- Home
- Entertainment
- Double Elimination: బిగ్ బాస్ తెలుగు 9 డబుల్ ఎలిమినేషన్, 14వ వారం ఈ ఇద్దరు ఔట్.. టాప్ 5 కంటెస్టెంట్లు వీరే
Double Elimination: బిగ్ బాస్ తెలుగు 9 డబుల్ ఎలిమినేషన్, 14వ వారం ఈ ఇద్దరు ఔట్.. టాప్ 5 కంటెస్టెంట్లు వీరే
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ చివరి వారం అయిన 14 వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన అప్ డేట్ వచ్చింది. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తేలిపోయింది. డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది.

బిగ్ బాస్ తెలుగు 9 14వ వారం ఎలిమినేషన్
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ 14వ వారం ఆద్యంతం రసవత్తరంగా సాగింది. టికెట్ టూ ఫినాలేలో కళ్యాణ్ పడాల విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సీజన్ తొలి ఫైనలిస్ట్ గా కళ్యాణ్ నిలిచారు. ఈ వారం సెకండ్ ఫైనల్‌కి సంబంధించిన టాస్క్ లు జరిగాయి. ఇందులో ఇమ్మాన్యుయెల్ విన్నర్‌గా నిలిచారు. ఆయన రెండో ఫైనలిస్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరు? ఇప్పటికే ఇద్దరు కన్ఫమ్ అయిన నేపథ్యంలో మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్లు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేవారెవరనేది కూడా క్యూరియాసిటీగా మారింది.
ఈ వారం నామినేషన్‌లో ఉన్నది వీరే
ఈ వారం కళ్యాణ్ తప్ప తనూజ, ఇమ్మాన్యుయెల్, భరణి, సుమన్ శెట్టి, సంజనా, డీమాన్ పవన్ నామినేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ వారం టాస్క్ ల్లో విజయం సాధించి ఇమ్ము సేఫ్‌లో ఉన్నాడు. డీమాన్ పవన్‌కి కూడా మంచి ఓటింగ్ పడుతుంది. దీంతో సంజనా, భరణి, సుమన్ శెట్టిల మధ్యనే ఎలిమినేషన్ ఉండబోతుందని అంతా భావించారు. ఈ క్రమంలో ఈ వారం ఎలిమినేట్ అయ్యింది ఎవరనేది ఓ క్లారిటీ వచ్చింది. అదే సమయంలో టాప్ 5 కంటెస్టెంట్లు కూడా ఫైనల్ అయినట్టు సమాచారం. ఎలిమినేట్ అయ్యింది ఎవరో తెలిస్తే, ఆటోమెటిక్‌గా ఫైనలిస్ట్ కూడా ఎవరనేది తేలుస్తుంది.
ఈ వారం డబుల్ ఎలిమినేషన్
ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. బిగ్ బాస్ షోకి ఇదే చివరి వారం కావడంతో ప్రస్తుతం హౌజ్‌లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్న నేపథ్యంలో ఇద్దరిని ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది. అందుకే మొదటగా సుమన్ శెట్టి ఎలిమినేట్ అయినట్టు సమాచారం. చాలా రోజులుగా సుమన్ శెట్టికి తక్కువ ఓటింగ్ పడుతుంది. ఆయన గేమ్స్, టాస్క్ ల్లోనూ యాక్టివ్‌గా కనిపించడం లేదు. డల్‌గా ఉంటున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ కూడా చేయడం లేదు. దీంతో ఆయనకు పడే ఓటింగ్ భారీగా పడిపోయినట్టు సమాచారం. అందులో భాగాంగానే ఈ వారం మొదటి ఎలిమినేషన్ సుమన్ శెట్టి అని తెలుస్తోంది. ఆల్మోస్ట్ ఇది కన్ఫమ్ అయినట్టు సమాచారం.
రెండో ఎలిమినేషన్ భరణి ?
ఇక మరో ఎలిమినేషన్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. సంజనా, డీమాన్ పవన్, భరణిల మధ్యనే ఈ ఎలిమినేషన్ ఉంటుందని భావిస్తున్నారు. అయితే తెలుస్తోన్న లేటెస్ట్ సమాచారం మేరకు డబుల్ ఎలిమినేషన్‌గా భరణి అని టాక్. ఆయన టాప్ 5లో ఉంటారనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. ఎందుకంటే ఆ మధ్య నాగార్జుననే నిహారికతో చెప్పిన మాటలు లీక్ అయ్యాయి. ఆయన చెప్పినదాన్ని ప్రకారం భరణిని టాప్ 5లో ఉంచుతారని అనుకున్నారు. కానీ ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా ఆయన్ని ఎలిమినేట్ చేసినట్టు సమాచారం.
టాప్ 5 కంటెస్టెంట్లు వీరేనా?
తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ వారం సుమన్ శెట్టి, భరణి హౌజ్‌ని వీడబోతున్నారట. ఇది కాకుండా ఏదైనా లీస్ట్ కేసులో సంజనాగానీ, డీమాన్ పవన్‌లో ఒకరిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. కానీ 99శాతం దీనికి స్కోప్ లేదని టాక్. ఈ లెక్కన ఇప్పుడు కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యుయెల్, తనూజ, డీమాన్ పవన్, సంజనా టాప్ 5 కంటెస్టెంట్లుగా ఎంపిక కాబోతున్నట్టు సమాచారం. ఇక వీరి మధ్యనే టైటిల్ పోరు సాగనుంది. ఈ సారి ఇమ్మాన్యుయెల్‌ని విన్నర్‌ని చేయబోతున్నారని సమాచారం. లీస్ట్ కేసులో కళ్యాణ్ పడాలకు ఉంటుందని టాక్. ఏం జరుగుతుందో మరో వారంలో తేలిపోనుంది.

