- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: మాళవిక కొత్త ప్లాన్.. నా కూతురు నాకే సొంతం అంటూ యష్, వేద ముందు హైడ్రామా!
Ennenno Janmala Bandham: మాళవిక కొత్త ప్లాన్.. నా కూతురు నాకే సొంతం అంటూ యష్, వేద ముందు హైడ్రామా!
Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala Bandham) సీరియల్ ప్రేక్షకులు బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక నైట్ అంతా బాత్రూంలో పడుకున్న యశోదర్ (Yashodhar) కు వేద గుడ్ మార్నింగ్ చెప్పగా యశోదర్ బ్యాడ్ మార్నింగ్ చెబుతాడు.

అంతేకాకుండా రాత్రంతా బాత్రూం లో పడుకున్నందుకు పట్టించుకొనందుకు నువ్వు మనిషివేనా అంటూ విరుచుకుపడతాడు. కానీ వేద (Vedha) మాత్రం ఆ విషయాన్ని సిల్లీగా తీసుకొని అయ్యో పాపం అని అంటుంది. ఇక తర్వాత వారిద్దరి మధ్య కొంతసేపు మొగుడు పెళ్లాల ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఇక ఆ తర్వాత వాళ్లిద్దరూ ఇంటికి వెళ్లగా అంత త్వరగా వచ్చారేమిటి అని మాలిని (Malini) అడుగుతుంది.
ఆ తర్వాత సులోచన (Sulochana) మీ మొహం చూడకుంటే పొద్దు పడడం లేదు అందుకే మిమ్మల్ని చూద్దామని వచ్చా అని మాలిని తో అంటుంది. ఆ తర్వాత యశోదర్, వేదలు ఖుషి తో పాటు కార్లో స్కూల్ కి వెళతారు. ఆ క్రమంలో ఖుషి (Khushi) హోటల్ కి తనని తీసుకువెళ్లనందుకు ఫన్నీ గా కోపం పడుతుంది.
దాంతో వేద (Vedha) జరిగిన దాని గురించి ఆలోచించుకుంటూ నవ్వుతుంది. ఆ తర్వాత ఖుషి ను కలవడానికి మాళవిక స్కూల్ కి వచ్చి ఖుషి ను ముద్దులాడుతుంది దాంతో యశోదర్ ఖుషి ను లాక్కొని డోంట్ టచ్ మై డాటర్ అని అంటాడు. ఇక దాంతో మాళవిక (Malavika) ఖుషి ఎప్పటికైనా నాకే సొంతం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
ఆ తర్వాత యశోదర్ (Yashodhar) దంపతులు జరిగిన దాని గురించి ఆలోచించుకుంటూ వెళతారు. ఇక యశోదర్ వేదను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసి వెళుతుండగా వేద స్టెతస్ స్కోప్ మర్చిపోతుంది. ఇక యశోదర్ అది ఇవ్వడానికి తిరిగి వెళతాడు. దాంతో వేద (Vedha) యశోదర్ ను కొంతసేపు ఆడుకుంటుంది.
ఇక తరువాయి భాగం లో మాళవిక (Malavika) వేద దగ్గరికి వచ్చి నువ్వు యశోదర్ ను పెళ్లి చేసుకున్నందుకు నాకు బాధ లేదు అని అంటుంది. అంతేకాక వేదను వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పరిచయం చేస్తుంది. ఇక వేద (Vedha) పై కొంత కుట్రను కూడా వ్యక్తం చేస్తుంది మాళవిక. ఇక రేపటి భాగంలో ఎం జరుగుతుందో చూడాలి.