- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: 'వసంత్'తో చిత్ర పెళ్లికి ఒప్పుకున్న యష్.. వేద కోరిక తీర్చిన యష్!
Ennenno Janmala Bandham: 'వసంత్'తో చిత్ర పెళ్లికి ఒప్పుకున్న యష్.. వేద కోరిక తీర్చిన యష్!
Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెంబర్ 7వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. ఖుషి ఆనందంగా యష్, వేదాలతో పాటు ఇంటికి వస్తుంది.వచ్చి, నానమ్మ నేను అన్నయ్యకి రాఖీ కట్టాను అని అంటుంది. అవునా అమ్మ అని అనగా ముందు అన్నయ్య ఇంట్లో లేరని చెప్పారు నానమ్మ, తర్వాత నేను ఒక ట్యూన్ పాడాను. అప్పుడు అన్నయ్య నన్ను వెతుక్కుంటూ వచ్చాడు అని అంటుంది.ఖుషి లోపలికి వెళ్లిపోయిన తర్వాత అసలు ఏం జరిగింది అని మాలిని అడుగుతుంది. అప్పుడు యష్,జరిగిన విషయం అంతా చెప్తాడు.
ఆ మాలవిక పిల్లల్ని ఎంత వేరు చేయాలనుకున్నా మన ఆదిత్య మనసులో ఎక్కడో దగ్గర చెల్లెలి మీద ప్రేమ ఉంది, అందుకే రాఖీ కట్టించుకున్నాడు అని అంటుంది. వేద లేకపోతే ఈ పని జరిగేది కాదేమో అమ్మ ఎప్పుడైతే మాలవిక ఖుషిని అమ్మా అని పిలవమన్నదో అప్పుడే ఖుషిను తిరిగి ఇంటికి తీసుకువచ్చేద్దాం అనుకున్నాను కానీ వేద ఆపి వద్దు అని చెప్పింది. లేకపోతే ఖుషి కి ఈ తీపి జ్ఞాపకం ఉండేది కాదేమో అని అంటాడు.ఆ తర్వాత సీన్లో సులోచన వేదతో, ఆ మాళవిక అలా చేస్తుందని అనుకోలేదు అని అంటుంది. మాళవికకి ఇంకేమీ దారి లేక అలా చేసింది అమ్మ అయినా ఖుషి, ఆదిత్యల ప్రేమ ముందు తను ఓడిపోయింది అని అంటుంది వేద.
అప్పుడు సులోచన,అయినా నువ్వు లేవని చెప్పి ఉదయం నుంచి ఎంత కంగారు పడ్డానో తెలుసా? అందులోని నువ్వు ఆ మాలవిక ఇంటికి వెళ్ళావని తెలిస్తే ఇంకా భయం వేసింది అని అంటుంది. అప్పుడు వేద, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అమ్మ. మా ఆయన నాతో ఉన్నారు కదా, నన్ను బాగా చూసుకుంటారు. నాకున్న లోపం తెలిసి చాలామంది నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. నాకు దేవుడు ఇద్దరు పిల్లల్ని ఇచ్చారు. ఒకరు నా అమ్మ ప్రేమని కోరుకున్నారు, ఇంకొకరు అదే ప్రేమతో ఎప్పటికైనా దగ్గరవుతారు.
నన్ను బంగారంలా చూసుకునే మా ఆయన ను దేవుడిచ్చారు నాకు ఇంకేం కావాలి చెప్పు అని అంటుంది. ఈ మాటలన్నీ యష్ వింటాడు. అప్పుడు వేదాఇంక తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు సులోచ,న ఈ మధ్య చిత్ర మనసేం బాగోడం లేదు. ఒక్కత్తే ఉంటుంది. బహుశా వసంత్ కోసం ఆలోచించుకుంటూ ఉండిపోతుందేమో అని అంటుంది. అప్పుడు వేద,వాళ్ళిద్దరి జీవితాలు కూడా చెక్క పెడతాను అని అంటుంది.ఆ తర్వాత సీన్లో యష్ కిటికీలోనుంచి ఆకాశంలో చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో వేద అక్కడికి వస్తుంది అప్పుడు యష్, థాంక్యూ వేద నీవల్లేదంతా జరిగింది.
నా పిల్లల్ని సొంత పిల్లలా చూసుకుంటున్నావు అని అనగా మీ పిల్లలు ఏంటి వాళ్ళు మన పిల్లలు. అయినా అది నా బాధ్యత వాళ్ళిద్దర్నీ ఎప్పటికైనా ఒకటి చేస్తాను అని అంటుంది. అప్పుడు యష్ ఆనందంతో, నీకు ఏమైనా కావాలంటే కోరుకో లేదా ఏం చేయాలన్నా తీరుస్తాను అని అంటాడు. అయితే చిత్ర వసంతల పెళ్లి చేయండి. నాకు ఆ ఒక్క కోరిక ఉన్నది చిత్ర వసంతిని కొట్టింది కేవలం బాధ్యతతోనే తప్ప పొగరుతో కాదు. ఆ రోజు మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. వాళ్ళిద్దరూ విడిపోయి ఎంతో బాధ పడుతున్నారు ఒకసారి ఆలోచించండి అని అనగా యష్, నేను ఒప్పుకున్న ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి కదా.
దామోదర్ చెల్లితో వసంత్ కి ఎంగేజ్మెంట్ అనుకున్నాము కదా అని అంటాడు. అప్పుడు వేద, వాళ్ల గురించి నేను చూసుకుంటాను ముందు మీకు ఇష్టమో కాదో చెప్పండి. ఇప్పుడే నా కోరిక తీరుస్తానని మాట ఇచ్చారు అని అనగా కొంచెం సేపు యష్ ఆలోచించి ఒప్పుకుంటాడు అప్పుడు వేద ఆనందంతో యష్ ని వెళ్లి హద్దుకుంటుంది.థాంక్యూ వెరీమచ్ అని చెప్తుంది.ఆ తర్వాత వేద, చిత్ర దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అంతా చెప్తుంది అప్పుడు చిత్ర ఆనందంతో థాంక్యూ అక్క. మీ వల్లే ఇదంతా జరిగింది నువ్వు లేకపోతే నా జీవితం తారు మారు అయ్యేదేమో.
ఇంకెప్పటికీ వాసంత్ని కలవలేని ఏమో అని బాధపడ్డాను.థాంక్యూ వెరీ మచ్,బావ గారిని ఒప్పించినందుకు అని అంటుంది. ఆ తర్వాత సీన్లో వేద, యష్ ఇద్దరూ కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి వీళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అని అనగా మాలిని, నాకు నచ్చలేదు. దామోదర్ చెల్లితో వసంత్కి పెళ్లి అనుకున్నాం కదా ఇప్పుడు ఇలా ఎందుకు అని అనగా సులోచన వాళ్ళ కన్నా ముందు వసంత్ కి ,చిత్రికి పెళ్లి అనుకున్నాము కదా అని ఇద్దరు గొడవపడతారు. అంతలో దామోదర్ అక్కడికి వస్తాడు.ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తర్వాయి భాగం లో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!