీరా నదీ పాయల్లో స్నానంచేసి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తారు. ఈ పండగ సమయంలో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరిస్తారు.. ఎడ్ల బండ్ల ఊరేగింపు వంటి ప్రత్యేక వేడుకలు కూడా జరుగుతాయి.

కొండగుహలో వెలిసిన వనదుర్గామాత కోరిన కోర్కెలు తీరుస్తుందని నమ్ముతారు... అందుకే తమ కోర్కెలు తీర్చాలని కొందరు... కోర్కెలు తీరడంతో మరికొందరు మేకలు, కోళ్లను బలిస్తారు. ఇలా నిత్యం వేలాది జీవాలను వనదుర్గామాతకు బలిచ్చి అక్కడే పచ్చని చెట్లు, కొండలమద్య విందు జరుపుకుంటారు.

47
ఏడుపాయల స్థల పురాణం
Image Credit : X/Nishi_Reddy_

ఏడుపాయల స్థల పురాణం

ఏడుపాయల వనదుర్గామాత ఆలయం చాలా ప్రాచీనమైనది... వందల ఏళ్ల చరిత్ర కలిగివుంది. ఈ ఆలయ స్థలపురాణం ప్రకారం… ద్వాపరయుగంలో పరీక్షిత్ మహారాజు పాముకాటుతో చనిపోవడంతో అతడి కొడుకు జనమేజయుడు సర్పజాతిని అంతం చేయడానికి పూనుకుంటాడు. ఇందుకోసం ఏడుగురు మునులతో సర్పయాగం నిర్వహించి సర్పాలన్ని ఆ అగ్నిలో ఆహుతి అయ్యేలా చేస్తాడు. అయితే ఈ సర్పాలకు మోక్షం కల్పించేందుకు గరుడ్మంతుడు భోగవతి నదిని తీసుకునివస్తాడు... ఇది యజ్ఞస్థలికి రాగానే ఏడుపాయలుగా చీలుతుంది. సర్పయాగం జరిగిన గుండాలను ఈ పాయలు ముంచుతూ ముందుకు ప్రవహిస్తాయి.. ఇందులో ఓ పాయ కొండగుహలో వెలిసిన అమ్మవారి పాదాలు తాకుకుంటూ వెళుతుంది. ఇలా ఏడుగురు రుషులు యజ్ఞం చేసిన ప్రాంతం.... నది ఏడుపాయలుగా చీలిన ప్రాంతం కాబట్టి దీనికి ఏడుపాయలు అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది.

57
ఏడుపాయలకు ఎలా చేరుకోవాలి?
Image Credit : X/ShivaMudhiraj08

ఏడుపాయలకు ఎలా చేరుకోవాలి?

హైదరాబాద్ నుండి సొంత వాహనాల్లో ఈ ఏడుపాయలకు ఈజీగా చేరుకోవచ్చు. NH7 హైవే మీదుగా ప్రయాణంచేస్తే రెండు గంటల్లో ఏడుపాయల చేరుకోవచ్చు. అలాగే హైదరాబాద్ నుండి ఆర్టిసి బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి... నేరుగా ఏడుపాయలకు లేదంటే మెదక్ కు చేరుకుని అక్కడినుండి వెళ్లవచ్చు. ఏడుపాయల చేరుకోడానికి మరికొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ నుండి ఉదయం వెళ్లి సాయంత్రం తిరిగివచ్చేంత దూరంలో ఈ ఆద్యాత్మిక, ప్రకృతి అందాలతో నిండిన ఏడుపాయల ప్రాంతం ఉంది. ఇక్కడికి సొంత వాహనాల్లో వెళితే మరికొన్ని ప్రాంతాలను కూడా సందర్శించవచ్చు.

67
ఏడుపాయలకు వెళ్లినవారు వీటిని కూడా సందర్శించవచ్చు
Image Credit : x/GUMMALLALAKSHM3

ఏడుపాయలకు వెళ్లినవారు వీటిని కూడా సందర్శించవచ్చు

1. మెదక్ క్యాథడ్రల్ చర్చ్

2. మెదక్ కోట

3. పోచారం వన్యప్రాణి అభయారణ్యం

4. పోచారం రిజర్వాయర్

5. కుచాద్రి వెంకటేశ్వరస్వామి దేవాలయం (కుంచనపల్లి గ్రామం)

6. శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయం

77
భారీ వర్షాలతో మూతపడ్డ ప్రధాన ఆలయం
Image Credit : x/jsuryareddy

భారీ వర్షాలతో మూతపడ్డ ప్రధాన ఆలయం

ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండటంతో మంజీర నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఏడుపాయల ఆలయం సమీపంలోని వనదుర్గ ఆనకట్ట నుండి వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతుండటంతో ఏడుపాయల ఆలయం నీట మునిగింది. ఇలా దాదాపు నెల రోజులుగా అమ్మవారి ఆలయం నీటిలోనే ఉంది. దీంతో రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పెట్టి పూజలు నిర్వహిస్తున్నారు. నీటి ప్రవాహం తగ్గినతర్వాతే ప్రధాన ఆలయంలో పూజలు కొనసాగుతాయి.. అప్పటివరకు భక్తులకు ఆలయంవైపు వెళ్లకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రయాణం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
హైదరాబాద్
సంస్కృతి (Samskruti)
పండుగలు
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved