MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • ఏసీని మ‌నుషుల కోసం త‌యారు చేయ‌లేద‌ని తెలుసా? చ‌ల్ల గాలి వెనుక ఇంత సైన్స్ ఉందా.?

ఏసీని మ‌నుషుల కోసం త‌యారు చేయ‌లేద‌ని తెలుసా? చ‌ల్ల గాలి వెనుక ఇంత సైన్స్ ఉందా.?

Air Conditioner: ప్ర‌స్తుతం మ‌ధ్య‌త‌ర‌గతి వారు కూడా ఏసీల‌ను ఉప‌యోగిస్తున్నారు. అయితే ఏసీ త‌యారీ వెన‌కాల ఎన్నో ఏళ్ల చ‌రిత్ర ఉంద‌ని మీకు తెలుసా.? ఏసీని ఎందుకు క‌నిపెట్టారు.? ఇది ఎలా ప‌నిచేస్తుందో తెలుసుకుందాం.

3 Min read
Author : Narender Vaitla
Published : Aug 23 2026, 02:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏసీని మొదట ఎక్కడ, ఎందుకు కనిపెట్టారు.?
Image Credit : Gemini AI

ఏసీని మొదట ఎక్కడ, ఎందుకు కనిపెట్టారు.?

ఈరోజు మన ఇళ్లలో కనిపించే ఏసీకి మూలం 1902లో అమెరికాలో ఉంది. అమెరికాకు చెందిన ఇంజినీర్ విల్లిస్ క్యారియర్ ఆధునిక ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థకు పునాది వేశారు. అయితే ఆయన మొదట ఇంటిని చల్లబరచడానికి ఏసీని తయారు చేయలేదు. 1902లో న్యూయార్క్‌లోని ఒక ప్రింటింగ్ సంస్థలో ఉష్ణోగ్రత, తేమ కారణంగా ముద్రణ ప్రక్రియలో సమస్యలు ఎదురయ్యేవి. ముఖ్యంగా గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల కాగితం పరిమాణం మారడం, ఇంక్ సరిగ్గా పడకపోవడం వంటి సమస్యలు వచ్చేవి.

ఈ సమస్యను పరిష్కరించేందుకు క్యారియర్ ఒక వ్యవస్థను రూపొందించారు. ఈ యంత్రం గాలిలోని తేమను నియంత్రించడంతో పాటు ఉష్ణోగ్రతను తగ్గించేది. ఇదే ఆధునిక ఎయిర్ కండిషనింగ్‌కు ప్రారంభంగా భావిస్తారు. అంటే ఏసీని మొదట మనుషులు సౌకర్యంగా చల్లగా ఉండటానికి కాకుండా పారిశ్రామిక అవసరాల కోసం, ముఖ్యంగా ముద్రణ ప్రక్రియను సరిగ్గా నిర్వహించేందుకు అభివృద్ధి చేశారు. ఆ తర్వాత ఈ సాంకేతికత థియేటర్లు, కార్యాలయాలు, దుకాణాలు, ఆస్పత్రులు, ఇళ్లు ఇలా క్రమంగా విస్తరించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏసీ చల్లటి గాలిని ఎలా ఇస్తుంది.?
Image Credit : Getty

ఏసీ చల్లటి గాలిని ఎలా ఇస్తుంది.?

ఏసీ పనిచేసే విధానం బయటకు చూస్తే చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. కానీ దాని వెనుక ఉన్న శాస్త్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. ఏసీ చల్లదనాన్ని తయారు చేయదు. గదిలో ఉన్న వేడిని బయటకు పంపుతుంది. ఇదే ఏసీ పనిచేసే అసలు సూత్రం. మన గదిలోని వేడి గాలి ఏసీ ఇండోర్ యూనిట్‌లోకి వెళ్తుంది. అక్కడ ఉన్న ఎవాపరేటర్ కాయిల్ మీదుగా ఆ గాలి ప్రయాణిస్తుంది. ఆ కాయిల్‌లో తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉండే రిఫ్రిజరెంట్ ఉంటుంది. గదిలోని వేడి గాలి కాయిల్‌ను తాకినప్పుడు, ఆ గాలిలోని వేడిని రిఫ్రిజరెంట్ గ్రహిస్తుంది. దీంతో గాలి చల్లబడుతుంది. ఏసీలోని ఫ్యాన్ ఆ చల్లబడిన గాలిని తిరిగి గదిలోకి పంపుతుంది. ఇలా వేడి గాలి లోపలికి తీసుకోవడం, దానిలోని వేడిని తొలగించడం, చల్లబడిన గాలిని గదిలోకి పంపడం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అందుకే ఏసీ ఆన్ చేసిన కొద్దిసేపటి తర్వాత గది క్రమంగా చల్లబడుతుంది.

35
ఏసీలో రిఫ్రిజరెంట్ ఏం చేస్తుంది.? చల్లదనం ఎలా ఏర్పడుతుంది.?
Image Credit : Asianet News

ఏసీలో రిఫ్రిజరెంట్ ఏం చేస్తుంది.? చల్లదనం ఎలా ఏర్పడుతుంది.?

ఏసీలో అత్యంత ముఖ్యమైన భాగాల్లో రిఫ్రిజరెంట్ ఒకటి. ఇది ప్రత్యేకమైన ద్రవం లేదా వాయువు. ఇది వేడిని ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించడానికి ఉపయోగపడుతుంది. ఏసీలో ప్రధానంగా కంప్రెసర్, కండెన్సర్ కాయిల్, ఎక్స్‌పాన్షన్ వాల్వ్, ఎవాపరేటర్ కాయిల్ అనే భాగాలు కలిసి పనిచేస్తాయి. ముందుగా ఎవాపరేటర్‌లోని తక్కువ ఉష్ణోగ్రత కలిగిన రిఫ్రిజరెంట్ గదిలోని వేడిని గ్రహిస్తుంది. వేడిని తీసుకున్న తర్వాత రిఫ్రిజరెంట్ వాయువుగా మారుతుంది. ఆ వాయువు బయట ఉన్న కంప్రెసర్ వద్దకు వెళ్తుంది. కంప్రెసర్ దాన్ని ఒత్తిడితో కుదిస్తుంది. దీంతో రిఫ్రిజరెంట్ ఉష్ణోగ్రత పెరుగుతుంది.

తర్వాత అది బయట ఉన్న కండెన్సర్ కాయిల్‌లోకి వెళ్తుంది. బయట యూనిట్‌లోని ఫ్యాన్ ఈ కాయిల్‌పైకి బయట గాలిని పంపుతుంది. దీంతో రిఫ్రిజరెంట్ తనలోని వేడిని బయట గాలికి వదులుతుంది. వేడిని కోల్పోయిన రిఫ్రిజరెంట్ మళ్లీ ద్రవరూపంలోకి వస్తుంది. ఆ తర్వాత అది ఎక్స్‌పాన్షన్ వాల్వ్ ద్వారా వెళ్లడంతో దాని ఒత్తిడి, ఉష్ణోగ్రత తగ్గుతాయి. ఈ చల్లటి రిఫ్రిజరెంట్ మళ్లీ ఇండోర్ యూనిట్‌లోని ఎవాపరేటర్ కాయిల్‌కు చేరుతుంది. అక్కడ అది మళ్లీ గదిలోని వేడిని గ్రహిస్తుంది. ఈ సైకిల్‌ పదేపదే కొనసాగుతుంది.

సింపుల్‌గా చెప్పాలంటే గదిలోని వేడిని రిఫ్రిజరెంట్ గ్రహిస్తుంది, కంప్రెసర్, కండెన్సర్, వేడిని బయటకు విడుదల చేస్తాయి. రిఫ్రిజరెంట్ చల్లబడుతుంది, మళ్లీ గదిలోని వేడిని గ్రహిస్తుంది. ఇలా ఏసీ గదిలోని వేడిని బయటకు పంపుతూ ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.

45
ఏసీలోని ప్రధాన భాగాలు ఏంటి.? అవి ఏం చేస్తాయి.?
Image Credit : Getty

ఏసీలోని ప్రధాన భాగాలు ఏంటి.? అవి ఏం చేస్తాయి.?

కంప్రెసర్: ఏసీకి ఇది ఒక రకంగా గుండె లాంటిది. రిఫ్రిజరెంట్ వాయువును కంప్రెస్ చేసి తదుపరి దశకు పంపుతుంది. సాధారణంగా ఇది బయట యూనిట్‌లో ఉంటుంది.

కండెన్సర్ కాయిల్: రిఫ్రిజరెంట్‌లో ఉన్న వేడిని బయట వాతావరణానికి విడుదల చేసే భాగం. ఇది కూడా అవుట్‌డోర్ యూనిట్‌లో ఉంటుంది.

