Ennenno Janmala Bandham: వేద కోరిక విని షాకైన విన్ని.. భార్యకి షాకిచ్చిన యష్!
Ennenno Janmala Bandham: స్టార్ మాలో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల హృదయాలని దోచుకుంటూ టాప్ రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తమ వివాహ బంధాన్ని నిలుపుకోవడం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిన ఒక భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 5 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో మీకోసం నేను ప్రాణం ఇస్తాను, మీరంటే అంత పిచ్చి నాకు మన అగ్రిమెంట్ ప్రకారం మన బంధం ఒక సంవత్సరం అనుకొని ఆగిపోతున్నారేమో, కానీ మనది ఎన్నెన్నో జన్మల బంధం. ప్రేమని గుండెల్లో దాచుకోవచ్చు కానీ బాధని అలా దాచుకోకూడదు అది మనశ్శాంతి లేకుండా చేస్తుంది. మిమ్మల్ని నేను అలా చూడకూడదు.
మీ గుండెల్లో బాధ అంతా నాకు ఇచ్చేయండి అంటూ కన్నీరు పెట్టుకుంటుంది వేద. మీ మనసులో బాధ చెప్పకుండా మీలో మీరే కుమిలి పోతుంటే నాకు ఎలా అర్థం అవుతుంది. చెప్పకుండా మీరు, కారణం తెలియకుండా నేను, బాధపడడం నేను తప్పితే బాధ తీరదు కదా, మన మధ్య పోట్లాటలు, గిల్లికజ్జాలు అంతా ముగిసిపోయిన కథ ఇప్పుడున్నది ప్రేమ మాత్రమే.
ఒకవేళ నేను తెలియకుండా ఏమైనా తప్పు చేశాను అలాంటిది ఏమైనా ఉంటే చెప్పండి నన్ను నిలదీయండి అంతేగాని మీలో మీరే బాధపడకండి. మిమ్మల్ని వదిలి ఒక్క క్షణం ఉండలేను మీ పాదాల సాక్షిగా చెప్తున్నాను నేను ఉన్నదే మీకోసం అంటూ యష్ కాళ్లు పట్టుకొని ఏడుస్తుంది వేద. మరోవైపు యష్ ఎక్కడ కనిపించాడు అంటూ వేదని అడుగుతుంది మాలిని.
రోడ్డు పక్కన అని వేద చెప్పడంతో ఒకసారిగా కన్నీరు పెట్టుకుంటూ నా బిడ్డకి ఇలాంటి పరిస్థితి రావడం ఏంటి, నా బిడ్డ కి ఏం కర్మ పట్టింది, వాడిని ఇలా చూసి తట్టుకోలేకపోతున్నాను అంటుంది. అత్తగారిని ఓదార్చి మనకి తెలియకుండా ఎక్కడో ఏదో జరిగింది ఆయన దేనికో బాగా డిస్టర్బ్ అయ్యారు అంటుంది వేద. వాడికి గట్టి దెబ్బ తగిలి ఉంటుంది బయటకి చెప్పలేక లోపల దాచుకోలేక కుమిలిపోతున్నాడు.
వాడు ఇలా బాధపడటం ఇది మొదటిసారి కాదు మాళవిక వీడిని వదిలి వెళ్ళిపోయేటప్పుడు నా బిడ్డ గుండె పగిలిపోయింది నలుగురిలో నవ్వుల పాలయ్యాడు. ఇదిగో ఈ రోజు లాగానే అప్పుడు కూడా ఎక్కడికో వెళ్లిపోయేవాడు. అలాంటి వాడి జీవితంలోకి ఒక దేవతలాగా నువ్వు వచ్చావు. ఇప్పుడిప్పుడే వాడి జీవితం కుదుటపడుతుంది అనుకుంటే ఇలా జరిగింది ఏంటి నాకు చాలా భయం వేస్తుంది అంటూ ఏడుస్తుంది మాలిని.పెద్దవారు మీరే ఇలా భయపడుతుంటే ఎలా, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటుంది వేద. మరోవైపు ఇదే విషయం గురించి చిత్ర, వసంత్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు.
