MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Toxic Second Song: కియారా, నయన్ తర్వాత తారా సుతారియా.. యశ్ రొమాన్స్ మామూలుగా లేదుగా.. రెండో పాట ఎలా ఉందంటే?

Toxic Second Song: కియారా, నయన్ తర్వాత తారా సుతారియా.. యశ్ రొమాన్స్ మామూలుగా లేదుగా.. రెండో పాట ఎలా ఉందంటే?

నటుడు యశ్ 'టాక్సిక్' సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి 'మన్మోహక' అనే రెండో పాట విడుదలైంది. ఈ పాటలో యశ్, నటి తారా సుతారియాతో రొమాన్స్ చేస్తూ కనిపించారు. Yash Toxic Movie Second Song Manmohaka Features Tara Sutaria

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 21 2026, 02:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
టాక్సిక్‌ నుంచి రెండో పాట వచ్చింది
Image Credit : instagram

టాక్సిక్‌ నుంచి రెండో పాట వచ్చింది

యశ్‌ హీరోగా నటించిన `టాక్సిక్‌` నుంచి రెండో పాట వచ్చింది. కొన్ని రోజుల క్రితం వచ్చిన రొమాంటిక్‌ సాంగ్‌ దుమ్ములేపింది. కియారా అద్వానీతో రెచ్చిపోయాడు యశ్‌. అది పాట కాదు, కండోమ్‌ యాడ్‌ అనే విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పుడు రెండో పాటని విడుదల చేశారు. 'మనసాగదే` పేరుతో దీన్ని విడుదల చేశారు. తనిష్క్ బాగ్చి, ఫహీమ్ అబ్దుల్లా, అర్స్లాన్ నిజామీ ఈ పాటకు సంగీతం అందించారు. సిద్ధార్థ్ బస్రూర్ పాడగా, ప్రమోద్ మరవంతె సాహిత్యం రాశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మనసుని హత్తుకునేలా సాగిన రెండో పాట
Image Credit : instagram

మనసుని హత్తుకునేలా సాగిన రెండో పాట

`గుండెల్లో ఓ మెరుపు నడిచి మాయమైనట్టుంది. ఈ చల్లగాలి కూడా తుపానులా ఎందుకు వేధిస్తోంది? మనసులో ఏదో అలజడి. తనకు తానుగా సవాల్ విసురుకుంటోంది. ఆ జ్ఞాపకం ఇచ్చే సంతోషమే ఓ విషంలా మారింది. నాతో నేనే పోరాడుతున్నా. మనసును మోసం చేసేది, కొంచెం మత్తునిచ్చేది, నా ప్రపంచాన్నే మార్చేసింది. ఇదో కొత్త కోరిక, కాస్త గందరగోళం. నేనిప్పుడు మాటల్లేని నావికుడిని`... అంటూ ఈ పాట సాగుతుంది.

Related Articles

Related image1
Kajal: రామ్‌ చరణ్‌, చిరంజీవికి ఝలక్‌ ఇచ్చిన కాజల్‌.. తనని పాపులర్‌ చేసిన సినిమా ఏంటో తెలుసా?
Related image2
Saptami Gowda: 'కాంతార' బ్యూటీ కొత్త బిజినెస్.. అభిమానులకు స్పెషల్ ఇన్విటేషన్.. ఫోటోలు వైరల్‌
34
ముగ్గురు హీరోయిన్లతో యశ్ రొమాన్స్
Image Credit : instagram

ముగ్గురు హీరోయిన్లతో యశ్ రొమాన్స్

ఇందులో తారా సుతారియాతో రొమాన్స్ చేస్తూ కనిపించాడు యశ్‌. కానీ ఆ తర్వాత నయనతార వచ్చింది. కియారా అద్వానీ వచ్చింది. ఇలా ముగ్గురితోనూ కనిపించాడు. అయితే ఇది కాస్త ఎమోషనల్‌గా ఉంది. తన ప్రేమకి సంబంధించిన మనసులోని భావాలను ఆవిష్కరించినట్టుగా ఉంది. పాట ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పాట ట్రెండ్‌ అవుతోంది.  `టాక్సిక్` సినిమాలో యశ్ చాలా బోల్డ్‌గా కనిపించారు. ఇప్పటివరకు రిలీజైన ప్రోమోలు, పాటల్లో యశ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తూ, హీరోయిన్లతో ఆయన కెమిస్ట్రీ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

44
ఆగస్ట్ లో టాక్సిక్‌ రిలీజ్‌
Image Credit : instagram

ఆగస్ట్ లో టాక్సిక్‌ రిలీజ్‌

ఈ సినిమాలో యశ్, కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. యశ్, గీతూ మోహన్‌దాస్ కలిసి ఈ సినిమా కథను సిద్ధం చేశారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఆగస్ట్ 16న సినిమా రిలీజ్‌ కాబోతుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image3
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Related Stories
Recommended image1
Kajal: రామ్‌ చరణ్‌, చిరంజీవికి ఝలక్‌ ఇచ్చిన కాజల్‌.. తనని పాపులర్‌ చేసిన సినిమా ఏంటో తెలుసా?
Recommended image2
Saptami Gowda: 'కాంతార' బ్యూటీ కొత్త బిజినెస్.. అభిమానులకు స్పెషల్ ఇన్విటేషన్.. ఫోటోలు వైరల్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved