యాంకర్ శ్రీముఖికి షాకిచ్చిన స్టార్ మా.. ఆమె షో మరో యాంకర్ చేతిలోకి...
Anchor Sreemukhi: శ్రీముఖి ప్రస్తుతం స్టార్ మాలో చాలా రకాల షోలకు యాంకర్ గా వ్యవహరిస్తోంది. స్టార్ మా ఓపెన్ చేస్తే చాలు శ్రీముఖి మాత్రమే కనపడేది. అయితే.. ఇప్పుడు ఆమె చేయాల్సిన షో మరో యాంకర్ చేతికి వెళ్లిపోయింది.

Anchor Sreemukhi
బుల్లితెర యాంకర్ శ్రీముఖికి పరిచయం అవసరం లేదు. ఎన్నో సంవత్సరాలుగా ఆమె టీవీ షోలు చేస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. సినిమా హీరోయిన్ కి ఏ మాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకునే శ్రీముఖికి.. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అంతే ఎక్కువగా ఉందని చెప్పొచ్చు.
శ్రీముఖి తన కెరీర్ ని ఈటీవీతో మొదలుపెట్టినా... ప్రస్తుతం స్టార్ మాలో కంటిన్యూ అవుతోంది. స్టార్ మాలో కంటిన్యూ అవుతోంది అనే కంటే... ఒంటి చేత్తో ఆ ఛానెల్ ని నడిపిస్తోందని చెప్పొచ్చు. ఆ ఛానెల్ కి సంబంధించిన ఏ షో అయినా యాంకరింగ్ శ్రీముఖి మాత్రమే చేస్తూ వస్తోంది. గతంలో చాలా మంది యాంకర్స్ పని చేసినా.. ప్రస్తుతం ముఖ్యమైన టీవీ షోలు, ఈవెంట్స్ అన్నీ ఒక్కతే హ్యాండిల్ చేస్తుంది.
BB Jodi Season2
ఆదివారం విత్ స్టార్ మా పరివారం తో పాటు... బీబీ జోడి, నీతోనే డ్యాన్స్, కిరాక్ బాయ్స్, ఖిలాడీ గర్ల్స్ లాంటి అన్ని షోలకు తానే యాంకరింగ్ చేస్తూ వస్తోంది. సడెన్ గా స్టార్ మా..... శ్రీముఖికి షాక్ ఇచ్చింది. గతంలో బీబీ జోడి అనే ప్రోగ్రామ్ జరిగిన సంగతి తెలిసిందే. దానికి శ్రీముఖి యాంకర్ గా చేయగా, రాధ, సదా లాంటివారు జడ్జ్ లుగా వ్యవహరించారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ సెకండ్ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల చేశారు.
అయితే... ఈ ప్రోమోలో యాంకర్ శ్రీముఖి కాకపోవడం గమనార్హం. ఈ సారి ఈ ప్రోగ్రామ్ ని యాంకర్ ప్రదీప్ చేతిలో పెట్టడం విశేషం. కుకు విత్ జాతి రత్నాలు తర్వాత ప్రదీప్ ఈ షోకి యాంకరింగ్ చేస్తున్నారు. బీబీ జోడి సీజన్ 2 కి కేవలం యాంకర్ మాత్రమే కాదు...జడ్జ్ లు కూడా మారిపోయారు. ఈ సారి జడ్జ్ లుగా... కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, హీరోయిన్ శ్రీదేవి లు కొనసాగనున్నారు.
యాంకర్ గా ప్రదీప్... జోడీలు వీళ్లే...
ఇప్పటి వరకు బిగ్ బాస్ కి వెళ్లిన కొందరు హౌస్ మెట్స్ జోడీలుగా ఈ షోలో అడుగుపెట్టనున్నారు. ఇప్పటి వరకు పెయిర్ అవ్వని జోడీలు ఈ షోలో అడుగుపెడుతుండటం విశేషం. అమర్ దీప్- నైనిక, నయని పావని- సాయిశ్రీనివాస్, శ్రీ సత్య- అర్జున్ కళ్యాణ్, మణికంఠ ఇలా చాలా మందే ఈ ప్రోగ్రామ్ లో పాల్గొననున్నారు. త్వరలోనే రీతూ-డీమాన్ పవన్ కూడా ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. బిగ్ బాస్ ముగిసిన తర్వాత.. ఇది అదే సమయంలో టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.

