MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Jr NTR: 70 ఏళ్ల హీరో కోసం రాసుకున్న కథతో.. ఎన్టీఆర్ యమదొంగ చేసిన రాజమౌళి.. విజయేంద్ర ప్రసాద్ ఏమన్నాడంటే?

Jr NTR: 70 ఏళ్ల హీరో కోసం రాసుకున్న కథతో.. ఎన్టీఆర్ యమదొంగ చేసిన రాజమౌళి.. విజయేంద్ర ప్రసాద్ ఏమన్నాడంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ యమదొంగ ఆయన కోసం రాసిన కథ కాదా? ఈ సినిమా ముందుగా ఏ హీరో కోసం అనుకున్నారు. యమదొంగ మిస్ అయిన సీనియర్ హీరో ఎవరు? రాజమౌళి తారక్ కోసం ఏం చేశాడంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 07 2026, 01:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
యమలోకం కాన్సెప్ట్ తో ఎన్నో సినిమాలు..
Image Credit : our own

యమలోకం కాన్సెప్ట్ తో ఎన్నో సినిమాలు..

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కెరీర్‌లో గుర్తుండిపోయే విజయవంతమైన చిత్రాల్లో యమదొంగ ఒకటి. యముడు, మనిషి, యమలోకానికి వెళ్లి తిరిగి భూమికి చేరుకునే అంశాలతో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది. 

గతంలో యమలోకంలో హీరోల కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఏ సినిమా ప్రత్యేకత దానిదే. యమదొంగ కథ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ కూడా ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
యమదొంగ ఎన్టీఆర్ కోసం రాసిన కథ కాదా?
Image Credit : our own

యమదొంగ ఎన్టీఆర్ కోసం రాసిన కథ కాదా?

యమదొంగ సినిమా కథ నిజానికి తారక్ కోసం రాసింది కాదు.ఈ విషయాన్నిరీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. యమదొంగ కథను మొదటగా జూనియర్ ఎన్టీఆర్ కోసం రాయలేదని, ఆ కథ అసలు నటుడు మోహన్ బాబు కోసం రాసుకున్నదని చెప్పారు. విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ''పురాణాల ప్రకారం నరకంలో ఏది తక్కువగా ఉంటే ముందు అదే అనుభవించేలా చేస్తారు. ఒక వ్యక్తికి పుణ్యం తక్కువగా ఉంటే ముందుగా స్వర్గానికి పంపిస్తారు.. ఆతరువాత నరకానికి పంపుతారు. పాపం తక్కువగా ఉంటే ముందుగా నరకానికి పంపిస్తారు.. ఆతరువాత స్వర్గానికి పంపిస్తారు. అయితే పుణ్యం, పాపం రెండూ సమానంగా ఉన్న వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి కథ పుట్టింది'' అని ఆయన తెలిపారు.

34
మోహన్ బాబు మిస్ అయ్యి.. తారక్ తో
Image Credit : Yamadonga

మోహన్ బాబు మిస్ అయ్యి.. తారక్ తో

విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. పాపం పుణ్యం సమానంగా చేసిన వ్యక్తినే కథలో హీరో పాత్రగా రూపొందించాము. యముడు అలాంటి వ్యక్తిని మరిన్ని తప్పులు చేయమంటూ తిరిగి భూమికి పంపిస్తాడనే కథాంశంతో ఈ కథను డెవలప్ చేశాము. చాలా సంవత్సరాల క్రితమే ఈ కథను రాసుకున్నాము. ఆ కథ గురించి ముందుగానే రాజమౌళి కి తెలుసు. ఒక రోజు రాజమౌళి వచ్చి అదే కథతో సినిమా చేద్దామని అడిగాడు. అయితే నేను ఈ కథను ఎన్టీఆర్ కోసం రాయలేదు.. మోహన్ బాబు కోసం రాసుకున్నానని చెప్పాను. కానీ చివరకు కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి జూనియర్ ఎన్టీఆర్ తో యమదొంగ పేరుతో చేయాల్సి వచ్చిందని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.

44
బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ గా..
Image Credit : our own

బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ గా..

దాదాపు 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా భారీ రెస్పాన్స్ ను సాధించింది. అప్పటి వరకూ చాలా లావుగా కనిపించిన ఎన్టీఆర్.. ఈసినిమాలో స్లిమ్ లుక్ లో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఏ మోహన్ బాబు కోసమైతే రాజమౌళి తండ్రి ఈ కథను రాసుకున్నాడో.. ఆసినిమాలోనే యముడి పాత్రను మోహన్ బాబుచేత వేయించారు. ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో ముచ్చటగా వచ్చిన మూడో బ్లాక్ బస్టర్ మూవీ యమదొంగ.. బాక్సాఫీస్ దగ్గర కూడా భారీగా కలెక్షన్స్ ను రాబట్టింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఎస్.ఎస్. రాజమౌళి
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Related Stories
Recommended image1
Balakrishna: సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ ఇద్దరితో రొమాన్స్ చేసిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
Youtube: 174 కోట్ల వ్యూస్, 7 కోట్ల లైక్ లు, ఇండియాలో ఈ సౌత్ సాంగ్ ను కొట్టేపాట రావడం కష్టమే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved