- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: యష్ ను కన్ఫ్యూషన్ లోకి నెట్టేసిన అభి.. వేదని చుట్టుముట్టిన రౌడీలు?
Ennenno Janmala Bandham: యష్ ను కన్ఫ్యూషన్ లోకి నెట్టేసిన అభి.. వేదని చుట్టుముట్టిన రౌడీలు?
Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకుంటూ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తనని జైల్లో పెట్టించారన్న కోపంలో ప్రత్యర్థి కూతురిని కిడ్నాప్ చేసిన ఒక ప్రబుద్ధుడి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 23 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో ఈ వాచి అభిమన్యుదే ఈ వాచి అంటే తనకి చాలా ఇష్టం ఆఫీసుకు కూడా చాలాసార్లు పెట్టుకోవచ్చాడు. ఇది నార్మల్ పీస్ కాదు కష్టమైజ్డ్ వాచ్ అని చెప్తుంది చిత్ర. ఖచ్చితంగా అభి అయి ఉంటాడు ఎందుకంటే మనం వాడి మీద కేసు పెట్టాం కదా ఆ కోపంతో వాడు ఖుషి ని కిడ్నాప్ చేసి ఉంటాడు అంటాడు వసంత్. ఆ మాటలకి కోపంతో రెచ్చిపోయిన యష్ ఇంటికి వెళ్లి తుపాకీ తీసుకొని అభి ఇంటికి వెళ్తాడు.
మరోవైపు ఖుషిని కిడ్నాప్ చేసి కారులో తీసుకు వెళ్తూ ఆదిత్యే అనుకుంటే వాడిని మించిపోయింది ఈ పిల్ల అంటాడు కైలాష్. ఇద్దరూ ఆ యష్ రక్తమే కదా ఆ మాత్రం పొగరు ఉంటుంది. చిత్రని పెళ్లి చేసుకొని హాయిగా ఉందామనుకున్నాను అదృష్టమో దురదృష్టమో తెలియని ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇదంతా వాడి వల్లే అని యష్ ని తిట్టుకుంటాడు అభి.
వాళ్ళిద్దరూ ఖుషీని కిడ్నాప్ చేయటం ఎవరు చూడలేదని డిసైడ్ అయిన తర్వాత ఒక డెన్ కి వెళ్లి రౌడీలకి ఖుషి ని అప్పజెప్పి ఈ పిల్లని జాగ్రత్తగా కాపలాకాయండీ పరిస్థితులను బట్టి ఏం చేయాలో నేను చెప్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అభి. మరోవైపు అభి ఇంటికి వెళ్లి గట్టిగా కేకలు వేస్తూ బయటికి రమ్మని అరుస్తాడు యష్. నీలాంబరి వచ్చి ఏం జరిగింది ఎందుకు అలా కేకలు వేస్తున్నారు అని అడుగుతుంది.
నీ మొగుడు నా కూతుర్ని కిడ్నాప్ చేశాడు ఎక్కడ దాచిపెట్టాడో అడుగు ముందు వాడిని కిందికి రమ్మను అంటాడు యష్. ఆయన నీ మాజీ భార్యనే బయటికి గెంటేశారు అలాంటిది నీ కూతుర్ని కిడ్నాప్ చేయవలసిన అవసరం ఏముంది. మీ ఇంట్లో ఏ సమస్య వచ్చినా మా ఆయనని అనుమానించడం బాగా అలవాటైపోయింది అంటూ అరుస్తుంది నీలాంబరి.
మొగుడిని బాగా అర్థం చేసుకున్నావు అంటూ భార్యని అభినందిస్తాడు అప్పుడే మెట్ల మీద నుంచి దిగి వస్తున్న అభి. అభిని చూస్తూనే కోపాన్ని ఆపుకోలేక అతనికి నాలుగు తగిలించి తలకి గురి పెట్టి నా కూతుర్ని ఎక్కడ దాచావో చెప్పు అంటూ యష్. మరోవైపు ఫాలో అవుతున్న వేదకి ఒకచోట అభికారు కనిపించడంతో అక్కడ ఆగి లోపల ఏం జరుగుతుందో చూస్తుంది వేద.
నలుగురు రౌడీలు పేకాట ఆడుకుంటూ ఉండడం గమనించి వాళ్ళని తప్పుతోవ పట్టించి డెన్ లోపలికి వస్తుంది. అక్కడ స్పృహ లేకుండా పడి ఉన్న ఖుషిని చూసి ఏడుస్తుంది. ఆమె మొహం మీద నీళ్లు జల్లి మెలకువ వచ్చేలాగా చేసి ఖుషి తో సహా అక్కడి నుంచి పారిపోవటానికి ప్రయత్నిస్తుంది వేద. మరోవైపు తలకి గన్ గురిపెట్టేసరికి టెన్షన్ పడతాడు అభి. నేను పొద్దుటి నుంచి ఇంట్లోంచి బయటికి వెళ్లలేదు అయినా నీ కూతురిని కిడ్నాప్ చేయవలసిన అవసరం నాకు ఏముంది అంటాడు.
నా భర్త కిడ్నాప్ చేశాడు అనటానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా అంటుంది నీలాంబరి. సాక్ష్యం ఉంది అంటూ వాచి చూపిస్తాడు యష్ ఇది నీదే కదా.. కాదని చెప్పటానికి కుదరదు ఎందుకంటే ఇది కష్టమైస్డ్ వాచి చిత్రకూడా అదే చెప్పింది అంటాడు యష్. వాచి చూసిన నీలాంబరి కూడా ఇది ఆయన వాచి యే అని చెప్తుంది. ఇప్పుడేమంటావ్ అంటాడు యష్. నువ్వు చెప్పింది నిజమే కానీ అది నా వాచ్ కాదు నాది నా దగ్గరే ఉంది అంటూ తను వాచి చూపిస్తాడు అభి.
కన్ఫ్యూజ్ అవుతాడు యష్. అది కష్టమైస్డ్ వాచ్ ఏ కానీ ఒక్కరి కోసమో చేయరు వేరే ఎవరిదైనా అయి ఉంటుంది ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు. నా దగ్గరకు వచ్చి టైం వేస్ట్ చేసుకునే బదులు వేరే ఎక్కడైనా వెతికితే ఈపాటికి ఖుషి దొరికేది. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి వెళ్లి నీ కూతుర్ని వెతుక్కో అంటాడు అభి. వెళ్తాను కానీ కిడ్నాప్ చేసింది నువ్వే అని కన్ఫర్మ్ అయితే మాత్రం నీ టైం అసలు బాగోదు అని వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు యష్. మరోవైపు ఖుషి ని ఎత్తుకొని బయటికి పారిపోదాం అనుకునే సమయానికి రౌడీల కంట్లో పడిపోతుంది వేద. వాళ్ళందరూ వేదని రౌండ్ అప్ చేస్తారు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.