ఎక్స్‌పాన్షన్ వాల్వ్: రిఫ్రిజరెంట్ ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. దాని ఒత్తిడిని తగ్గించి తక్కువ ఉష్ణోగ్రతకు చేరేలా చేస్తుంది.

ఎవాపరేటర్ కాయిల్: గదిలోని వేడిని రిఫ్రిజరెంట్ గ్రహించే భాగం. ఇది సాధారణంగా ఇండోర్ యూనిట్‌లో ఉంటుంది.

ఫ్యాన్: గదిలోని గాలిని ఏసీ లోపలికి తీసుకెళ్లి, చల్లబడిన గాలిని తిరిగి గదిలోకి పంపుతుంది. అవుట్‌డోర్ యూనిట్‌లోని ఫ్యాన్ కండెన్సర్ కాయిల్ నుంచి వేడిని బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇవన్నీ కలిసి పనిచేసినప్పుడే మనకు కావాల్సిన చల్లదనం లభిస్తుంది. ఏసీ గదిలోని తేమను కూడా కొంతవరకు తొలగిస్తుంది. అందుకే కేవలం ఉష్ణోగ్రత తగ్గడమే కాకుండా గదిలోని గాలి తక్కువ తేమగా అనిపించి మరింత చల్లగా, సౌకర్యవంతంగా ఉంటుంది.

55
ఎన్ని ర‌కాల ఏసీలు ఉన్నాయి, వాటి ఉప‌యోగం ఏంటి?
Image Credit : Getty

ఎన్ని ర‌కాల ఏసీలు ఉన్నాయి, వాటి ఉప‌యోగం ఏంటి?

స్ప్లిట్ ఏసీ: ఇందులో ఇండోర్ యూనిట్, అవుట్‌డోర్ యూనిట్ రెండు ఉంటాయి. మన ఇళ్లలో ఎక్కువగా కనిపించేది ఇదే. రెండు యూనిట్లను కాపర్ పైపులు, ఇతర కనెక్షన్ల ద్వారా అనుసంధానిస్తారు.

విండో ఏసీ: ఒకే యూనిట్‌లో ప్రధాన భాగాలు ఉంటాయి. సాధారణంగా కిటికీకి అమర్చుతారు. ఒక వైపు గదిలోకి చల్లటి గాలి వస్తే మరో వైపు నుంచి వేడి బయటకు వెళ్తుంది.

డక్ట్‌లెస్ లేదా మినీ-స్ప్లిట్ ఏసీ: డక్ట్‌లు అవసరం లేకుండా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గదులను చల్లబరచడానికి ఉపయోగిస్తారు. ప్రత్యేక గదులు, కార్యాలయాలు, గ్యారేజీలు వంటి ప్రాంతాలకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయి.

పోర్టబుల్ ఏసీ: వీటిని ఒక గది నుంచి మరో గదికి తరలించుకోవచ్చు. సాధారణంగా చిన్న గదులు లేదా తాత్కాలిక అవసరాలకు ఉపయోగిస్తారు.

సెంట్రల్ ఏసీ: ఒకే యూనిట్‌తో మొత్తం ఇల్లు లేదా పెద్ద భవనంలోని అనేక ప్రాంతాలను చల్లబరచడానికి ఉపయోగిస్తారు. డక్ట్‌ల ద్వారా చల్లటి గాలి వివిధ గదులకు చేరుతుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
గాడ్జెట్‌లు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Instagram: బోరింగ్ ఇన్‌స్టా ప్రొఫైల్‌కి గుడ్ బై చెప్పేయండి.. ఈ సీక్రెట్ టిప్స్‌తో ట్రెండీగా మారండి
Recommended image2
Tea Shop: టీ అమ్ముతూ నెలకు రూ.9 లక్షలు సంపాదిస్తున్న వ్యక్తి.. రోజుకు ఎన్ని టీలు అమ్ముతారంటే..
Recommended image3
Cyclone Arnab: తుపానులకు పేర్లు ఎవరు పెడతారు? ఎందుకు పెడతారు?
Related Stories
Recommended image1
తెలియ‌కుండానే వంట నూనె ఎక్కువ‌గా వాడుతున్నారా.? ఈ ప్రొడ‌క్ట్ ఉంటే స‌మ‌స్య‌కు చెక్
Recommended image2
కుక్క ప‌ని గాడిద చేస్తే ఏమ‌వుతుందో తెలుసా.? మీ కండ్లు తెరిపించే కథ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved