- Home
- Entertainment
- Nagababu: సౌత్ ఆఫ్రికా నుంచి ఫోన్ చేసిన స్టార్ హీరో.. నాగబాబు, భరణి ఇద్దరి సమస్య ఒక్కటే.. అందుకే ఈ బంధం
Nagababu: సౌత్ ఆఫ్రికా నుంచి ఫోన్ చేసిన స్టార్ హీరో.. నాగబాబు, భరణి ఇద్దరి సమస్య ఒక్కటే.. అందుకే ఈ బంధం
భరణి శంకర్ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు. భరణి టాప్ 5లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ ఇంటర్వ్యూలో భరణి తన లైఫ్ స్ట్రగుల్స్, నాగబాబుతో బంధం గురించి వివరించారు.

బిగ్ బాస్ హౌస్ లో భరణి
బుల్లితెర నటుడు భరణి శంకర్ ప్రస్తుతం బిగ్ బాస్ షోలో రాణిస్తున్నాడు. భరణి ఒకసారి హౌస్ నుంచి ఎలిమినేట్ అయి తిరిగి మళ్ళీ వెళ్లారు. భరణికి రెండవసారి అవకాశం రావడంపై చాలా కామెంట్స్ వినిపించాయి. నాగబాబు రెకమండేషన్ వల్లే భరణిని తిరిగి హౌస్ లోకి తీసుకువచ్చారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. భరణికి టాప్ 5లోకి వెళ్లే అర్హత లేదని.. అయినా మేనేజ్మెంట్ కోటాలో టాప్ 5లోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే సెటైర్లు వినిపిస్తున్నాయి.
టీవీ సీరియల్ తో పరిచయం
అసలు భరణి, నాగబాబు మధ్య బంధం ఎలా ఏర్పడింది అని చాలా మంది చర్చించుకుంటున్నారు. వీరిద్దరూ సీతామాలక్ష్మి అనే సీరియల్ లో నటించడం వీరి బంధానికి ఒక కారణం అయితే మరో బలమైన కారణం కూడా ఉంది. రియల్ లైఫ్ లో ఇద్దరూ ఒకే రకమైన సమస్యలు ఎదుర్కొన్నారు. దీనితో ఇద్దరూ ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. వీరికున్న కష్టాల కారణంగా కూడా ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది.
సౌతాఫ్రికా నుంచి ఫోన్
రాంచరణ్ హీరోగా నాగబాబు ఆరెంజ్ అనే చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫ్లాప్ కావడంతో నాగబాబు తీవ్రంగా నష్టపోయారు. తనకు ఉన్న ఆస్తులు అమ్మినా కూడా నష్టాలు తీరని పరిస్థితి ఏర్పడింది. డిప్రెషన్ లోకి వెళ్లారట. సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చింది అని నాగబాబు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ కి తెలిసింది. కళ్యాణ్ బాబు ఆ సమయంలో సౌతాఫ్రికాలో ఉన్నాడు. అక్కడి నుంచి నాకు ఫోన్ చేశాడు అని నాగబాబు తెలిపారు.
నాగబాబుకు అండగా నిలబడిన మెగా బ్రదర్స్
అన్నయ్య ఇలా జరిగింది అని నాకు తెలిసింది. దాని గురించి మర్చిపో అన్నయ్య నేను చూసుకుంటా అని చెప్పాడు. చెప్పినట్లుగానే అప్పులు తీర్చాడు. అదే విధంగా అన్నయ్య చిరంజీవి గారు కూడా ఒక రాక్ లాగా నిలబడిపోయి ఆదుకున్నారు. వారిద్దరూ లేకుంటే నేను లేను అని నాగబాబు తెలిపారు. ఆ తర్వాత నాగబాబు సొంత సంపాదన కోసం టివి షోలు, సీరియల్స్ లో నటించడం ప్రారంభించారు.
నాగబాబు లాగే నష్టపోయిన భరణి
సీతామాలక్ష్మి సీరియల్ లో భరణితో పరిచయం ఏర్పడింది. 2015లో భరణి తాళికట్టు శుభవేళ అనే సీరియల్ కి నిర్మాతగా వ్యవహరించారు. ఆ సీరియల్ ద్వారా తనకి తీవ్రమైన నష్టాలు వచ్చి డబ్బు మొత్తం పోగొట్టుకున్నాను అని భరణి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ సమయంలో నాగబాబు గారు నన్ను ఇంటికి పిలిచారు. ఇద్దరం కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నాం. నాగబాబు గారు ఒక మాట అన్నారు. లైఫ్ లో కొన్ని జరగాలి భరణి.. అప్పుడే కొన్నింటి విలువ తెలుస్తుంది. కొన్ని జరగడం మన మంచికే.
నాగబాబు చెప్పినట్లే జరిగింది
నువ్వు నిజంగా అదృష్టవంతుడివి.. ఎందుకంటే నువ్వు భరించగలిగే అమౌంట్ నే నష్టపోయావు. పైగా నీకు ఇప్పుడు వర్క్ ఉంది. నువ్వు కోరుకుంటే ఏ సీరియల్ లోకి అయినా నిన్ను తీసుకుంటారు. నీ ప్రాబ్లెమ్స్ 6 నెలల్లో తీరిపోతాయి చూడు భరణి అని అన్నారు. అక్కడి నుంచి బయలుదేరిన వెంటనే 2 సీరియల్స్ లో నాకు అవకాశం వచ్చింది. అన్నపూర్ణ స్టూడియో నుంచి కూడా కాల్ వచ్చింది అని భరణి గుర్తు చేసుకున్నారు.