అప్పటివరకు వేద వదిన గురించి ఎంత గొప్పగా మాట్లాడాడో నాకు తెలుసు అంతలోనే ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడో నాకు అస్సలు అర్థం కావట్లేదు అంటాడు వసంత్. అక్క చాలా ఫీల్ అవుతుంది అంటూ కన్నీరు పెట్టుకుంటుంది చిత్ర. అక్క చాలా మంచిది ఎప్పుడు ఎవరిని హార్ట్ చేయదు అలాంటి తనకే ఎందుకు ఇలా జరుగుతుంది అంటుంది. నాకు అదే అర్థం కావట్లేదు అంటాడు వసంత్. మరోవైపు విన్ని దగ్గరికి వచ్చి తన బాధను చెప్పుకుంటుంది వేద. ఆయన నా ప్రాణం, నా ఊపిరి ఆయన లేని జీవితం నాకు అక్కర్లేదు.
ఆయన్ని వదిలేసుకోవలసి వస్తే అంతకన్నా ముందు నా ప్రాణాలని వదిలేసుకుంటాను అంటుంది వేద. ఆ మాటలకి షాక్ అయిన విన్ని వేదు అంటూ కోప్పడతాడు. ఈ ఫ్రెండ్ అంటే నీకు అంత ఇష్టం. నువ్వు నన్ను అర్థం చేసుకున్నంతగా నా భర్త నన్ను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు బాధపడుతుంది వేద. నువ్వు దేని గురించి భయపడకు నీకు నేనున్నాను.నీకోసం ఏమైనా చేస్తాను అంటాడు విన్ని. నాకు వేరే ఏమీ వద్దు నా భర్తని నాకు దూరం కానివ్వను అని మాట ఇవ్వు అంటుంది వేద.
మాట ఇస్తే ఎలాగైనా నిలబెట్టుకుంటావు నువ్వే నిలబెట్టాలి రిక్వెస్ట్ చేస్తుంది వేద. ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు విన్ని. కానీ చివరి నిమిషంలో అలాగే అంటూ మాటిస్తాడు. అందుకు ఎంతో సంతోషిస్తుంది వేద. మరోవైపు ఖుషిని రెడీ చేస్తూ ఉంటుంది వేద. అంతలోనే అక్కడికి వచ్చిన యష్ కోపంగా వేద దగ్గర నుంచి ఖుషిని లాక్కుంటాడు. నా కూతుర్ని రెడీ చేయటానికి నేనున్నాను వేరే ఎవరు అక్కర్లేదు. ఖుషి విషయంలో వేరెవరు కలగజేసుకో అక్కర్లేదు అంటాడు. అలా అంటారేంటి రోజు ఖుషి ని నేనే కదా రెడీ చేసి స్కూల్ కి తీసుకు వెళ్ళేది అంటుంది. అప్పుడు వేరు ఇప్పుడు వేరు అంటాడు యష్.
తరువాయి భాగంలో మన యష్ సౌత్ ఇండియా బిజినెస్ ఛాంబర్ కి ప్రెసిడెంట్ గా సెలెక్ట్ అయ్యాడు అంటూ ఆనందంగా అందరికీ చెప్తాడు వసంత్. అదే విషయాన్నియష్ కి చెప్పి బిజినెస్ మీటింగ్ కదా ఏమైనా డ్రెస్ కోడ్ ఉంటుందా, మనం ఇద్దరం చేతులు పట్టుకొని స్టేజ్ మీదకి వెళ్తామా అంటూ ఆనందంగా మాట్లాడుతుంది వేద. నీ ఓవరాక్షన్ ఆపు ప్రెసిడెంట్ అయింది నేను దీంట్లో నీకే సంబంధం లేదు అంటూ కోపంగా అక్కడినుంచి వెళ్ళిపోతాడు యష్.