- Home
- Entertainment
- Illu Illalu Pillalu: బాధలో మరోసారి వల్లి ఆత్మహత్యా ప్రయత్నం.. ధీరజ్‌ను మోసం చేసేందుకు భద్రావతి కుట్ర!
Illu Illalu Pillalu: బాధలో మరోసారి వల్లి ఆత్మహత్యా ప్రయత్నం.. ధీరజ్‌ను మోసం చేసేందుకు భద్రావతి కుట్ర!
Illu Illalu Pillalu: స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రోజుకో మలుపుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నవంబర్ 6 ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇక్కడ ఇచ్చాము. శ్రీవల్లి తన జీవితంలో పెద్ద నిర్ణయాన్ని తీసుకుంటుంది.

వల్లి ఆత్మహత్యా ప్రయత్నం
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నవంబర్ 6 ఎపిసోడ్లో శ్రీవల్లి జీవితంపై విరక్తితో ఉంటుంది. నర్మద ఆమెకు ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని చెబుతుంది. అత్తయ్య మామయ్య ఎంత ప్రయత్నించినా చందు బావ మాటవినడం లేదని, విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడని అంటుంది. దీంతో శ్రీవల్లి బాధతో ఫోన్ పెట్టేస్తుంది. వల్లి తీవ్రమైన ఆవేదనలో తన భర్త లేని జీవితం ఎందుకని అనుకుంటుంది. రోడ్డుపైకి వెళ్లి లారీకి ఎదురుగా నిల్చుంటుంది. కానీ అదే సమయానికి నర్మద వచ్చి కాపాడుతుంది. చావడం వల్ల ఏమీ సాధించలేవని, బతికి నీ మంచితనం నిరూపించుకోవాలని వల్లి చెంపదెబ్బ కొట్టి మరీ హెచ్చరిస్తుంది.
తనను తిరిగి ఇంట్లోకి తీసుకెళ్లే బాధ్యత తీసుకోవాలని వల్లి నర్మదను కోరుతుంది. అందుకు నర్మద అంగీకరిస్తుంది. అయితే వల్లి నిజంగా మారిందని అందరికీ తెలియడానికి కొంత సమయం పడుతుందని చెబుతుంది. కోర్టు ప్రక్రియలో తొందరపడి ఎలాంటి సంతకాలు చేయొద్దని సలహా ఇస్తుంది.
భద్రావతి ప్లాన్
మరోవైపు ధీరజ్‌ను దెబ్బతీయడానికి భద్రావతి భారీ ప్లాన్ వేస్తుంది. చింతామణితో కలిసి డబ్బులు, బాండ్ పేపర్లు సిద్ధం చేయిస్తుంది. చిన్న పొరపాటు జరిగినా ధీరజ్ తప్పించుకోలేడని చింతామణికి చెబుతుంది. ధీరజ్‌ను కూడా రామరాజులాగే తన ఇంటి పాలేరుగా మార్చాలని భద్రావతి కుట్ర పన్నుతుంది.
వల్లిపై రామరాజు జాలి
మరోవైపు వల్లిని ఇంటికి తీసుకొచ్చే విషయంలో రామరాజు, వేదవతి మధ్య వాదన జరుగుతుంది. చందు కోపంలో విడాకుల నిర్ణయం తీసుకున్నాడని, వల్లి తప్పు తెలుసుకుని మారితే మరో అవకాశం ఇవ్వాలని రామరాజు భావిస్తాడు. సుకన్య కూడా వచ్చి వల్లి మంచిదని, భాగ్యం మాటలు వినే ఇదంతా చేసిందని చెబుతుంది. సుకన్యపై సీరియస్ అవుతుంది వేదవతి. చందుకు మరో పెళ్లి చేయకండని సుకన్య వేదవతిని కోరుతుంది. వల్లి చేసిన పనికి విడాకులు ఇచ్చినా తప్పులేదని అంటుంది. అయితే రామరాజు మాత్రం వేదవతిని అడ్డుకుంటాడు. చందుకు ఏదో మూల వల్లిపై ప్రేమ ఉంటుందని అంటాడు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసిపోతుంది.





