MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Yash Next Movie: టాక్సిక్‌ని పక్కన పెట్టిన యశ్‌.. నెక్ట్స్ మూవీ ఇదే, స్టోరీ లీక్.. సెన్సేషనల్‌ హీరోయిన్‌

Yash Next Movie: టాక్సిక్‌ని పక్కన పెట్టిన యశ్‌.. నెక్ట్స్ మూవీ ఇదే, స్టోరీ లీక్.. సెన్సేషనల్‌ హీరోయిన్‌

Yash Next Movie: 'టాక్సిక్' తర్వాత రాకింగ్ స్టార్ యశ్, డైరెక్టర్ నర్తన్‌తో సినిమా చేస్తున్నారు. ఇందులో యశ్ మాజీ సైనికుడిగా, ఆ తర్వాత ‘మ్యాడ్ పోలీస్’ ఆఫీసర్‌గా కనిపిస్తారు. ఈ పాన్ ఇండియా సినిమాను బాలీవుడ్ ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.    

1 Min read
Author : Aithagoni Raju
Published : Jun 30 2026, 06:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
టాక్సిక్‌ని పక్కన పెట్టిన యశ్‌
Image Credit : others

టాక్సిక్‌ని పక్కన పెట్టిన యశ్‌

KGF సిరీస్ తర్వాత యశ్ తర్వాతి సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. యశ్ ప్రస్తుతం 'టాక్సిక్' మూవీ చేస్తున్నాడు. ఇది చిత్రీకరణ పూర్తయ్యింది. రిలీజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఎప్పుడో సమ్మర్‌లో రావాల్సిన ఈ మూవీ ఇంకా రిలీజ్‌ కాలేదు. ఎప్పుడు వస్తుందో కూడా తెలియడం లేదు. యుద్ధం కారణంగా వాయిదా వేసినట్టు చిత్ర వర్గాలు చెప్పాయి. కానీ రిలీజ్‌ పై క్లారిటీ లేదు. దీంతో ఇప్పుడు యశ్‌ `టాక్సిక్‌`ని పక్కన పెట్టాడు. కొత్త ప్రాజెక్ట్ పై ఫోకస్‌ పెడుతున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కొత్త సినిమాపై యశ్‌ ఫోకస్‌
Image Credit : Facebook

కొత్త సినిమాపై యశ్‌ ఫోకస్‌

నర్తన్‌ దర్శకత్వంలో యశ్‌ ఈ మూవీ చేస్తున్నాడని సమాచారం. ఇందులో `యానిమల్‌` ఫేమ్‌ డిమ్రి తృప్తి హీరోయిన్‌గా నటిస్తుందట. ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ బయటకు వచ్చాయి. ఈ సినిమా కథ ఒక మాజీ సైనికుడి చుట్టూ తిరుగుతుందట. హీరో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సైన్యాన్ని వదిలేసి, తన సొంత ప్రాంతంలో పోలీస్ ఫోర్స్‌లో చేరతాడు.

Related Articles

Related image1
NTR-Trivikram Movie: ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సంచలన ప్రాజెక్ట్.. పూనకాలు తెప్పిస్తోన్న పోస్టర్‌
Related image2
Sridevi: మూడు నెలలు స్టార్‌ హీరోతో శ్రీదేవి కాపురం, విడిపోవడానికి కారణమిదే.. జర్నలిస్ట్ సంచలన నిజాలు వెల్లడి
34
మ్యాడ్‌ పోలీస్‌ గా యశ్‌
Image Credit : Facebook

మ్యాడ్‌ పోలీస్‌ గా యశ్‌

ఈ చిత్రంలో యశ్ 'మ్యాడ్ పోలీస్' అనే పేరున్న పవర్‌ఫుల్ ఆఫీసర్‌గా అదరగొట్టబోతున్నాడు. ఎలాంటి సవాలులోనైనా ఓటమి ఎరుగని ఆఫీసర్ పాత్ర ఇది. యాక్షన్, డ్రామా రెండూ ఉండటంతో ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చేలా ఈ కథ ఉండబోతోంది.
44
భారీ బడ్జెట్‌తో యశ్‌, నర్తన్‌ మూవీ
Image Credit : Facebook

భారీ బడ్జెట్‌తో యశ్‌, నర్తన్‌ మూవీ

ఈ భారీ బడ్జెట్ సినిమాను బాలీవుడ్ ఫేమస్ ప్రొడక్షన్ హౌస్ 'ధర్మ ప్రొడక్షన్స్' నిర్మిస్తోంది. కరణ్ జోహార్, హిరూ జోహార్, అపూర్వ మెహతా నిర్మాతలుగా ఉన్నారు. 'సప్త సాగరదాచె ఎల్లో' ఫేమ్ హేమంత్ ఎం. రావు, యశ్ కలిసి ఈ చిత్రానికి కథ అందిస్తుండటం విశేషం.  ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది. నర్తన్ పవర్‌ఫుల్ డైరెక్షన్, యశ్ మ్యానరిజం కోసం సినీ ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Alia Bhatt Crush: రణ్‌బీర్‌ కపూర్ కాదు, ఆలియా భట్‌ ఫస్ట్ క్రష్ ఆ స్టార్ హీరో అని తెలుసా?
Recommended image2
Netflix Series: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 5 సిరీస్‌లు.. మళ్లీ మళ్లీ చూడాలనిపించే వెబ్ మూవీస్ ఇవే
Recommended image3
ఏ దావత్‌లో చూసినా, ఏ కార్ల‌లో విన్నా ఇదే పాట‌.. మిలియ‌న్ల వ్యూస్‌తో దుమ్మురేపుతోన్న బాసింగ బ‌లాలు
Related Stories
Recommended image1
NTR-Trivikram Movie: ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సంచలన ప్రాజెక్ట్.. పూనకాలు తెప్పిస్తోన్న పోస్టర్‌
Recommended image2
Sridevi: మూడు నెలలు స్టార్‌ హీరోతో శ్రీదేవి కాపురం, విడిపోవడానికి కారణమిదే.. జర్నలిస్ట్ సంచలన నిజాలు వెల్లడి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved