MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Kajal: రామ్‌ చరణ్‌, చిరంజీవికి ఝలక్‌ ఇచ్చిన కాజల్‌.. తనని పాపులర్‌ చేసిన సినిమా ఏంటో తెలుసా?

Kajal: రామ్‌ చరణ్‌, చిరంజీవికి ఝలక్‌ ఇచ్చిన కాజల్‌.. తనని పాపులర్‌ చేసిన సినిమా ఏంటో తెలుసా?

కాజల్‌ అగర్వాల్‌.. తనకు రెండు బ్లాక్‌ బస్టర్స్ ఇచ్చిన చిరంజీవి, రామ్‌ చరణ్‌ కు ఝలక్‌ ఇచ్చింది. తనకు నార్త్ లో పాపులారిటీని తీసుకొచ్చిన చిత్రం ఏంటో ఓపెన్‌గా ప్రకటించింది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 20 2026, 05:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పెళ్లి తర్వాత సెలక్టీవ్‌గా మూవీస్‌ చేస్తోన్న కాజల్‌
Image Credit : instagram/@kajalaggarwalofficial

పెళ్లి తర్వాత సెలక్టీవ్‌గా మూవీస్‌ చేస్తోన్న కాజల్‌

టాలీవుడ్‌ అందాల చందమామ కాజల్ అగర్వాల్‌.. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించింది. ఆమె ఇప్పుడు చాలా సెలక్టీవ్‌గా చేస్తోంది. తనకు నచ్చిన సినిమాలు, నచ్చిన పాత్రలే చేస్తోంది. అందుకే సినిమాలు తగ్గాయి. కాజల్‌ తెలుగులో చివరగా `కన్నప్ప`లో మెరిసింది. అంతకు ముందు `సత్యభామ` అనే లేడీ ఓరియెంటెడ్‌ మూవీ చేసింది. ఇవి ఆకట్టుకోలేదు. ఇప్పుడు బాలయ్యతో నటిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అల్లు అర్జున్‌కి హైప్‌ ఇచ్చిన కాజల్‌
Image Credit : instagram/@kajalaggarwalofficial

అల్లు అర్జున్‌కి హైప్‌ ఇచ్చిన కాజల్‌

ఒకప్పుడు గ్లామర్‌ కి దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు గ్లామర్‌ తగ్గించింది. తన పిల్లలు చూడగలిగే పాత్రలే చేస్తానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. గ్లామర్‌ అంటే నావెల్‌ పైనే ఫోకస్‌ ఉంటుందని, దాన్నే ఎక్కువగా చూపిస్తారని మేకర్స్ పై సెటైర్లు పేల్చింది. పలువురు దర్శకులకు కౌంటర్లు ఇచ్చింది. ఈ క్రమంలో కాజల్‌ మరో ఆసక్తికర, షాకింగ్‌ కామెంట్‌ చేసింది. తనకు నార్త్ లో పాపులర్‌ చేసిన సినిమా గురించి వెల్లడించింది. ఈ క్రమంలో అల్లు అర్జున్‌కి హైప్‌ ఇచ్చింది. పెద్ద హిట్లు ఇచ్చిన రామ్‌ చరణ్‌, చిరంజీవిని పక్కన పెట్టింది.

34
ఆర్య 2 వల్లే కాజల్‌కి నార్త్ లో పాపులారిటీ
Image Credit : Asianet News

ఆర్య 2 వల్లే కాజల్‌కి నార్త్ లో పాపులారిటీ

నార్త్ లో మీకు బాగా పాపులారిటీని తీసుకొచ్చిన సౌత్‌ మూవీ ఏంటని ప్రశ్నించారు యాంకర్‌. దీనికి కాజల్‌ రియాక్ట్ అవుతూ `ఆర్య 2` పేరు చెప్పింది. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. అల్లు అర్జున్‌ హీరోగా నటించాడు. బన్నీకి జోడీగా కాజల్‌ నటించింది. ఇందులో కాజల్‌ వెంటపడుతుంటాడు బన్నీ. కానీ ఆమె పట్టించుకోదు, ఈ క్రమంలో తన సాడిజం చూపిస్తుంటాడు. ఈ లవ్‌ స్టోరీ క్రేజీగా ఉంటుంది. కానీ సినిమా ఆడలేదు. జనాలకు ఎక్కలేదు. ఈ మూవీనే తనకు నార్త్ లో పాపులారిటీని తీసుకొచ్చిందని చెప్పింది కాజల్‌.

44
రామ్‌చరణ్‌, చిరంజీవిలకు కాజల్‌ ఝలక్‌
Image Credit : IMDB

రామ్‌చరణ్‌, చిరంజీవిలకు కాజల్‌ ఝలక్‌

ఇదిలా ఉంటే కాజల్‌ నటించిన చిత్రాల్లో రామ్‌ చరణ్‌ హీరోగా వచ్చిన `మగధీర` అప్పట్లో పెద్ద హిట్‌ అయ్యింది. తెలుగులో తొలి వంద కోట్లు సాధించిన మూవీగా నిలిచింది. పైగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ఈ మూవీ అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌ గా నిలిచింది. ఇది కాజల్‌ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రం కావడం విశేషం. దీంతోపాటు చిరంజీవితో `ఖైదీ నెం 150` చిత్రం చేసింది కాజల్‌. ఇది రూ.150 కోట్లకుపైగా వసూలు చేసింది. ఇది కూడా పెద్ద హిట్‌. కానీ ఈ సినిమాలను కాకుండా కాజల్‌ `ఆర్య 2` పేరు చెప్పడం విశేషం. కాజల్‌ ప్రస్తుతం తెలుగులో `ఎన్బీకే111` చిత్రంలో నటిస్తోంది. దీంతోపాటు హిందీలో మాత్రం బిజీగా ఉంది. అక్కడ `ది ఇండియా స్టోరీ`, అలాగే `రామాయణ్‌`లో నటిస్తోంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Trigun: సొంత టీంకే వెన్నుపోటు, త్రిగుణ్ దెబ్బకు మారిపోయిన ఆట..కెప్టెన్ గా అవతరించిన రామ్ ప్రసాద్
Recommended image2
Ramayana:హైదరాబాద్ లో రామాయణ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఫిక్స్..రణబీర్, యశ్ తోపాటు టీమ్ మొత్తం రెడీ
Recommended image3
Yash: సంచలనం సృష్టిస్తున్న సినిమాకు రాకింగ్ స్టార్ యశ్ సపోర్ట్.. ఫొటోలు చూసేయండి!
Related Stories
Recommended image1
Lenin 10 Days Collections: పదో రోజు అఖిల్‌ దెబ్బకి బాక్సాఫీస్ షేక్‌.. `లెనిన్‌`కి టోటల్‌ కలెక్షన్లు ఎంతంటే?
Recommended image2
Upasana: చిరంజీవికి ఉపాసన క్లోజ్‌ ఫ్రెండ్.. అది చాలా డేంజర్‌ అంటూ రామ్‌ చరణ్‌ షాకింగ్‌ కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved