MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • NTR-Trivikram Movie: ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సంచలన ప్రాజెక్ట్.. పూనకాలు తెప్పిస్తోన్న పోస్టర్‌

NTR-Trivikram Movie: ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సంచలన ప్రాజెక్ట్.. పూనకాలు తెప్పిస్తోన్న పోస్టర్‌

`అరవింద సమేత` తర్వాత ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది. తాజాగా ఈ సంచలన ప్రాజెక్ట్ ని ప్రకటించారు. పోస్టర్‌ మాత్రం మైండ్‌బ్లోయింగ్‌ అనేలా ఉంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 29 2026, 06:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సంచలన మూవీ
Image Credit : Asianet News

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సంచలన మూవీ

టాలీవుడ్‌లో మరో సంచలన ప్రాజెక్ట్ సెట్‌ అయ్యింది. ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది. వీరి కాంబినేషన్‌లో రాబోతున్న రెండో సినిమా అధికారిక ప్రకటన వచ్చేసింది. కార్తికేయుడి కథతో సినిమా రూపొందనుంది. తాజాగా దీన్ని ప్రకటించారు. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ మూవీ రూపొందనుంది. ఎస్‌ రాధాకృష్ణ(చినబాబు) నిర్మించనున్నారు. ఈ సోమవారం సాయంత్రం ఈ మూవీని అధికారికంగా ప్రకటించారు. ఇందులో `శివుని కుమారుడు, పార్వతీదేవి గర్వకారణం, శాశ్వత సేనాని` అనే క్యాప్షన్‌తో ఈ సినిమాని ప్రకటించడం విశేషం. ఇది అంచనాలను పెంచుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పూనకాలు తెప్పిస్తోన్న పోస్టర్‌
Image Credit : Asianet News

పూనకాలు తెప్పిస్తోన్న పోస్టర్‌

తాజాగా విడుదల చేసిన పోస్టర్‌ పూనకాలు తెప్పిస్తుంది. యుద్ధభూమి కనిపిస్తుంది. కార్తికేయుడి ఆయుధం కనిపిస్తోంది.  వేల మంది సైనికులు వీరమరణం పొందారు. లుక్‌ మాత్రం మైండ్‌ బ్లోయింగ్‌ అని చెప్పొచ్చు. సినిమా గురించి టీమ్‌ చెబుతూ, విజయాలు సాధించే చిత్రాలు ఎన్నో వస్తుంటాయి. కానీ, చరిత్ర సృష్టించి, చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి అరుదైన అద్భుతానికి శ్రీకారం చుట్టారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఎన్నో ఏళ్లుగా సినీ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న క్షణం ఎట్టకేలకు వచ్చింది. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటైన ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రాబోతున్న మరో భారీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.

34
ఎన్టీఆర్‌ విశ్వరూపం
Image Credit : The hans india

ఎన్టీఆర్‌ విశ్వరూపం

గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మరోసారి ఈ నటుడు-దర్శకుడు ద్వయం, భారతీయ చలనచిత్ర రంగంలో సరికొత్త రికార్డులను సృష్టించేందుకు, ఒక అసాధారణమైన సినిమా ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రం దైవిక నేపథ్యంతో రూపుదిద్దుకోనుంది. పురాణాల స్ఫూర్తితో సాగే కథనం, లోతైన భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన యుద్ధ సన్నివేశాలు, అద్భుతమైన సరికొత్త ప్రపంచ నిర్మాణంతో ఈ చిత్రం ప్రేక్షకులకు అపూర్వమైన అనుభూతిని అందించనుంది. ఎన్టీఆర్ నట విశ్వరూపానికి, త్రివిక్రమ్ కలం బలానికి తోడుగా ఈ దైవిక కథాంశం తోడవ్వడం సినిమాపై అంచనాలను ఆకాశాన్నంటేలా చేస్తోంది.

44
దృశ్య కావ్యం కాబోతున్న ఎన్టీఆర్‌ త్రివిక్రమ్‌ మూవీ
Image Credit : Indian Express

దృశ్య కావ్యం కాబోతున్న ఎన్టీఆర్‌ త్రివిక్రమ్‌ మూవీ

ఈ  చిత్రం కోసం అత్యున్నత స్థాయి సాంకేతిక బృందం పని చేస్తోంది. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. తనదైన నేపథ్య సంగీతంతో, పాటలతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లనున్నారు. ఈ చిత్రానికి ఆయన అందించే సంగీతం ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. ఈ ప్రపంచస్థాయి భారీ చిత్రాన్ని నిర్మించడానికి అగ్ర నిర్మాణ సంస్థలు చేతులు కలిపాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు), ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అత్యంత   భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన నటుడు–దర్శకుడు కలయికల్లో ఒకటైన ఎన్టీఆర్–త్రివిక్రమ్ జోడీ, రెండు అగ్ర నిర్మాణ సంస్థలతో కలిసి మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ చిత్రం భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత భారీ స్థాయి దృశ్యకావ్యాల్లో ఒకటిగా నిలవనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, చిత్రీకరణ షెడ్యూల్ తదితర వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నాం` అని టీమ్‌ తెలిపింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image2
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Recommended image3
Allu Aravind: పవన్‌ కళ్యాణ్‌ వెండితెరకు పరిచయమై 30ఏళ్లు.. అల్లు అరవింద్‌ ఎమోషనల్‌ నోట్‌
Related Stories
Recommended image1
Rashmi Gautam: యాంకర్‌ రష్మి ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్‌ ఇదే, వామ్మో పెద్దదే.. తాను మాత్రమే దారి తప్పిందట
Recommended image2
Sridevi: మూడు నెలలు స్టార్‌ హీరోతో శ్రీదేవి కాపురం, విడిపోవడానికి కారణమిదే.. జర్నలిస్ట్ సంచలన నిజాలు వెల్లడి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved